నమ్మండి! ఇది నిజం!!

తేలే పోస్టాఫీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూట నలభై ఏళ్లుగా అమెరికాలో ఓ అపూర్వమైన పోస్ట్ఫాస్ పని చేస్తోంది. అది ప్రేమలేఖలు, పీజాలు ఇలా చాలా వాటిని బట్వాడా చేసింది. ఓసారి గొర్రెని కూడా బట్వాడా చేసింది. ప్రపంచంలో నీటి మీద తేలే పోస్ట్ఫాస్ ఇదొక్కటే. ఆ ప్రైవేట్ పోస్ట్ఫాస్ పేరు జె.డబ్ల్యు.వెస్ట్ కాట్ కంపెనీ.
డెట్రాయిట్ నగరానికి సమీపంలో, అమెరికా - కెనడా మధ్య డెట్రాయిట్ నది సరిహద్దుగా ఉంది. జె డబ్ల్యు వెస్ట్ కాట్ అనే పడవ 140 ఏళ్లుగా పోస్ట్ఫాస్‌గా పని చేస్తూ నీటిలోని ఓడలకి ఉత్తరాలని బట్వాడా చేస్తోంది. దీని జిప్ కోడ్ 48222. అమెరికాలో జిప్ కోడ్ ఉన్న పడవ ఇదొక్కటే. ఈ పడవని చూడగానే ఓడ సిబ్బంది ఓ తాడుని ఆ పడవలోకి విసురుతారు. తమ ఉత్తరాలు గల ఓ దీర్ఘ చతురస్రాకారపు పెట్టెని దానికి కట్టగానే పైకి లాక్కుంటారు. ఇదంతా కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. తర్వాత అది మరో ఓడ దగ్గరికి వెళ్తుంది. ఈ నది మీద ఏడాదికి 16 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల కార్గోని దాదాపు వెయ్యి అడుగుల పొడవుగల అనేక వందల ఓటలు రవాణా చేస్తూంటాయి. ప్రతీరోజు 45-60 ఓడలు వచ్చి వెళ్తూంటాయి.
డెట్రాయిట్ - కెనడాల మధ్యగల అంబాసిడర్ బ్రిడ్జ్ కింద నించి ఈ పోస్ట్ఫాస్ ప్రయాణిస్తుంది. శామ్ బుచానన్ ఈ పడవ కెప్టెన్. హెన్రీ ఫోర్డ్ డెట్రాయిట్‌లోని తన ఫేక్టరీ నించి మొదటి కారుని బయటకి తెచ్చాక ఆ నది మీది ట్రాఫిక్ పెరిగింది. ఇనుము, ఉక్కు, సున్నపు రాయి పరిశ్రమల వల్ల డెట్రాయిట్ నది ప్రపంచంలోని బిజీ నీటి మార్గాల్లో ఒకటి. 2008లో డెట్రాయిట్ నగరం దివాలా పిటిషన్‌ని కోర్ట్‌లో ఫైల్ చేశాక కూడా ఈ పోస్ట్ఫాస్ పని చేస్తోంది.
1950లలో ఈ సీజన్‌లో ఈ పోస్ట్ఫాస్ పది లక్షల ఉత్తరాలని, పేకెట్స్‌ని బట్వాడా చేసింది. ఐతే కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు దాంట్లో సగం ఉత్తరాలని మాత్రమే బట్వాడా చేస్తోంది. జె డబ్ల్యు వెస్ట్ కాట్ పడవ స్థానంలో ఇప్పుడు నలభై ఐదు అడుగుల పొడవైన, 1949లో నిర్మించబడ్డ పడవ పని చేస్తోంది. సాంకేతికంగా ఈ పడవ అమెరికా పోస్టల్ సర్వీస్ కిందకే వస్తుంది. మరో పడవ జోసెఫ్ జె హోగన్ ప్రత్యామ్నాయ పడవగా సదా సిద్ధంగా ఉంటుంది. రోజుకి ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులు చొప్పున ఏప్రిల్ మధ్య నించి డిసెంబర్ దాకా రోజుకి మూడు షిఫ్ట్‌లలో ఈ పడవ పని చేస్తూనే ఉంటుంది.
నెలల తరబడి బొగ్గు, ముడి ఇనుము, సున్నపు రాతిని రవాణా చేస్తూ ఆ నది మీదే ఓడల్లో ఉండే నావికులకి ఇంటి నించి బంధం ఈ పడవ ద్వారానే. మెయిల్ ఇన్ ఏ పెయిల్ (ఉత్తరాలు బాల్చీలో) అనే పద్ధతిలో తాడుతో ఉత్తరాలుగల అట్ట పెట్టెని పైకి చేదుకుని ప్రేమలేఖలని, కాఫీ, సిగరెట్లని, టూత్‌పేస్ట్, టీవీ, టాయ్‌లెట్ పేపర్ మొదలైన వాటిని అందుకుంటారు. ఇటీవల పీజాలని కూడా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా తెప్పించుకుంటున్నారు. రంజాన్ సమయంలో అరబ్ అమెరికన్ నావికుల భార్యలు ఇంట్లో చేసిన వంటకాలని ఈ పోస్టల్ సర్వీస్ ద్వారా పంపుతున్నారు. రంజాన్ సమయంలో ఓసారి ఓ గొర్రెని కూడా వీరు బట్వాడా చేశారు.
గత ముప్పై ఏళ్లుగా ఆర్లన్ ఎర్ల్ అనే ఆమె ఓడల్లోకి పువ్వులని పోస్ట్ఫాస్ ద్వారా అమ్ముతోంది. పోస్ట్ఫాస్ కెప్టెన్ రియాన్ లాగ్ బుక్‌లో ఇలా రాశాడు.
‘ఓసారి ఓ నావికుడి ప్రియురాలిని అతని భార్య చూడకుండా నావికుడి ఓడలోకి ఎక్కించి, అతని భార్యని నా పడవలో డెట్రాయిట్ నగరానికి తెచ్చాను’
సిబ్బంది ఉత్తరాలని సార్టింగ్ చేయడం, వచ్చే ఓడల వివరాలని నమోదు చేయడం చేస్తూంటారు. ఈ పడవ యజమాని నాలుగో తరానికి చెందిన జిమ్ హోగన్. ఈ కుటుంబ వ్యాపారాన్ని అమెరికన్ పోస్ట్ఫాస్ లైసెన్స్‌తో నడుపుతున్నాడు. జిమ్ హోగన్ టీచర్‌గా ఉద్యోగం చేయాలనుకున్నాడు కాని తండ్రి కోరిక మీద కుటుంబ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. హోగన్ ముత్తాత జాన్ వార్డ్ వెస్ట్‌కాట్ 1874లో ఈ సేవని అమెరికన్ పోస్ట్ఫాస్ లైసెన్స్‌తో ఆరంభించాడు. అతను తన జీవితంలోని ఎక్కువ కాలాన్ని నేల మీద కంటే నీళ్లల్లోనే గడిపాడు. అతని పెళ్లి కూడా ఓ ఓడలోనే జరిగింది. వైర్‌లెస్ కనిపెట్టక మునుపు ఓడ నించి ఒడ్డుకి సందేశాలు చేరడానికి ఈ సేవ ఉపయోగపడేది. అలాగే ఏ డాక్‌లో ఓడని ఆపాలో వారి కంపెనీల నించి సమాచారం ఈ పడవ ద్వారానే తెలిసేది.
ఇతని దగ్గర పనిచేసిన ఇద్దరు 1902లో పోటీగా ఇలాంటి సేవని ఆరంభించారు. కాని అది దివాలా తీసింది. 1948 నించి ఇది అధికారికంగా యుఎస్ పోస్టల్ సర్వీస్ మెయిల్ బోట్‌గా మారింది.
ప్రతీ ఉదయం డెట్రాయిట్‌లోని వివిధ ప్రాంతాల నించి ఈ పడవకి ఉత్తరాల సంచీలు అందుతాయి. కొందరు పర్యాటకులు ఈ పడవలో ప్రయాణించి వెనక్కి వస్తూంటారు. ఈ పడవలో ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేసి నావికులకి ఉత్తరాలని ఉచితంగా ఇస్తున్నారు. అక్టోబర్ 1982లో పర్యాటకుడిగా ఈ పడవ ఎక్కిన ఓ వ్యక్తి ఇందులో ఉద్యోగంలో చేరి నేటికీ కొనసాగుతున్నాడు.
‘పూర్వం సెంట్ వాసనల ఉత్తరాలని చూసి నావికులు వాటిని ముద్దు పెట్టుకునేవారు. కాని ఆధునిక కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు ఉత్తరాల సంఖ్య తగ్గి వస్తువుల రవాణా అధికంగా సాగుతోంది’ జిమ్ హోగన్ చెప్పాడు.

- padmaja