నమ్మండి! ఇది నిజం!!

మృత్యుగృహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1950లలో హాంకాంగ్‌కి వెళ్లిన పర్యాటకులని గైడ్లు కేట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌కి తప్పనిసరిగా తీసుకెళ్లేవారు. అక్కడ ఓ బల్ల ముందు పుట్టుగుడ్డి ఐన ఓ ముసలివాడు, ఆయన ఆరేళ్ల మనవడు సదా ఉండేవారు. పనె్నండు హాంకాంగ్ డాలర్లు, అంటే దాదాపు రెండు అమెరికన్ డాలర్లని చెల్లిస్తే ఆయన ఓ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు. ఏమీ చూడకపోయినా ఆయనకి అన్నీ తెలుసు. రాయడం, చదవడం రాని ఆయన దాన్ని సన్నటి పుల్లతో ఓ కాగితం మీద రాసేవాడు. మనవాడు దాన్ని పెన్సిల్‌తో ట్రేస్ చేసేవాడు. అది జవాబు అవుతుంది. చూడలేని వాడు రాస్తాడు. చదువు రానివాడు ట్రేస్ చేస్తాడు. జీవితంలో తీవ్ర సమస్యలు ఉన్నవారు ఆ ఖర్చుకి వెనుకాడేవారు కాదు.
బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే లెఫ్టినెంట్ హేరీ ఫ్రేజర్ కూడా హాంకాంగ్‌కి బదిలీ ఐన కొత్తల్లో పర్యాటకుడిగా ఇతని గురించి తెలుసుకున్నాడు. కాని రెండు డాలర్లు ఇచ్చి తెలుసుకోవాలని అనుకునే సమస్యలు ఏమీ అతనికి లేవు.
హేరీ కొద్ది వారాల తర్వాత నర్స్‌గా పనిచేసే మైలింగ్ అనే స్థానిక చైనీస్ యువతితో ప్రేమలో పడ్డాడు. వారి పరిచయమైన మూడు నెలల తర్వాత అకస్మాత్తుగా అతని రెజిమెంట్‌ని మర్నాటి రాత్రి లండన్‌కి తరలిస్తున్నారని తెలిసింది. ఆ విషయాన్ని అతను రహస్యంగా ఉంచాలి. దాంతో ఆమెకి చెప్పలేదు. తనని వెంటనే, మర్నాడు పెళ్లి చేసుకోవాలని కోరాడు. కాని ఆమె అందుకు సందేహించింది. దాంతో విషయం వివరించాడు. మూడు నెలల పరిచయంతో అతన్ని పెళ్లి చేసుకుని అతని వెంట కొత్త దేశానికి వెళ్లడానికి భయపడింది. అదే సమయంలో అతనికి దూరంగా ఉండలేకపోయింది. ఫ్రేజర్ అప్పటికే తన పై అధికారుల నించి ఆమెని పెళ్లి చేసుకోడానికి తీసుకున్న లైసెన్స్‌ని చూపించి, దాని మీద అంగీకారంగా సంతకం చేయమని, దాన్ని మర్నాడు ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలని కోరాడు.
ఆమె సరే అనకపోవడంతో ఆమె ఇంకెవర్నైనా ప్రేమిస్తోందా అని భయపడ్డాడు కూడా. ఫ్రేజర్ తెల్లవాళ్లకి తనని భార్యగా పరిచయం చేస్తే వారు అతన్ని చిన్నచూపు చూస్తారని ఆమె భయపడింది. విదేశస్థురాలైన తన వల్ల ఓ రోజు అతని ప్రమోషన్ కూడా ఓ రేంక్ దగ్గర ఆగిపోవచ్చని భావించింది. అతని మీదగల ప్రేమ వల్ల తన ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడింది. తన నిర్ణయం చెప్పడానికి కొంత సమయం అడిగి, సంతకం చేసింది.
మర్నాడు పూలగుత్తితో మైలింగ్ ఇంటికి వెళ్లిన ఫ్రేజర్‌కి ఆమె ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిందని ఇంటావిడ చెప్పడంతో నివ్వెరపోయాడు. కాని ఎక్కడికి వెళ్తోందో ఆమె తనకి చెప్పి వెళ్లలేదని చెప్పింది. అంత హఠాత్తుగా ఆమె మాయం అవడానికి కారణం తెలీని ఫ్రేజర్ కలత చెందాడు. ఆ ఉదయం ఆరింటికి ఆమె ఓ రిక్షాలో సామానుతో వెళ్లిపోయిందని మాత్రం ఇంటావిడ చెప్పింది.
వెంటనే తీవ్రమైన ప్రేమలో ఉన్న ఏ మనిషైనా చేసే పనే చేశాడు. ఆమె కోసం రిక్షాలో హాంకాంగ్ వీధులన్నీ వెదకసాగాడు. తన కల్నల్‌కి ఫోన్ చేసి వారం తర్వాత తన భార్యతో లండన్‌కి తిరిగి రావడానికి అనుమతి కోరాడు. ఆయన అందుకు నిరాకరించి ఆ రాత్రి పదకొండుకల్లా హార్బర్‌కి చేరుకోవాలని శాసించాడు. ఫ్రేజర్ రాత్రి ఎనిమిది దాకా పిచ్చివాడిలా మైలింగ్ కోసం వెదుకుతూ కేట్స్ స్ట్రీట్‌లోకి వచ్చాడు. అతనికి పర్యాటకుడిగా తనని గైడ్ తీసుకెళ్లిన హోటల్ కనపడగానే ఆ గుడ్డి జ్యోతిష్యుడు గుర్తొచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాడు. ఆ గుడ్డివాడు, ఆయన మనవడు అక్కడ కనిపించారు. అతను ‘ఇంగ్లీష్ వచ్చా?’ అని ఆ వృద్ధుడిని అడిగాడు. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ వారి పాలనలో ఉంది కాబట్టి అక్కడ చాలామందికి ఇంగ్లీష్ వచ్చు.
పనె్నండు హాంకాంగ్ డాలర్లని ఇవ్వమని, ఒక్క ప్రశ్నకి మాత్రమే ఆ రోజు జవాబు చెప్తానని ఆయన బదులు చెప్పాడు. వెంటనే ఆయనకి డబ్బు చెల్లించి మైలింగ్ ఎక్కడ ఉందని అడిగాడు. ‘నిజం నిన్ను బాధించచ్చు. ఐనా ఫర్వాలేదా?’ అని అడిగి తర్వాత ఆయన వెంటనే పుల్లని అందుకుని తన ముందున్న కాగితం మీద దాంతో గీతలు గీశాడు. తర్వాత తన వెనక అట్టపెట్టెల మీద కూర్చున్న మనవడ్ని రమ్మని పిలిచాడు. ఆ కుర్రాడు కాగితం మీద ఒత్తుగా పడ్డ గీతల మీద నల్ల సిరాతో ట్రేస్ చేశాడు. ఆ చైనీస్ అక్షరం ఏమిటో ఫ్రేజర్‌కి తెలీదు. ఆ ముసలి జ్యోతిష్యుడు చదువు వచ్చిన ఎవరికి ఆ కాగితం చూపించినా దాని అర్థం చెప్తారని చెప్పాడు.
నమ్మకం లేకపోయినా అదే ఆఖరి ఆశ కాబట్టి ఫ్రేజర్ ఆ కాగితంతో బయటకి వెళ్లి చదువుకున్న వారిలా కనిపించే నలుగురైదుగురికి చూపించి దాని అర్థం ఏమిటని అడిగాడు.
‘మృత్యుగృహం’ అంతా చెప్పారు.
అతను మళ్లీ వెనక్కి వెళ్లి ఆ జ్యోతిష్యుడికి అది చెప్పి దాని అర్థం ఏమిటని చెప్పాడు. హాంకాంగ్‌లో మరణానికి దగ్గరైన బీదవారు సౌకర్యంగా, గౌరవంగా మరణించడానికి దాతలు అనేక మృత్యుగృహాలని ఏర్పాటు చేశారని, అలాంటివి దాదాపు నాలుగు వందల పైనే ఉన్నాయని ఆయన చెప్పాడు. మైలింగ్ ఏ మృత్యుగృహంలో ఉందో చెప్పమని ఫ్రేజర్ కోరితే ఒకరికి ఒకరోజు ఓ ప్రశ్నకి మించిన జవాబు దొరకదని నిరాకరించాడు.
మూడు గంటల్లో నాలుగు వందల ఇళ్లని ఎలా వెదకగలడు? ఫ్రేజర్ సమీపంలోని కొన్ని మృత్యుగృహాలకి వెళ్లి అక్కడి వారిని చూస్తే మైలింగ్ లేదు. నాలుగో గృహం నించి బయటకి రాగానే నుదుట గాటున్న ఓ రిక్షావాలా రిక్షా కావాలా అని అడిగాడు. చేతి గడియారం చూసుకుంటే పదీ పది. టైం అయిపోవడంతో హార్బర్‌కి తీసుకెళ్లమని రిక్షా ఎక్కాడు. రిక్షావాడు దారిలో ఓ చోట శ్రమ తీర్చుకోడానికి రిక్షాని ఆపాడు. పక్కనే ఉన్న భవంతి మీద ‘ది హౌస్ ఆఫ్ ది డెడ్’ అనే ఇంగ్లీష్ బోర్డ్‌ని చూసి ఫ్రేజర్ లోపలికి వెళ్లాడు. అక్కడ మరణానికి సిద్ధంగా ఉన్న బీదలని చూశాడు. కాని వారిలో మైలింగ్ లేదు. విచారంగా బయటకి వస్తూంటే ఓ గదిలోకి నడిచే నర్స్ నడకని గుర్తు పట్టి, పరిగెత్తుకెళ్లి ఆమెని కౌగిలించుకున్నాడు. తను ఆమెని ఎలా కనుగొన్నాడో క్లుప్తంగా చెప్పి తనతో రమ్మని కోరాడు. మంచం మీది మరణించిన బీద రోగిని చూసి, అతను ఎప్పుడు మరణించాడని అడిగాడు. ఇరవై నిమిషాల క్రితం అని జవాబు చెప్పింది. అతను తనని అక్కడికి తెచ్చిన నుదుట మచ్చగల రిక్షావాడిగా గుర్తుపట్టిన ఫ్రేజర్ ఆశ్చర్యపోయాడు. ఆ రోగి మరణించే ముందు ఏదైనా మాట్లాడమని తనని కోరితే ఫ్రేజర్ కోసం తను చేసిన త్యాగం గురించి చెప్తానని ఆమె చెప్పింది.
ఇద్దరూ బయటకి వచ్చి చూస్తే రిక్షా కాని, ఆ రిక్షావాడు కాని అక్కడ కనపడలేదు. మరో రిక్షాలో ఫ్రేజర్ మైలింగ్‌తో సమయానికి హార్బర్ చేరుకున్నాడు. ఇద్దరూ ఓడ ఎక్కారు. 1952లో జరిగిన ఇది ఎలా సాధ్యం అయిందో ఆ దేవుడికే తెలియాలి.

- పద్మజ