నమ్మండి! ఇది నిజం!!

మరణ కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1901... బ్రిటన్‌కి చెందిన లీసా గారిక్ వయసు 11. తండ్రి ఆమెకి బాలె నృత్యాన్ని నేర్పించడానికి ఇంటికి వచ్చి బోధించే టీచర్ని నియమించాడు. కాని లీసాకి అది నేర్చుకోవడం ఇష్టం లేక టీచర్ వచ్చినప్పుడల్లా పారిపోతూండేది. గవర్నెస్ వెతికి లీసాని టీచర్ దగ్గరికి తీసుకెళ్తూండేది. కుడి చేత్తో ఓ ఆధారాన్ని పట్టుకుని, ఎడం కాలిని పైకెత్తి టీచర్ ‘వన్, టు త్రీ, ఫోర్’లని చెప్తూంటే దాన్ని ముందుకీ వెనక్కీ కదపడం లీసాకి ఇష్టం ఉండేది కాదు. కాని ఆమె తండ్రి మాత్రం ఆ దృశ్యాన్ని ఆనందంగా చూస్తూ లీసా చక్కటి బాలరీనా అవుతుందని ఆశించేవాడు.
ఇలా కొన్ని వారాలు సాగాక లీసా విశాలమైన హాల్ మధ్యకి వెళ్లి నిలబడి రెండు చేతులతో గౌను అంచులని పట్టుకుని తిరగసాగింది. టీచర్ పియానోని వాయించడం ఆపినా లీసా ఇంకా తిరుగుతూండటంతో, ‘ఆగు లీసా’ అని ఆమె రెండు, మూడుసార్లు అరిచింది. లీసాకి ఆ గాజు షాండ్లియర్ గలగలమంటూ అటు ఇటూ ఊగడం, చివరికి పైకప్పు పెళ్లలు ఊడిపోయి షాండ్లియర్ కింద పడటం కనిపించి, కెవ్వున అరిచి, నేల మీద స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి కంగారుగా కూతురు దగ్గరికి పరిగెత్తేసరికి ఆమె స్పృహలో లేదు.
డాక్టర్ వచ్చి వైద్యం చేశాక లీసా తేరుకుంది. షాండ్లియర్ తన మీద కూలిందని భావించింది. కాని అలాంటిదేం జరగలేదని తండ్రి ఓదార్చాడు. ఆ తర్వాత ఆమె షాండ్లియర్ ఉన్న హాల్లోకి వెళ్లాలంటేనే భయపడసాగింది. ఆ గది గుమ్మం దగ్గరే నించుని షాండ్లియర్‌ని చూస్తూండేది. తండ్రి దాని కిందకి వెళ్లి నిలబడి ఏమీ కాదని ధైర్యం చెప్పినా, అది తన మీద తప్ప ఇతరుల మీద పడదని చెప్పేది. ఎవరెంత బలవంతం చేసినా దాని కిందకి వెళ్లడానికి మాత్రం సాహసించేది కాదు. ఆమె కింద పడినప్పుడు తలకి తగిలిన దెబ్బ వల్ల అలాంటి భ్రమ స్థిరపడి ఉండచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డాడు. లీసా తండ్రి ఓ పనివాడిని పిలిచి షాండ్లియర్ బలంగా ఉందో లేదో పరీక్షించమని కోరాడు. దాన్ని పరీక్షించాక అది మరో పాతికేళ్ల దాకా కూలదని పనివాడు చెప్పాడు. క్రమంగా ఆ భయం తొలగి పోతుందని తండ్రి ఆశించాడు కాని వయసు పెరిగే కొద్దీ లీసాలో ఆ భయం అలాగే నిలిచిపోయింది.
పదేళ్లు గడిచినా లీసాలో భయం తొలగలేదు. అనేక రాత్రులు తలుపు తెరచుకుని ఆ హాల్లో షాండ్లియర్ కింద నిలబడాలనే ప్రయత్నం చేసింది కాని ఆ ధైర్యం చేయలేకపోయింది.
‘నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి కావు. ఎందుకలా భయపడతావు?’ అని తండ్రి అడిగినా ఆమె, ‘నీకు తెలీదు. అది నా మీద పడుతుంది’ అని చెప్పేది. తండ్రి ఆమె భయాన్ని గౌరవించడం నేర్చుకున్నాడు. తన కాబోయే భర్తకి తనకి ఉన్న ఆ భయం గురించి చెప్తే, ఆమెది మూఢ భయం అని కొట్టి పారేశాడు. లీసాకి జరిగే ఎంగేజ్‌మెంట్ పార్టీని ఆ హాలులో ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నాడు కాని లీసా వద్దని వారించింది.
ఆ పార్టీలో లీసా కూర్చున్న టేబిల్‌లోని అతిథుల సంభాషణ మరణం వైపు సాగి తాము ఎలా మరణించాలని అనుకుంటున్నారో చెప్పసాగారు. తన భార్య కౌగిలిలో అని ఒకరు, నిద్రలో ప్రశాంతంగా అని మరొకరు, తన మనవలు, మునిమనవలు చుట్టూ ఉండగా పోవాలని ఇంకొకరు, బాగా తినడం వల్ల హార్ట్ అటాక్‌తో అకస్మాత్తుగా పోవాలని ఇంకొకరు చెప్పారు. లీసాని అడిగితే తను ఎలా మరణిస్తుందో తనకి తెలుసని, పైనించి షాండ్లియర్ తల మీద పడి మరణిస్తానని చెప్పింది.
ఆ రాత్రి బాలె డేన్స్ సంగీతం రికార్డుని పెట్టి ఆమె డేన్స్ చేస్తూ దాని కిందకి వెళ్లాలని ప్రయత్నించింది కాని భయంతో విఫలమైంది. ఆమె కాబోయే భర్త జాన్ తామిద్దరూ కలిసి ఉండగా షాండ్లియర్ పడదని నచ్చజెప్పి ఆమెతో నృత్యం చేస్తూ దాని కిందకి తీసుకెళ్లాడు. తలెత్తి పైకి చూడమంటే ఆమె భయంతో వణికిపోయింది కాని చివరికి చూశాక ఆమెలో భయం కొంత తగ్గింది.
* * *
మరి కొనే్నళ్లు గడిచాయి.
12 జూన్ 1947. ఆ రోజు లీసా మనవరాలి పుట్టినరోజు పార్టీని ఆ హాలులో జరుపుతున్నారు. లీసా గాలి కోసం ఆ హాలులోంచి బయటకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమెకి షాండ్లియర్ ఊగుతున్న గలగల చప్పుడు వినిపించింది. చిన్నప్పుడు అది కూలబోయే ముందు వచ్చిన చప్పుడు లాంటి చప్పుడే. వెంటనే ‘లీసా, లీసా’ అని అరుస్తూ బాల్కనీలోంచి హాల్లోకి పరుగెత్తింది. షాండ్లియర్ మనవరాలు లీసా మీదకి కూలడాన్ని చూసింది.
చాలా ఏళ్ల క్రితం అది కూలడం చూసినట్లుగానే జరిగింది. కాని రెండు తరాల తర్వాత జరిగింది. అది తన మీద కూలుతుంది అనుకుంది కాని లీసా పేరుగల ఆమె మనవరాలికి ఇలా ఎలా జరిగింది? దేవుడికే తెలియాలి.

- పద్మజ