నమ్మండి! ఇది నిజం!!

పునర్జన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో నలభై రెండేళ్ల హెలెన్ మేసన్ తన కూతురు ఆలిస్ పోయిన దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉంది. అక్కడికి పనె్నండు మైళ్ల దూరంలోని మరో ఊళ్లో పనె్నండేళ్ల లోరీ మరణశయ్య మీద ఉంది. ఆమెని పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ స్టెతస్కోప్‌ని చెవుల నించి తీసేసి లోరీ తల్లి మార్గరెట్‌తో చెప్పాడు.
‘ఐయాం సారీ. గుండె ఆగిపోయింది’
వెంటనే మార్గరెట్ ఏడుస్తూ కూతుర్ని కౌగిలించుకుంది.
‘అమ్మా!’ కొద్ది నిమిషాల తర్వాత లోరీ కళ్లు మూసుకునే పిలిచింది.
వెంటనే లోరీ తండ్రి డాక్టర్‌ని వెనక్కి పిలిచాడు. ఆయన లోరీని స్టెతస్కోప్‌తో పరీక్షిస్తూంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆదుర్దాగా చూశారు. ఆ రకం జబ్బుగల వందలకొద్దీ రోగులకి చికిత్స చేసిన ఆయనకి అందులోంచి బయటపడటం అసాధ్యం అని అనుభవపూర్వకంగా తెలుసు. కాని ఆ పిల్ల చావు నించి తప్పించుకోవడంతో డాక్టర్ ఆశ్చర్యపోయాడు.
కళ్లు తెరచి చూసిన లోరీ అక్కడి మనుషులు ఎవర్నీ గుర్తుపట్టక ‘అమ్మ ఏది? మా అమ్మ కావాలి’ అని అడగసాగింది.
షాక్ వల్ల ఆమె అలా మాట్లాడుతోందని, త్వరలో తేరుకుంటుందని డాక్టర్ చెప్పాడు. ఆ అర్ధరాత్రి మెలకువ వచ్చిన మార్గరెట్ లోరీ మంచం దిగి మెయిన్‌డోర్ తలుపు తెరవడం గమనించి ఆపింది. ‘అమ్మ కావాలి. నేను అమ్మ దగ్గరికి వెళ్లాలి’ అని లోరీ ఏడవడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు.
మర్నాడు ఉదయం లోరీ ఆ ఇంట్లోంచి రహస్యంగా బయటపడి ఎండుగడ్డి తీసుకెళ్లే ఓ బండి వాడికి తన తండ్రి పేరు, ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్లమని కోరింది. స్కూల్‌కి వెళ్లకుండా, ఇంకో ఊరు నించి ఇంత దూరం ఎందుకు వచ్చావని మందలించి అతను బండి ఎక్కించుకున్నాడు. తన పేరు ఏలిస్ అని, తన తండ్రి మేసన్ హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతున్నాడని దారిలో మాటల్లో లోరీ చెప్పింది. ఆ బండివాడు ఆ స్టోర్‌లోనే తనకి కావాల్సినవి కొంటూంటాడు. ఏలిస్ చెప్పిన చిరునామాకి చేరుకున్నాక ఆమె అతనికి థాంక్స్ చెప్పి దిగి ఇంటి వైపు పరిగెత్తింది.
‘అమ్మా! అమ్మా!’ అని పిలుస్తూ తలుపు కొట్టింది కాని ఎవరూ తలుపు తెరవకపోవడంతో పోర్చ్‌లోని కుర్చీ కుషన్ కింద దాచిన తాళం చెవిని తీసుకుని తలుపు తెరచి లోపలకి వెళ్లింది. అలవాటుగా తాళం చెవిని మేంటిల్ పీస్ మీద ఉంచి ఇల్లంతా చూస్తే ఎవరూ లేరు. పిల్లల గదిలోకి వెళ్లి టెడ్డీబేర్ బొమ్మని తీసుకుంది. కొద్దిసేపటికి అలికిడి వినపడటంతో కిందకి దిగి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన మేసన్‌ని చూసి ‘నాన్నా’ అని కౌగిలించుకుంది. తనని ఇంట్లోంచి ఎవరో ఎత్తుకుపోయారని, వాళ్లే తన తల్లిదండ్రులని చెప్పారని, తనకి భయంవేసి పారిపోయి వచ్చేసానని ఏడుస్తూ చెప్పి అలసటతో నిద్రపోయింది.
బయటకి వెళ్లిన హెలెన్ రాగానే మేసన్ ఆ పాప విషయం చెప్పాడు. ఆమెకి మతిస్థిమితం లేదని భావించి షెరీఫ్‌కి, డాక్టర్‌కి ఫోన్ చేశారు. షెరీఫ్ థాంసన్ వచ్చి నిద్రపోతున్న పాపని చూశాడు. డాక్టర్ ఆమెకి విశ్రాంతి అవసరం అని చెప్పడంతో లేపకుండా ఆగిపోయారు. మూడు వారాల క్రితం మేసన్, హెలెన్ల కూతురు ఏలిస్ సమీపంలోని సరస్సులో మునిగి మరణించాక వెళ్లిపోయిన కుక్క అకస్మాత్తుగా తిరిగి వచ్చి అలవాటుగా పడుకున్నట్లుగా ఆ పాప పక్కన పడుకోవడం చూసి మేసన్, హెలెన్లు ఆశ్చర్యపోయారు.
ఈలోగా పనె్నండు మైళ్ల దూరంలోని లోరీ తల్లిదండ్రులు కూతురు కనపడకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. అప్పటికే మేసన్ ఇంటికి వచ్చి లోరీని చూసిన షెరీఫ్ ఆ మిస్సింగ్ పర్సన్స్ లుక్ అవుట్ నోటీస్ చదివాడు. వెంటనే వాళ్లని మేసన్ ఇంటికి రప్పించాడు.
నిద్రలోంచి లేచిన లోరీ తన అసలు తల్లిదండ్రులని ఎంత మాత్రం గుర్తుపట్టలేదు. మేసన్, హెలెనే్ల తన తల్లిదండ్రులని చెప్పింది. ఇది చూసి జార్జ్, మార్గరెట్లు తీవ్ర మానసిక వేదనకి గురయ్యారు. లోరీ వారి వెంట వెళ్లడానికి ఎంతమాత్రం ఇష్టపడకపోవడంతో డాక్టర్ సలహా మీద వారు బాధగా తమ ఇంటికి వెళ్లిపోయారు.
ఆమె తన కూతురు కాదని, తన కూతురు మరణించిందని చెప్పి ఏడ్చే హెలెన్‌తో లోరీ తను జీవించే ఉన్నానని, ఏడవద్దనీ చెప్పింది. మర్నాడు ఉదయం నిద్రలేచాక బాత్‌రూంలోకి వెళ్లిన లోరీ అద్దంలో చూసుకుని కెవ్వున అరిచింది. తన మొహం మారిపోయిందని, ఎందుకిలా జరిగిందని ఏడవసాగింది.
లోరీ ఏలిస్‌లా వారి ఇంట్లోనే నివసించసాగింది. మేసన్ దంపతులని తన తల్లిదండ్రుల్లానే ప్రేమించసాగింది. వారి ముగ్గురికే తెలిసిన ఎన్నో విషయాలని లోరీ ప్రస్తావించడంతో మరణించిన తమ కూతురు ఏలిస్ తిరిగి వచ్చిందనే నమ్మకం క్రమంగా వారిలో కలగసాగింది. అవన్నీ ఎలా తెలిసాయని అడిగితే లోరీ చెప్పలేకపోయింది. ఓ సందర్భంలో మేసన్ ‘ఇంట్లో చేసిన సాధారణ శాండ్‌విచ్ వైట్‌హౌస్‌లో తినే ఖరీదైన వంటకంకన్నా విలువైంది’ అని చెప్పాడు. లోరీ దాన్ని కూడా ప్రస్తావించింది.
ఇలా కొన్ని రోజులు గడిచాక అక్టోబర్ రెండో వారంలో హెలెన్ ఒంట్లో బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్లింది. లోరీ వంట గదిలో తండ్రికి ఇష్టమైన మార్మలేడ్ శాండ్‌విచ్‌ని చేస్తోంది. కొద్దిసేపటికి లోరీ ‘అమ్మా!’ అని అరవడం విని మేసన్ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. నేల మీద స్పృహ లేకుండా పడి ఉన్న లోరీని చూసి కంగారుపడి, మంచం మీద పడుకోబెట్టి డాక్టర్‌కి ఫోన్ చేశాడు. లోరీకి స్పృహ వచ్చాక మేసన్‌ని చూసి ‘మీరు ఎవరు? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? మా అమ్మానాన్నా ఏరి?’ అని అడిగింది. తన తల్లిదండ్రులు మార్గరెట్, జార్జ్ అని చెప్పింది.
వెంటనే అతను జార్జ్‌కి ఫోన్ చేసి తక్షణం రమ్మని కోరాడు. కొద్దిసేపటికి వారు వస్తే లోరీ వాళ్లని గుర్తుపట్టింది. ఆ మార్పుకి వారు సంతోషించారు. హెలెన్ డాక్టర్ దగ్గర నించి తిరిగి వస్తే కాని ఈ మార్పుకి గల కారణం ఎవరికీ బోధపడలేదు. హెలెన్ గర్భవతైంది! ఏలిస్‌గా తను మేసన్, హెలెన్‌ల ఇంట్లో అన్ని రోజులు ఉన్న సంగతి లోరీకి గుర్తులేదు.
ఏలిస్ ఆత్మ అంతకాలం లోరీ శరీరాన్ని ఆవరించుకుని ఉందని, తర్వాత హెలెన్ గర్భంలోకి ప్రవేశించిందని చాలామంది నమ్మకం. జరిగింది మంచికే జరిగింది. కూతురు మరణంతో దాదాపు పిచ్చిదైన హెలెన్, లోరీ రాకపోతే ఆ మర్నాడు ఆత్మహత్య చేసుకుని ఉండేది. ఇంతదాకా ఇలా ఒకరి ఆత్మ మరొకరి శరీరంలో ప్రవేశించిన ఉదంతాలు ప్రపంచంలో అనేకచోట్ల జరిగాయి.

- పద్మజ