నమ్మండి! ఇది నిజం!!

స్నేహమేరా జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహమేరా జీవితం అని నమ్మే ఇద్దరు వ్యక్తుల కథ ఇది. వారిద్దరూ అమెరికన్స్. వారిలో ఒకరి పేరు జోవైట్ హెడ్. మరొకరి పేరు స్టీవ్ మారిస్.
4 ఏప్రిల్, 1976న వారిద్దరూ వెస్ట్ పామ్ బీచ్‌లోని ఎల్‌సిడ్ బార్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తన మిత్రుడికన్నా ఓ సంవత్సరం పెద్దయిన వైట్‌హెడ్ (24) జేబులోంచి పర్స్ తీసి, అందులోంచి ఓ డాలర్ నోట్‌ని తీసి దాన్ని మధ్యకి చింపి చెప్పాడు.
‘సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత మనం ఈ సమయంలో ఇక్కడ కలుసుకుందాం. సరేనా?’
ఇరవై మూడేళ్ల మారిస్ అందుకు అంగీకరిస్తూ చెప్పాడు.
‘పెళ్లి, జీతం తనఖా పెట్టి ఇల్లు కొనడం, పిల్లలు, ఉద్యోగం ఇలా మన ముందు ఎన్నో బాధ్యతలున్నా మనం నలభై ఏళ్ల తర్వాత ఇక్కడ కలుసుకుందాం. ఇందుకు నలభై ఏళ్ల పాటు మనం ఈ సంగతిని మర్చిపోకూడదు’
‘అవును. నేను మర్చిపోనని మాట ఇస్తున్నాను’
వైట్‌హెడ్ తను చింపిన డాలర్ రెండు సగాల మీద 4/4/2016 అనే తారీఖుని రాసి ఓ భాగాన్ని మిత్రుడికిచ్చి చెప్పాడు.
‘మనం మర్చిపోకుండా ఇది గుర్తు చేస్తుంటుంది. నలభై ఏళ్ల తర్వాత మనలో శారీరకంగా ఎంతో మార్పు రావచ్చు. ఒకరిని మరొకరు గుర్తు పట్టలేక పోవచ్చు. కాబట్టి ఆ రోజు దీన్ని మన వెంట తీసుకొందాం’
‘నువ్వు చెప్పింది నిజమే. బార్లో ఇచ్చిన మాట, తాగి తీసుకున్న నిర్ణయంగా మనం కొట్టిపారేయకుండా ఇది ఉపయోగిస్తుంది’ మారిస్ కూడా చెప్పాడు.
వారిద్దరూ ఒకరితో మరొకరు కరచాలనం చేశారు.
ఆ డాలర్ నోట్ నెంబర్ కె 85174839 ఎ. కొద్దికాలం తర్వాత వారు విడిపోయారు. జోవైట్‌హెడ్ రోడ్ ఐలండ్‌కి వెళ్లిపోయాడు.
స్టీవ్ మారిస్ ఏకరేజ్ అనే చోటికి వెళ్లాడు. ఆ తర్వాత వారు ఒకరినొకరు కలుసుకోలేదు. ఇద్దరి జీవితాలు కొంత ఆనందంగా, కొంత వొడిదుడుకులతో సాగాయి. మధ్యమధ్యలో ఇద్దరికీ ఎల్సిడ్ బార్‌లో నలభై ఏళ్ల తర్వాత కలవాలన్న సంగతి జ్ఞాపకం వస్తూనే ఉంది. ఇద్దరిలో కూడా తన మిత్రుడికి ఇది గుర్తుందా? అనే ప్రశ్న మెదలసాగింది.
కాలేజ్ చదువు పూర్తి చేశాక వారిద్దరికీ కేడిలాక్ కారు డీలర్ దగ్గర పని చేస్తూండగా పరిచయం ఏర్పడింది. క్రమంగా మంచి మిత్రులయ్యారు. వారు కలవాల్సిన రోజు దగ్గరైంది. ఇద్దరిలోనూ తన మిత్రుడు వస్తాడా రాడా అనే ఆదుర్దా మొదలైంది. ఆశ్చర్యంగా ఇద్దరూ కూడా ‘మరణిస్తే తప్ప తన మిత్రుడు జీవించి ఉంటే తప్పక వస్తాడ’ని విశ్వసించారు.
ఏప్రిల్ 4, 2016 సోమవారం అయింది. వెస్ట్‌పామ్ బీచ్‌లోని ఎల్సిడ్ బార్, వారి అదృష్టవశాత్తూ ఇంకా నడుస్తూనే ఉంది. ముందు మారిస్ ఆ బార్‌కి చేరుకున్నాడు. ఐతే బార్‌లో వైట్‌హెడ్ కనపడకపోవడంతో కొద్దిసేపు బయటే వేచి ఉన్నాడు. తన వైట్‌హెడ్‌ని గుర్తు పట్టలేనేమో అనే అనుమానంతో తిరిగి బార్‌లోకి వెళ్లి బార్ టెండర్‌తో తన పేరు స్టీవ్ మారిస్ అని, జోవైట్‌హెడ్ అనే వ్యక్తిని కలవడానికి వచ్చానని, తను అతన్ని గుర్తు పట్టలేనేమో అని, తమ ఒప్పందం గురించి చెప్పాడు.
తనని వైట్‌హెడ్ కాంటాక్ట్ చేస్తే మారిస్‌ని చూపిస్తానని చెప్పి బార్ టెండర్ కొందరు పత్రికా విలేఖరులకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి సౌత్ డిక్సి హైవేలోని ఎల్సిడ్ బార్ అడ్రస్ చెప్పాడు.
వైట్‌హెడ్ కూడా బార్‌కి వచ్చి మారిస్‌ని గుర్తు పట్టలేక బార్ టెండర్‌ని తన మిత్రుడి గురించి ప్రశ్నించాడు. అతను ఒకరినొకరికి చూపించాడు. ఇద్దరికీ బట్టతల వచ్చి గుర్తుపట్టలేక పోయారు.
‘నేను నీకోటి ఇచ్చాను. అది తెచ్చావా?’ వైట్‌హెడ్ అడిగాడు. వెంటనే మారిస్ జేబులోంచి పర్స్ తీసి వైట్‌హెట్ 4/4/2016 అని రాసిన డాలర్ నోటు సగం ముక్కని చూపించాడు. ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వైట్‌హెడ్ తన భార్య, ఇరవై నాలుగేళ్ల కూతురు గురించి, మారిస్ తన భార్య, ఇరవై తొమ్మిదేళ్ల కొడుకు గురించి చెప్పుకున్నారు. పత్రికా విలేఖరులు వారిని ఫొటోలు తీసుకున్నారు. బార్ మూసేసేదాకా వారు గతంలో తాము కలిసి కారులో రెండు నెలల పాటు 13 వేల మైళ్లు ప్రయాణించినప్పటి సంగతులని గుర్తు చేసుకున్నారు.
నలభై ఏళ్లపాటు ఏ బంధం సాధారణంగా మన్నదు - బహుశా స్నేహం తప్ప.
విడిపోయేటప్పుడు మారిస్ మరో డాలర్ నోట్‌ని చింపి 4/4/2017 అని తారీఖు రాసి తన మిత్రుడికి ఇచ్చాడు. వారు ఏటా ఆ తారీఖున, 72 ఏళ్ల నించి ఉన్న ఆ బార్‌లో కలవాలని నిర్ణయించుకున్నారు. 4.4.2017న వారు తిరిగి అక్కడ కలుస్తారా?

పద్మజ