నమ్మండి! ఇది నిజం!!

అమెరికాలో ఓ రాజు! ఓ రాజ్యం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికాలోని గ్రామాలని చూడాలంటే అమెరికన్స్ ఆఫ్రికా ఖండానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నార్త్ కరోలినాలోని ఓ గ్రామానికి వెళ్తే చాలు. ఆ గ్రామం పేరు ఓయోటుంజి. ఓయోటుంజి అంటే అర్థం ఓయో మళ్లీ లేచాడు అని. 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గ్రామం నార్త్ కరోలినా స్టేట్ హైవే 17 నించి పది నిమిషాల దూరంలో, ఇంటర్ స్టేట్ 95 హైవేలో ఉంది. చెట్ల మధ్యగల సాధారణ రోడ్ మీద ప్రయాణించి ఈ గ్రామానికి చేరుకోవచ్చు. సైన్ బోర్డులు ఇంగ్లీష్, ఆఫ్రికన్ భాష ఎరూబాలలో ఉంటాయి.
గ్రామం మొదట్లో ఈ నోటీస్ ఉంటుంది. ‘మీరు యు ఎస్‌ని వదిలి, ఎరూబా సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు...’ జెండాలు, కిరీటాలతో అలంకరించిన మరో బోర్డ్ మీద కబో సైల్వా అని రాసి ఉంటుంది. దాని అర్థం ‘మా భూమికి స్వాగతం’
1970లో జుయిడ్‌బి - ఎడె ఫున్మి-1 ఆధునిక డేన్స్ ట్రూప్‌తో హైతీకి వెళ్లినప్పుడు అక్కడ ఆఫ్రికన్ ఎరూబా సంస్కృతిని చూశాడు. వారి ఆహారపు అలవాట్లు, దుస్తులు మొదలైనవన్నీ ఆఫ్రికాకి చెందినవే. అమెరికాలో ఆఫ్రికన్ గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పం అక్కడ అతనికి కలిగింది. తమ వేర్లు ఎక్కడివో ముందు తరాల వాళ్లు మర్చిపోకూడదనే కాంక్షతో తిరిగి వచ్చాక దీన్ని స్థాపించాడు.
పదిహేనో శతాబ్దంలో బానిసలుగా తేబడ్డ ఆఫ్రికన్స్ ఇక్కడి ప్లాంటేషన్స్‌లో పని చేసేవారు. ఆ భూమిలోనే వీరు తమ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆనాటి జనరల్ షెర్మన్ ఇక్కడ నల్ల బానిసలు స్థిరపడాలని వారికి కొంత భూమిని ఉచితంగా ఇచ్చాడు. అమెరికన్ సివిల్ వార్ తర్వాత నలభై ఎకరాలు మిస్టర్ స్మాల్స్ పూర్వీకులకి ప్రభుత్వం నించి లభించాయి. జుయిడ్‌బి - ఎడె ఫున్మి-1 అతన్నించి పాతిక ఎకరాలు కొని దీన్ని నిర్మించాడు. ఈ గ్రామానికి ఎలాంటి సరిహద్దు గోడలూ లేవు. ఇక్కడ ఇళ్లు, ఓ కేఫ్, మార్కెట్ ప్లేస్, మత పరమైన ఎరూబన్ దేవతల కోసం ఎనిమిది ఒరిషాలు (ఆలయాలు) ఉన్నాయి. ఈ గ్రామ వాతావరణంలో అమెరికా అసలు కనపడదు. ఇథియోపియాలోనో, కాంగో లేదా ఉగాండాలోనో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ గ్రామ జెండా ఎరుపు, బంగారం, ఆకుపచ్చ రంగులతో ఇథియోపియా, ఈజిప్ట్ జెండాల ఆధారంగా రూపొందించబడింది. ఈ గ్రామంలోని ఎఫిన్ (పేలస్) నైజీరియాలోని ఐల్ ఇఫె పేలెస్ నమూనాతో రూపొందించారు. ఈ గ్రామం పేరు కూడా 15-19 శతాబ్దాల మధ్య నైజీరియాలోని ఓ ప్రాంతపు ఎరూబన్ సామ్రాజ్యం నించి తీసుకోబడింది. విదేశీ భూమిలా తోచే ఈ గ్రామం మీద స్థానికంగా అనేక వదంతులు ఉన్నాయి.
‘మేము మనుషులని వండుకు తింటామని, కుక్కల్ని కూడా తింటామని, గ్రామంలోకి ఎవరైనా వస్తే తిరిగి ప్రాణాలతో వెళ్లరని ఇలా చాలా వదంతులు మా గ్రామం మీద ఉన్నాయి’ జుయిడ్‌బి - ఎడె - ఫున్మి-2 చెప్పాడు.
2009లో ది గార్డియన్ అనే దినపత్రిక నించి ట్రావెల్ రచయిత అలెన్ వికర్ ఓయోటుంజి గ్రామాన్ని సందర్శించి దాని గురించి ఇలా రాశాడు. ‘ఇది హాస్యాస్పదమైన డిస్నీ ఫాంటసీ. దీని రాజు అద్వితీయమైన దుస్తులని ధరిస్తాడు. అతని కళ్లు దొంగ లాయర్ కళ్లల్లా కనిపించాయి. ఇక్కడ ఆటవిక దేవతా విగ్రహాన్ని చూడచ్చు. ఊడూకి సంబంధించిన ఓ క్రతువులో భాగంగా కోడిని బలి ఇస్తారు’
1981 ‘పీపుల్’ సంచికలో ఈ బలికి సంబంధించిన వస్తువులని ప్రదర్శించారు. 1971లో న్యూస్ అండ్ కొరియర్ అనే మరో పత్రికలో కూడా ఈ క్రతువుకి సంబంధించిన ఫొటోలని ప్రచురించారు. ఆఫ్రికన్స్‌ని బానిసలుగా అమెరికాకి తెచ్చిన అపరాధ భావం వల్ల ఈ ఆఫ్రికన్ గ్రామాన్ని అమెరికాలో అనుమతించారని ఓ వాదన ఉంది. ఆ కారణంగానే ఇక్కడ వారికి భూమి, నగదు, అవసరమైన వస్తువులని, సాంకేతికతని అందజేశారు.
ఓయోటుంజి గ్రామం గురించి అమెరికన్ ప్రెస్‌లో ఏం రాసినా, తెల్లవాళ్లు తమ గ్రామాన్ని అంగీకరించక పోయినా ఈ గ్రామస్థులు పట్టించుకోరు. కోల్పోయిన తమ సంస్కృతి, సాంప్రదాయాలని పునరుద్ధరించుకోవడమే వారి లక్ష్యం. అమెరికాలో ఆఫ్రికన్ దేవతలు కనిపించేది ఇక్కడ మాత్రమే. కొందరు బాప్టిస్ట్ ఫాదర్స్‌కి ఇది కంటగింపుగా కూడా ఉంది. ఐతే మొదటి రాజు తల్లిదండ్రులు బాప్టిస్ట్ క్రిస్టియనే్స. అతని తండ్రి బాప్టిస్ట్ ప్రీస్ట్‌గా ఉండేవాడు. 1970లో జుయిడ్‌బి - ఎడె - ఫున్మి-1కి అనేక బెదిరింపులు అందాయి. ఐతే అతను ఆఫ్రకన్స్ కోసం తను ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వాటిని పట్టించుకోలేదు. ఈ చిన్న గ్రామం మీద 1974 నించి చాలా పుస్తకాలు వెలువడ్డాయి.
అమెరికాలో తెల్లవాళ్లు కనపడని, వారి అధికారం లేని ఏకైక ప్రదేశం ఈ గ్రామం ఒక్కటే. 2000లలో 200 మంది నల్లవాళ్లు ఇక్కడ నివసించేవారు. ప్రస్తుతం పాతిక మంది మాత్రమే ఉన్నారు. ఓయోటుంజి సామ్రాజ్యానికి జుయిడ్‌బి - ఎడె - ఫున్మి-1 మొదటి రాజు. ఆయనకి పధ్నాలుగో సంతానం అయిన 39 ఏళ్ల జుయిడ్‌బి - ఎడె - ఫున్మి-2 ఇప్పుడు ఓబా (రాజు).
ఐతే వీరంతా పూర్తి నలుపు రంగు చర్మం గలవారు కారు. తెల్ల వాళ్ల రక్తం చేరడంతో గోధుమ రంగు చర్మం గల వారు కూడా ఉన్నారు. రాజు ఎడె ఫున్మి-2 అలాంటి చర్మం గలవాడు. అందగాడైన ఇతను ఆఫ్రికన్ తెగ అధిపతిగా వారి సంప్రదాయం ప్రకారం మొహాన్ని రంగులతో అలంకరించుకుని డ్రెస్ చేసుకుంటాడు. కిరీటం పెట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన తెల్ల దుస్తులని ధరిస్తాడు. ప్రస్తుత రాజరిక చిహ్నంగా చేతిలో గుర్రపు తోక వెంట్రుకలు గల కర్రని పట్టుకుని సందర్శకులకి స్వాగతం చెప్తాడు. దీని పేరు ఇరుకెరే. అతను ముందు ఎరూబన్ భాషలో అభివాదం చేసి, తర్వాత హలో అని కరచాలనం చేసి స్వాగతం చెప్తాడు. తమ సంస్కృతికి చెందిన అనేక కథలని కూడా సందర్శకులకి చెప్తాడు.
‘రోమ్ ఒక్క రోజులో నిర్మించబడలేదు. ఓయోటుంజీ కూడా. మేము పదహారో శతాబ్దపు నైజీరియాకి వెనక్కి వెళ్లదలచుకోలేదు. అలా అని మా మూలాలని మర్చిపోదలచుకోలేదు’ అని అతను చెప్పాడు.
ఈ గ్రామస్థురాలైన కంజో మేక్‌క్రై జార్జియా స్టేట్ యూనివర్సిటీలో ఓయోటుంజి మీద థీసిస్ రాసి, హిస్టరీలో పిహెచ్‌డిని సంపాదించింది. ఓయోటుంజికి ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో తమది అమెరికా భూభాగం మీది ఆఫ్రికన్ స్వతంత్ర దేశంగా పేర్కొన్నారు. చాలా మంది బ్లాక్ అమెరికన్స్ క్రిస్టియన్ పేర్ల స్థానంలో ఆఫ్రికన్ పేర్లు పెట్టుకోవడం కూడా జరుగుతోంది. కొందరైతే ఆఫ్రికన్ దుస్తులనే ధరించి ఎరుబా మతంలోకి మారారు. వారి పెళ్లిళ్లు కూడా ఈ సంస్కృతిలోనే జరుపుకుంటున్నారు.
ఇక్కడ సంవత్సరాలని క్రిస్టియన్ శకంతో కాక ఎరూబన్ శకంతో కొలుస్తున్నారు. 1980ల దాకా ఇక్కడ విద్యుచ్ఛక్తి ఆని, నీటి పంపులు కాని ఉండేవి కావు. నల్ల వాళ్లు తమకి దూరంగా నివసించడానికి తెల్లవాళ్లు ఇష్టపడతారు. కాబట్టి దీనికి స్థానిక ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పలేదు. రూట్స్ (టీవీ సీరియల్) గ్లోరి (సినిమా) లాంటివి ఈ గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి. ఈ గ్రామస్థులు వాటిలో ఆఫ్రికన్ తెగకి చెందిన వారుగా నటించారు. 1995లో నల్ల వాళ్ల మీద తీసిన డాక్యుమెంటరీని కూడా ఈ గ్రామంలోనే నిర్మించారు. అమెరికన్ నగరాల్లో ఆఫ్రికన్ సంస్కృతిని పూర్తిగా ఆవిష్కరించడం కుదరదు. కాని ఈ గ్రామంలో అది సాధ్యం అయింది. నాలుగేళ్లల్లో 300 మంది ఈ గ్రామానికి వచ్చి ఆఫ్రికన్ పూజారి విద్యని అభ్యసించారు. బహు భార్యాత్వం ఈ గ్రామంలో నిషిద్ధం కాదు. ఈ గ్రామాన్ని స్థాపించిన ఎడే ఫ్యునీ -1కి 17 మంది భార్యలు, 27 మంది పిల్లలు ఉండేవారు.
కేల్ అనే ఆకు కూరని పండించి అమ్మడం, టూరిజం వీరి ప్రధాన ఆదాయ వనరులు. ఏటా 3వేల మంది దీన్ని సందర్శిస్తున్నారు. తమ ఆహారాన్ని తామే పండించుకుంటారు. వంద మైళ్ల దూరంలోని పచారి దుకాణానికి వెళ్లి తమకి కావల్సినవి కొని తెచ్చుకుంటారు.
1977లో ఈ గ్రామంలో వందమంది జనాభా ఉండేవారు. అది 1989కల్లా 35కి తగ్గింది. ఇప్పుడు 24 మందే ఉన్నారు. ఈ గ్రామంలోకి అడుగుపెడితే వింత వింత చెక్క బొమ్మలు, ఇతర అలంకరణల వల్ల అమెరికాలో కాక ఆఫ్రికాలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. అమెరికన్ ప్రభుత్వం మాత్రం ఈ రాజ్యాన్ని గుర్తించలేదు. ఐతే ఎరూబన్ మతం అమెరికా ప్రభుత్వం కన్నా చాలా పాతది. సౌత్ కరోలినాలోని 13 వింత ప్రదేశాల జాబితాలో ఈ గ్రామం ఒకటి. అలాగే 2007లో ప్రచురించబడ్డ ‘వియర్డ్ కరోలినా’ 2008లో ప్రచురించబడ్డ ‘వియర్డ్ యు ఎస్’ అనే పుస్తకాల్లో ఈ గ్రామం గురించి ఉంది.

పద్మజ