నమ్మండి! ఇది నిజం!!

జాగ్రత్త! జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని వింటే నమ్మలేం. స్వయంగా చూసినా కొందరు నమ్మలేరు. అలాంటి సంఘటన ఒకటి లూయిస్ మేరిసన్ అనే ఇంగ్లీష్ టీచర్ జీవితంలో జరిగింది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడని దేశాల నించి అమెరికా వచ్చిన వలసదారులకి ఇంగ్లీష్ నేర్పించే క్లాస్‌లని నిర్వహించేది. ఆమె విద్యార్థుల్లోని ఒకరు థామర్‌చెక్. యుగోస్లేవియా నించి వచ్చిన అతను కొన్ని వారాలు ఆ క్లాస్‌లకి హాజరయ్యాక ఓరోజు లూయిస్‌ని కలిసి, తన ఇంగ్లీష్ అభివృద్ధి చెంది మాంసం కొట్టులో తనకి ఉద్యోగం దొరికిందని, ఆ రోజే మొదటి జీతం ఇచ్చారని తను ఆమెకి రుణపడి ఉన్నాడని’ చెప్పాడు. ఆమెకి బహుమతిగా ఆడవాళ్లు ధరించే గుర్రపు బొమ్మ లాకెట్‌ని ఇచ్చాడు. ఆమె ముందు నిరాకరించినా తర్వాత దాన్ని తీసుకుని తన గొలుసులో వేసింది.
క్లాస్‌లో అందరి ముందు అతనికి కృతజ్ఞతలని తెలియజేశాక ఆమె బ్లాక్ బోర్డు ముందు నిలబడి విద్యార్థులని ఒకే రకంగా ధ్వనించే, వేరువేరు అర్థాలు గల రెండు ఇంగ్లీష్ పదాలని చెప్పమని కోరింది. ఒకతను లేచి సెన్స్ (బుద్ధి) సెంట్స్ (నాణాలు), బేర్ (్భరించడం) బేర్ (ఎలుగుబంటి) అని చెప్పాడు. ఆమె వాటిని బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాయసాగింది. కాని మధ్యలో ఆమె చేతిని ఎవరో పట్టుకుని రాయిస్తున్నట్లుగా అతి వేగంగా ఆమెకి తెలియని కొత్త భాషని రాయసాగింది. విద్యార్థులంతా ఆ అతి పెద్ద వాక్యం వంక ఆశ్చర్యంగా చూస్తూంటే, థామర్‌చెక్ మాత్రం పెదవులు కదిలిస్తూ దాన్ని చదవసాగాడు. చివరికి ఆమె రాయడం ఆగిపోయింది.
‘అదే భాష?’ అని విద్యార్థుల్లోని ఒకరు అడిగితే, బహుశ డచ్ భాషై ఉండచ్చని మరొకరు చెప్పారు. కాదని ఆ దేశం నించి వచ్చిన ఒకరు ఖండించారు. క్లాస్ అయి విద్యార్థులంతా వెళ్లిపోయాక ఆమె మళ్లీ చాక్‌పీస్ అందుకుని బోర్డ్ మీద ఏ నించి ఎఫ్ దాకా రాసింది. తర్వాత ఆమె చెయ్యి మళ్లీ ఎవరో బలవంతంగా రాయించినట్లుగా ఇందాకటి వాక్యాన్ని రాసింది. ఎందుకలా తను తనకి తెలీకుండా అలా రాసిందో ఆమెకి అర్థం కాలేదు. బయట నించి మళ్లీ లోపలికి వచ్చిన థామర్‌చెక్ ‘మీరు క్లారా లాగా ఎలా రాయగలిగారు? మీకు మా భాష ఎలా వచ్చు?’ అని భయంగా అడిగాడు.
క్లారా ఐదేళ్ల క్రితం తమ దేశంలో మరణించిందని, ఆమె రాసిన ఉత్తరాలు తన గదిలో ఉన్నాయని, అదే చేతి రాతతో బోర్డ్ మీద రాసారని కూడా చెప్పాడు. లూయిస్ తను రాసిన వాక్యం అర్థం అడిగితే సమాధానం చెప్పలేదు. తనకి జరిగిన దానికి ఆందోళనలో ఉన్న ఆమె ఆ ఉత్తరాలని చూడాలలని అనుకుంది. అతను చెప్పిన టైంకి అతని గదికి వెళ్తే అతను లేడు. ఇంటావిడ ఆమెని ఆదరంగా రిసీవ్ చేసుకుంది. మాటల్లో ఆ ఇంటావిడ కూడా యుగోస్లేవియా నించి వచ్చిందని తెలిసింది. థామర్‌చెక్ వాకింగ్‌కి వెళ్లాడని ఆవిడ చెప్పింది. ఆ గదిలోని ఓ ఫోటో మీది చేతిరాతని చూశాక తను బ్లాక్ బోర్డ్ మీద రాసింది అదే చేతిరాతగా, ఆమె క్లారాగా లూయిస్ గుర్తించింది.
ఆ రాత్రి లూయిస్ తన గదిలో విద్యార్థుల ఆన్సర్ షీట్లని దిద్దుతూ ఓ చోట ఏదో కామెంట్‌ని రాస్తూంటే మళ్లీ ఆమె చెయ్యి అకస్మాత్తుగా ఆ కాగితం మీద ఓ పెద్ద వాక్యాన్ని రాసింది. ఆమె వెంటనే థామర్‌చెక్ ఇంటావిడకి ఫోన్ చేసి, తను రాసిన అల్ఫాబెట్లని చదివి దాని అర్థం ఏమిటని అడిగింది. ఆవిడకి అర్థం కాలేదు.
కొద్దిసేపటికి లూయిస్ ఇంటి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. వచ్చింది అతనే. లోపలకి వచ్చిన థామర్‌చెక్‌ని చూసి ఆ కాగితాన్ని అతనికి చూపించి దాని అర్థం అడిగింది. అతను నెమ్మదిగా చెప్పాడు.
‘అతను బయట ఉన్నాడు. లోపలకి రానివ్వకు. నన్ను చంపినట్లే నిన్నూ చంపుతాడు - క్లారా. ఉదయం క్లాస్‌లో బ్లాక్ బోర్డ్ మీద కూడా నన్ను చంపినట్లే నిన్నూ చంపుతాడు అనే రాశారు’ అని అతను చెప్పాడు. ఆమె తెల్లబోతే అతను కోపంగా, ‘నువ్వూ క్లారా లాంటి దానివే. నేను బహుమతి ఇస్తే వెంటనే తీసుకోకుండా నవ్వావు. నా ఎడమ కన్ను కనపడదని నువ్వు నా మీద వెటకారంతో నవ్వావు. నువ్వో రాజకుమారి, నేనో సేవకుడ్ని అనుకున్నావు. నీ ప్రవర్తన నాకు విషం లాంటిది. అందుకే నిన్ను చంపాలని వచ్చాను...’ పావుగంటసేపు అతను తన బాధని వ్యక్తం చేసి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి పిసికి చంపే ప్రయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. చివరి క్షణంలో పోలీసులు వచ్చి ఆమెని రక్షించారు.
అప్పటికే తను రాసిన వాక్యాన్ని అర్థవంతంగా అనువదించిన థామర్‌చెక్ ఇంటావిడకి అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. వారు ఆమె ఇంటి చిరునామా కనుక్కుని వచ్చి ఆమెని రక్షించారు.
లూయిస్ ఆన్సర్ షీట్ వెనుక రాసిన వాక్యాలని, థామర్‌చెక్ గదిలోని ఉత్తరాల్లోని చేతి రాతని ఫోరెన్సిక్ వారు తర్వాత పోల్చి చూసి ఆ రెండూ ఒకరు రాసినవే అని నిర్ధారించారు. ఆ ఉత్తరాలు, ఆ ఆన్సర్ షీట్ నేడు ఫిలడెల్ఫియాలోని ఓ యూనివర్సిటీకి చెందిన సైకిక్ ఫినామినా మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి.
ఎప్పుడో మరణించిన క్లారా ఆటోరైటింగ్ ద్వారా లూయిస్‌ని రక్షించడానికి కారణం బహుశ ఆమె ధరించిన లాకెట్‌ని లూయిస్ ధరించడమై ఉండచ్చని పేరా సైకాలజీ ప్రొఫెసర్లు చెప్తున్నారు. కాని ఆమెకి థామర్‌చెక్ మనసులోని చెడు ఆలోచనలు ఎలా తెలిసాయో దేవుడికే తెలియాలి.

- పద్మజ