నమ్మండి! ఇది నిజం!!

క్రిస్టల్ బాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1920లలో ఫ్రాన్స్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఇది. మానసిక, శారీరక వత్తిడి వల్ల ఒకోసారి మనిషికి అసాధారణమైన శక్తులు వస్తూంటాయి అని ఈ సంఘటన వల్ల తెలుస్తోంది.
పేరిస్ శివార్లలోని ఫ్రెంచ్ నవలా రచయిత ఎడ్మండో మేరీతో గాఢంగా ప్రేమలో పడ్డాడు. ఐతే ఓ రోజు మేరీ అతనింటికి వచ్చి తను మరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. మొదట్లో అతను అది జోక్ అనుకుని నమ్మలేదు. కాని ప్రేమ, పెళ్లి విషయంలో తను జోక్ చేయనని చెప్పింది. తను పెళ్లి చేసుకునేది ఎడ్మండో పుస్తకాల ప్రచురణకర్త ఛార్ల్స్ కూలేని అని, అతను ధనవంతుడని, తనకి కావల్సినవి అన్నీ కొనివ్వగలడని చెప్పింది. తనకి ఎవరో, ఎప్పుడో ఇచ్చిన ఓ క్రిస్టల్ బాల్‌ని చివరి కానుకగా ఎడ్మండోకి బహూకరించి, తమ పెళ్లయ్యాక కూడా తమ స్నేహం కొనసాగించవచ్చని చెప్పి వెళ్లిపోయింది.
ఎడ్మండో బాధ పడ్డాడు. ఆ క్రిస్టల్ బాల్‌ని ఇంట్లో ఓ చోట అలంకారంగా ఉంచాడు.
కొన్ని రోజుల తర్వాత అతని మేనమామ ఆండ్రే వచ్చాడు. దిగాలుగా ఉన్న ఎడ్మండో నించి జరిగింది తెలుసుకుని అతన్ని ఓదార్చాడు. వెళ్లబోయే ముందు మేరీ రాసిన ప్రేమలేఖలని అడిగి తీసుకుని వాటిని ఇంట్లోని ఫైర్ ప్లేస్‌లోని మంటలోకి విసిరేసి, అలా చేయడం అందరికీ మంచిదని చెప్పాడు.
మరి కొద్ది రోజుల తర్వాత ప్రచురణకర్త ఛార్ల్స్ ఎడ్మండోని తన ఇంటికి భోజనానికి పిలిచి, మేరీని తనకి కాబోయే భార్యగా పరిచయం చేశాడు. ఎడ్మండో రాసే తర్వాతి రెండు నవలల గురించి చర్చించాడు. అతను అన్యమనస్కంగా ఉండటం గమనించి, తను మేరీని పెళ్లి చేసుకోబోతున్నందదుకు అప్‌సెట్ అయ్యాడని గ్రహించాడు. వారి పెళ్లికి ఎడ్మండో హాజరు కాలేదు. ఆ తర్వాత అతను నవల రాసే ప్రయత్నం చేశాడు కానీ ఎడ్మండో కలం కదల్లేదు.
తను లండన్, ఆమ్‌స్టర్ డేమ్‌లకి వెళ్లి ఎడ్మండో నవలలని ఇంగ్లీష్, డచ్ భాషల్లో ప్రచురించే ప్రచురణ కర్తలతో మాట్లాడి వస్తానని, తను లేనప్పుడు తన భార్య మేరీని తరచు పలకరించమని, రెండు వారాల్లో తిరిగి వస్తానని ఓ రోజు ఛార్ల్స్ కోరాడు.
ఎడ్మండో ఆ రోజు మేరీ ఇచ్చిన క్రిస్టల్ బాల్ వంక యధాలాపంగా చూస్తూంటే ఆశ్చర్యంగా అతనికి దాంట్లో పొగ మంచులా ఏదో కనిపించింది. తర్వాత లండన్ వెళ్తున్న తన భర్తకి గుడ్‌బై చెప్పే మేరీ కనిపించింది. అది తన భ్రమ అనుకున్నాడు.
ఆ రాత్రి మరోసారి క్రిస్టల్ బాల్ చూస్తూంటే అందులో మళ్లీ మేరీ కనిపించింది. ఆమెతోపాటు ఫిలిప్పో కూడా కనిపించాడు. వాళ్లు ఇద్దరూ రహస్య ప్రేమికులని వారి సంభాషణని బట్టి ఎడ్మండోకి అర్థమైంది. అతను చిత్రకారుడని, అతని ఫ్లాట్‌లోని వస్తువులని బట్టి గ్రహించాడు. తనని ఎవరో గమనిస్తున్నారనే తీవ్ర భావన కలుగుతోందని మేరీ చెప్పడం కూడా ఎడ్మండో విన్నాడు.
అంకుల్ ఆండ్రే వచ్చి, గడ్డం పెరిగి, నీరసించి, దిగులుగా ఉన్న ఎడ్మండోని చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అతన్ని అలాంటి స్థితిలో తను చూడలేదని, మేరీ ఇచ్చిన ఆ క్రిస్టల్ బాల్‌ని పారేయమని, అది ఉంటే పని సాగదని ఆండ్రే చెప్పాడు. కాని ఎడ్మండో ఆ పని చేయలేకపోయాడు.
క్రిస్టల్ బాల్‌లో తను మేరీని చూడగలుగుతున్నానని, ఆమె ఎక్కడికి వెళ్తోందో, ఎవర్ని కలుస్తోందో తనకి కనపడుతోందని, ఆమె మాటలు వినబడుతున్నాయని తనకి పిచ్చెక్కుతోందా అనే అనుమానం కలుగుతోందని ఎడ్మండో చెప్పాడు. తీవ్ర అసూయే అలా భ్రమింప జేస్తోందని ఆండ్రే కొట్టిపారేశాడు. ఓసారి మేరీని చూసి రమ్మని సలహా ఇచ్చాడు.
వెంటనే ఎడ్మండో మేరీ ఇంటికి వెళ్లాడు కాని ఆమె బయటకి వెళ్లిందని హౌస్ కీపర్ చెప్పింది. తిరిగి వచ్చాక క్రిస్టల్ బాల్‌లో చూస్తే ఎప్పటిలా ఆమె ఫిలిప్పో అపార్ట్‌మెంట్‌లో కనిపించింది.
కొన్ని రోజుల తర్వాత కేంప్ నించి తిరిగి వచ్చిన ఛార్ల్స్ ఎడ్మండోని కలిసి, నవల రాయడం ఎంత దాకా వచ్చిందని అడిగి, ఇంగ్లీష్, డచ్ పబ్లిషర్లతో ఒప్పందం కుదిరిందని చెప్పాడు. కాని తను చెప్పిన సమాచారం వల్ల ఎడ్మండోలో ఎలాంటి ఆనందం కలగకపోవడంతో ఆశ్చర్యపోయాడు. తను లేనప్పుడు తన భార్య ఒంటరిగా ఫీలవకుండా ఎన్నిసార్లు వెళ్లావని ప్రశ్నిస్తే, తను బిజీగా ఉండటంతో వెళ్లలేదని ఎడ్మండో చెప్పాడు. కనీసం ఒక్కసారైనా వెళ్లి ఉండాల్సిందని ఆయన చెప్తే, తను ఓసారి వెళ్తే ఇంట్లో లేదని, ఎక్కడికి వెళ్లిందో తెలీదని చెప్పాడు.
తన ప్రశ్నలకి జవాబులని దాటేసే ప్రయత్నం చేసే ఎడ్మండో ధోరణికి అనుమానపడ్డ ఛార్ల్స్ తనకి తెలీని ఏదో రహస్యం వారి మధ్య ఉందని, అది చెప్పమని నిలదీశాడు. దాంతో మేరీ ఫిలిప్పో అనే చిత్రకారుడ్ని తరచు కలుస్తోందని ఎడ్మండో చెప్పాడు. ఛార్ల్స్ దానికి రుజువు అడిగితే తను క్రిస్టల్ బాల్‌లో చూశానని చెప్పాడు. ఇద్దరూ దాని దగ్గరికి నడిచారు. ఎడ్మండోకి అప్పుడు ఫిలిప్పో అపార్ట్‌మెంట్‌లోని ఆ జంట కనిపించారు. కాని ఛార్ల్స్‌కి కనిపించలేదు. ఎడ్మండో మనఃస్థితి బాగా లేదని ఛార్ల్స్ అనుమానించడంతో, తాము వెంటనే ఆ అపార్ట్‌మెంట్‌కి వెళ్దామని, వాళ్లు అక్కడ లేకపోతే తనని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించవచ్చని ఎడ్మండో ఛాలెంజ్ చేశాడు.
ఇద్దరూ అరగంటలో ఆ అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నారు. ఎడ్మండోకి క్రిస్టల్ బాల్‌లో కనిపించిన 22వ నంబర్ అపార్ట్‌మెంట్ తలుపుని తట్టాడు. తలుపు తెరిచిన ఫిలిప్పోని, పక్కనే ఉన్న మేరీని ఎడ్మండో, ఛార్ల్స్‌లు ముఖాముఖీ చూశారు. ఆ అక్రమ సంబంధం కారణంగా ఆమె నించి విడాకుల కోసం కోర్టుకి వెళ్లాడు ఛార్ల్స్. తనకి ఆ సమాచారం ఇచ్చింది రచయిత ఎడ్మండో అని చెప్పాడు. బోనెక్కిన ఎడ్మండో తనకా విషయం క్రిస్టల్ బాల్ ద్వారా తెలిసిందని చెప్పాడు. వెంటనే దాన్ని కోర్టుకి తెప్పించారు. అందులో చూస్తూ ఆ సమయంలో కోర్టులో లేని మేరీ ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో ఎడ్మండో చెప్పాడు.
పోలీసుల్ని పంపి తనిఖీ చేస్తే అది నిజం అని తెలిసింది. ఆమె ఓ బేకరీ దుకాణంలో పాచిపోయిన జింజెర్ బ్రెడ్‌ని అమ్మినందుకు దాని యజమానితో పోట్లాడుతోంది. ఎడ్మండో ఆ క్రిస్టల్ బాల్‌ని కోర్టు హాల్లోనే బలంగా కిందకి విసిరి పగులగొట్టేశాడు. కోర్టు ఓ క్రిస్టల్ బాల్‌ని సాక్ష్యంగా అంగీకరించడం ఫ్రెంచ్ న్యాయ చరిత్రలో అదే మొదటిసారి, అదే ఆఖరి సారి.

- పద్మజ