నమ్మండి! ఇది నిజం!!

కల్పనా? నిజమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరగబోయేవి రచయితలకి ముందుగా తెలుస్తాయా? లేదా రచయిత ఊహించి రాసినవి తర్వాత జరుగుతాయా? ఇవి అంతుపట్టని ప్రశ్నలు. చరిత్రలో అనేకసార్లు ఇలా జరిగింది. హెచ్.జి.వెల్స్ రాసిన ఓ నవల్లో, ఊహించి రాసిన పరికరాలు తర్వాత కనిపెట్టబడ్డాయి. చంద్రుడి మీదకి మనిషి వెళ్లడం అనే అంశం మీద ఊహించి రాసిన ఓ సైంటిఫిక్ నవల్లో ముగ్గురు వ్యోమగాములు వెళ్లడం, రాకెట్ బరువు, వాడిన ఇంధనం, పట్టిన కాలం మొదలైనవి ఆ రచయిత రాశాడు.
1898లో అమెరికన్ రచయిత మోర్గన్ రాబర్ట్‌సన్ ‘్ఫ్యటిలిటీ’ అనే ఊహాజనిత నవలని రాశాడు. అందులో రాసినట్లుగానే 14 ఏళ్ల తర్వాత జరగడం ఆశ్చర్యం. ఓ ఓడ మునిగిపోయి ప్రయాణీకులు మరణించడం ‘్ఫ్యటిలిటీ’ నవల క్లైమాక్స్. ఆ నవల్లోని అంశాలకి, టైటానిక్ ఓడ మునిగిపోవడానికి ఎన్నో పోలికలు ఉన్నాయి.
-రాబర్ట్ సన్ తన నవల్లోని ఓడకి ‘టైటాన్’ అనే పేరు పెట్టాడు. పధ్నాలుగేళ్ల తర్వాత మునిగిపోయిన ఓడ పేరు ‘టైటానిక్’
-్ఫ్యటిలిటీ నవల్లో ‘టైటాన్’ ఆ రోజుల్లో నిర్మించబడ్డ అతి పెద్ద ఓడ. టైటానిక్ కూడా ఆ రోజుకి అతి పెద్ద ఓడ,.
-నవల్లో పేర్కొన్న ఓడ పొడవుకన్నా టైటానిక్ 25 మీటర్లు మాత్రమే ఎక్కువ పొడవు. ఈ రెండు ఓడలు అన్‌సింకబుల్ (మునగనివి) అనే పేర్కొన్నారు.
- ఈ రెండు ఓడలూ ఏప్రిల్ 2వ వారంలోనే మునిగిపోయాయి. రెంటి వేగం ఇరవై నాట్స్.
-టైటాన్ బరువు 70 వేల కిలోలు, టైటానిక్ బరువు 66 వేల టన్నులు.
- ఈ రెండు ఓడల్లో కూడా 3వేల మంది ప్రయాణీకులు ఉన్నారు.
- రెండూ అర్ధరాత్రే మునిగాయి.
- రెండు ఓడల్లో ప్రయాణీకులకి సరిపడే లైఫ్ బోట్స్ లేవు.చట్టరీత్యా తీసుకెళ్లాల్సినన్ని లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి.
- రెండు ఓడలు కూడా నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోనే మునిగిపోయాయి.
- రెండు ఓడల ప్రొపెల్లర్ల నిర్మాణం ఒకే పద్ధతిలో ఉంది.
- టైటానిక్‌లో పదహారు లైఫ్ బోట్లు, నాలుగు ఫోల్డింగ్ లైఫ్ బోట్లు ఉన్నాయి. టైటాన్‌లో ఇరవై నాలుగు లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి.
-టైటానిక్ 22న్నర నాట్ల వేగంతో ప్రయాణిస్తూ 400 నాటికల్ మైళ్ల దూరంలో స్టార్ బోర్డ్ వైపు మంచు కొండకి గుద్దుకుంది. టైటాన్ 25 నాట్ల వేగంతో ప్రయాణిస్తూ 400 నాటికల్ మైళ్ల దూరంలో స్టార్ బోర్డ్ వైపే మంచు కొండని గుద్దుకుంది.
- టైటానిక్‌లో సగం మంది ప్రయాణీకులు, 2,200 మంది సిబ్బంది మరణించారు. 705 మంది జీవించారు. టైటాన్‌లో 2,500 మంది మరణించి 13 మంది మాత్రమే జీవించారు.
- రెండు ఓడలు కూడా బ్రిటీష్ కంపెనీలకి చెందిన ఓడలే.
1922లో టైటానిక్ మునిగిపోయాక కొందరు జర్నలిస్ట్‌లు ఈ పోలికలని పసికట్టి తమ దినపత్రికల్లో రాశారు. దాంతో ‘్ఫ్యటిలిటీ’ పాఠకులకి ఆ నవల మీద ఆసక్తి ఏర్పడటంతో అది అనేక ముద్రణలు పొంది బాగా అమ్ముడవడమే కాక దాని రచయితకి కూడా పేరు వచ్చింది. ఆ నవల్లో టైటాన్ మునగడం ప్రధాన అంశం కాదు. నావికుడు ఆల్కహాలిజం లోంచి బయటపడటమే ప్రధానాంశం. కెప్టెన్ దేవుడ్ని చూసి ఆల్కహాలిజంతో పోరాడి బయట పడతాడు. రచయిత రాబర్ట్‌సన్‌ని చాలామంది భవిష్యత్ తెలిసే ‘క్లెయిర్ వాయెంట్’ అని నమ్మారు. కాని దాన్ని అతను అంగీకరించలేదు.
రాబర్ట్‌సన్‌కి ఓడల నిర్మాణం, ఐస్‌బర్గ్స్ వల్ల ఓడలకి కలిగే ప్రమాదాల గురించిన అనుభవం ఉంది. ఎందుకంటే అతను అనుభవం గల నావికుడు.
ఆ రచయిత ఆత్మకథని చదివాక, టైటానిక్ ఓడ నిర్మాణ ఇంజనీర్లు ఆసక్తితో ‘్ఫ్యటిలిటీ’ నవలని చదివారని, అతి పెద్ద ఓడని డిజైన్ చేసేప్పుడు ఆ నవల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, రెండు ఓడలు సముద్ర గర్భంలోని మంచు కొండలని తాకి మునిగిపోవడం మాత్రం యాదృచ్ఛికంగా జరిగిందని విష్‌ఫ్రెడ్ లారియర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ ప్రతిపాదించాడు.
టైటానిక్ మునిగాక ఫ్యుటిలిటీ నవలని ‘ది రెక్ ఆఫ్ ది టైటాన్’ పేరుతో విడుదల చేశారు.
ఇలాంటి సంఘటనే మరోటి కూడా జరిగింది. అమెరికన్ రచయిత ఎడ్గర్ ఎలెన్ పో 1898లో ‘ది నెరెటివ్ ఆఫ్ ఆర్థర్ గార్డెన్ పిమ్ ఆఫ్ నాన్‌టుకెట్’ అనే నవలని రాశాడు. ఆ నవల్లో తిమింగలాల వేటకి వెళ్లే ఓడలోని నలుగురు సిబ్బంది చిక్కుపడి, ఆహారం లేక తమలో ఎవర్ని తినాలో చిట్టీలు వేసుకుంటారు. 46 ఏళ్ల తర్వాత మిగ్నానెట్ అనే ఓడ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ రెండు సందర్భాల్లోను కేబిన్ బాయ్‌నే తిన్నారు.

- పద్మజ