నమ్మండి! ఇది నిజం!!

మాయమైన శవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని హైడ్ పార్క్‌లో స్పీకర్స్ కార్నర్ అనే విభాగంలో ఎవరైనా, ఏ టాపిక్ మీదైనా మాట్లాడచ్చు. 1950లలో లారెన్స్ అనే వృద్ధుడు అక్కడ నిత్యం తను చేసిన ఓ హత్య గురించి చెప్పేవాడు.
కార్పస్ డిలక్ట్ ఐ - అంటే శవం లభ్యం కాని సందర్భాల్లో ఇంగ్లండ్‌లో 1850 నించి 1950 దాకా వందేళ్లల్లో రెండుసార్లే నిందితుడికి శిక్ష పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటరైన లారెన్స్ ఓ రాత్రి తన ఆఫీస్‌లో ఎక్కువసేపు ఉండి మర్నాడు విచారణకి వచ్చే ఓ కేసుకి చెందిన ఫైల్‌ని చదువుతున్నాడు. తన భార్య సారాని హత్య చేసిన ఫ్రేంక్‌ని శిక్షించే కేసు అది. కోర్టులో అతను మర్నాడు ఒకే అంశం మీద వాదించ దలచుకున్నాడు. శవం దొరక్కపోయినా సారాని ఫ్రేంక్ మెలోన్ హత్య చేశాడని, శిక్ష వేయాలనే కోర్టులో జ్యూరీ సభ్యులకి వినిపించాల్సిన తన వాదనని తయారు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆఫీస్‌లో అతను ఒక్కడే ఉన్నాడు.
ఓ అందమైన యువతి ఆ ఆఫీసులోకి వచ్చింది. లారెన్స్‌తో తన పేరు సారా అని, కోర్టు రికార్డుల్లో తను చనిపోయినట్లు ఆరోపించబడినా తను నిజంగా మరణించలేదని, తనని ఫ్రేంక్ చంపలేదని చెప్పింది. వెంటనే లారెన్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కి ఫోన్ చేశాడు. అతను లేకపోవడంతో రాగానే తనకి ఫోన్ చేయమని కోరాడు. ఆమె సారాలా నటించే ఫ్రేంక్ గర్ల్‌ఫ్రెండ్ అయి ఉండచ్చని, సారా మరణించిందని తను నమ్ముతున్నానని లారెన్స్ ఆమెతో చెప్పాడు. పోలీసు రికార్డులోని తన వర్ణనని చదివి, తను అలా ఉన్నదో, లేదో చూడమని ఆమె కోరింది. నీలిరంగు కళ్లు, ఎర్ర జుట్టు, ఇరవై తొమ్మిదేళ్ల వయసు. ఆ వర్ణన ఆమెకి సరిగ్గా సరిపోయింది.
ఆమె నిజంగా సారా అయితే మర్నాడు కోర్టుకి వచ్చి తను జీవించే ఉన్నానని జడ్జికి చెప్పమని లారెన్స్ సూచించాడు.
ఏకాంతంగా ఉన్నప్పుడు తన భర్త తనని జింజర్ అనే ముద్దు పేరుతో పిలిచేవాడని, అది ఎవరికీ తెలీదని, కావాలంటే ఫ్రేంక్‌ని కనుక్కోమని ఆమె చెప్పింది. కోర్టు కాగితాల్లోని తన సంతకంతో పోల్చి చూడమని ఆమె ఓ కాగితం మీద సంతకం చేసింది. కోర్టు కాగితాల్లోని సంతకంతో అది సరిపోయింది! ఫ్రేంక్‌ని తన కోసం వెదకద్దని, తను చాలా దూరం వెళ్లిపోతున్నానని చెప్పమని చెప్పి ఆమె వెళ్లిపోయింది. అయోమయంలో పడ్డ లారెన్స్ ఆమె సంతకం చేసిన కాగితాన్ని ఫైర్ ప్లేస్‌లో పడేసి కాల్చేశాడు.
మర్నాడు కోర్టుకి వెళ్తూ లాండ్రీలో ఇచ్చిన తన లాయర్ కోటుని లారెన్స్ తీసుకున్నాడు. దాని జేబులో ఓ వైపు కొద్దిగా కాలిన సారా సంతకం ఉన్న కాగితం కనిపించింది. లారెన్స్ ఆ కాగితం గురించి లాండ్రీ వాడిని అడిగితే అతను అది ఆ జేబులోకి ఎలా వచ్చిందో చెప్పలేకపోయాడు. దాన్ని పోలీస్ ఫోరెన్సిక్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అది సారా సంతకమేనని అతను ధృవీకరించాడు. దాన్ని అక్కడే చింపి పారేసి లారెన్స్ కోర్టుకి చేరేసరికి సారా నిజంగా బతికే ఉందనే అనుమానం కలిగింది. కేస్ ఫైల్‌ని తెరిస్తే అందులో సారా సంతకం ఉన్న ఇంకో అలాంటి కాలిన కాగితం కనిపించింది.
తను ఆ కాగితాన్ని కోర్టులో ఆ స్థితిలో సాక్ష్యంగా ప్రవేశపెట్టి కూడా ప్రయోజనం లేదని లారెన్స్‌కి తెలుసు. ఆమె శవం కోసం మరింత వెదకాలని కోరడానికి అప్పటికే ఆలస్యమై పోయింది. గత రాత్రి సారా తన ఆఫీస్‌కి వచ్చిందని అతను జడ్జికి చెప్పినా ఆయన నమ్మలేదు. ఫ్రేంక్ మెలోన్‌కి మరణశిక్ష విధించారు. ఓ నిరపరాధిని రక్షించలేక పోయినందుకు లారెన్స్ తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు.
మర్నాడు ఉదయానికి లారెన్స్ జుట్టంతా తెల్లబడిపోయింది. జేబులో సారా సంతకం గల కాగితం దొరకడం నిజం అని లాండ్రీ అతను, అది సారా సంతకమే అని ఫోరెన్సిక్ లాబ్ అతను, ఓ దినపత్రిక తర్వాత చేపట్టిన ప్రైవేట్ విచారణలో చెప్పారు.
12 ఏప్రిల్ 1924లో ఓ వార్త వెలువడింది. ఫ్రేంక్ మెలోన్‌ని ఉరి తీసిన వార్త అది. ఉరి తీయబోయే ముందు ఫ్రేంక్ ఆఖరి మాటలు ‘నేనామెని హత్య చేయలేదు. మీరు ఓ అమాయకుడ్ని ఉరి తీస్తున్నారు.’
ఆ మర్నాటి నించి లారెన్స్ తన వృత్తిని మానేసి, హైడ్ పార్క్‌లో అపజల ముందు, తను ఓ అమాయకుడ్ని ఉరికంబానికి పంపిన దోషినని ఈ వివరాలని నిత్యం వివరిస్తూ, ఫ్రేంక్ మెలోన్‌ని తను హత్య చేసానని పోలీసులకి ఫిర్యాదు చేయమని కోరసాగాడు.
సారా ఏమైంది? నిజంగా హత్య చేయబడిందా? లేక తన భర్తకి శిక్ష పడాలని కావాలని దాక్కుందా? ఎక్కడ దాక్కుంది? లారెన్స్‌ని కలిసిన యువతి నిజంగా సారా యేనా? కాకపోతే సారా సంతకాన్ని అంత చక్కగా ఎలా ఫోర్జరీ చేసింది? కాలిన కాగితం మళ్లీ రెండుసార్లు లారెన్స్ దగ్గరికి ఎలా చేరింది? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.
*

- పద్మజ

- పద్మజ