నమ్మండి! ఇది నిజం!!

ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా పని చేసే గెరాల్డ్ తన భార్య లూసీతో రోడ్ ఐలాండ్‌లోని ఓ ఊరుకి వచ్చాడు. తమ కోసం కంటోనె్మంట్ నించి రైల్వేస్టేషన్‌కి కారు రాకపోవడంతో ఇద్దరూ కాలినడకన ఊళ్లోకి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక సన్నగా చినుకులు పడసాగాయి. క్రమేపీ మేఘాలు అలుముకుని వర్షం పెద్దది అవడంతో వాళ్లు ఓ ఇంటి వరండాలో ఆగారు. కొద్దిసేపటికి ఆ ఇంటి తలుపు తెరచుకుంది. వాళ్ల గురించి తెలుసుకున్న ఆ ఇంటి యజమానురాలు మెర్రిమెంట్ చెప్పింది.
‘కంటోనె్మంట్ ఏరియా ఇక్కడికి చాలా దూరం. ఫోన్ చేసి కారు తెప్పించుకోండి. లేదా ఈ రాత్రికి మా ఇంట్లో ఉన్నా నాకు అభ్యంతరం లేదు’
లూసీకి ఆవిడ, పాలరాతితో కట్టిన ఆ పాతకాలం నాటి ఇల్లు నచ్చడంతో, ఆ రాత్రి అక్కడే గడుపుదామని భర్తని కోరింది. మెర్రిమెంట్ వాళ్లకి మొదటి అంతస్థులో మెట్ల ఎదురు గదిని ఇచ్చింది. మూడు ఈజీ ఛైర్లు, ఓ డబల్‌కాట్, ఇతర సౌకర్యాలు గల ఆ గదిలో అంతా ఇటాలియన్ ఫర్నిచరే. మెర్రిమెంట్ అభిరుచి గల ధనవంతురాలని ఇద్దరూ అనుకున్నారు.
‘గంటలో భోజనం సిద్ధం అవుతుంది. అమెరికాని రక్షిస్తున్న మీకు అతిథ్యం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది’ ఆవిడ చెప్పింది.
భోజనానికి అరగంట ముందు వాళ్లు మెర్రిమెంట్‌తో మాట్లాడారు. ఆవిడ తండ్రి పత్తి వ్యాపారి. ఆ ఇల్లు తండ్రి నించి వారసత్వంగా వచ్చింది. ఆవిడ విధవరాలు.
రుచికరమైన భోజనం చేశాక ఆవిడకి గుడ్‌నైట్ చెప్పి ఇద్దరూ తమ గదిలోకి వెళ్లారు. పావుగంట తర్వాత ఎవరో తలుపు మీద కొడితే గెరాల్డ్ తలుపు తీశాడు. తెల్లజుట్టుగల అరవై ఏళ్లతను బట్లర్ యూనిఫాంలో, చేతిలో వెండి ట్రేతో లోపలికి వచ్చాడు. ట్రేలో పేకబొత్తులు, మర్సాలా ఇటాలియన్ వైన్ బాటిల్, గ్లాసులు కనిపించాయి.
‘నా పేరు శామ్యూల్. కొత్తచోట మీకు వెంటనే నిద్ర పట్టకపోతే వైన్ తాగుతూ పేకాట ఆడచ్చు’ సూచించాడు.
‘్థంక్ యు’ గెరాల్డ్ ఆ ట్రేని అందుకుంటూ చెప్పాడు.
‘బ్రిడ్జ్ ఆడటానికి ఇంకో ఇద్దరు ఉంటే బావుంటుంది’ లూసీ పేకల్ని చూసి ఉత్సాహంగా చెప్పింది.
బట్లర్ తలపంకించి చెప్పాడు.
‘ఇద్దరు అతిథులు త్వరలో రాబోతున్నారు. వారికి ఆసక్తి ఉంటే మీ దగ్గరికి పంపుతాను. కాని అప్పటికి మీకు నిద్ర వస్తే తలుపు చప్పుడు విని తెరవకపోయినా వాళ్లేమీ అనుకోరు’
‘్థంక్ యు. నాకు ఇప్పట్లో నిద్ర వచ్చేలా లేదు. పైగా కొత్త వాళ్లని కలవడం నాకు ఇష్టమే’ లూసీ చెప్పింది.
బట్లర్ చెప్పినట్లుగానే కొద్దిసేపటికి తలుపు చప్పుడు అవడంతో గెరాల్డ్ తలుపు తెరిచాడు. దాదాపు ఎనభై ఏళ్లున్న ఓ వృద్ధుడు, పక్కనే ఓ వృద్ధురాలు కనిపించారు.
‘హలో. నా పేరు స్టీవెన్సన్. ఈమె నా భార్య రూడీ’ ఆయన పరిచయం చేసుకున్నాడు.
దంపతులు ఇద్దరూ వారిని లోపలకి ఆహ్వానించారు. వాళ్లని వైన్ తీసుకోమని కోరినా తీసుకోలేదు.
స్టీవెన్సన్ పేకముక్కలని అందుకుని వంచుతూ తన గురించి చెప్పాడు.
‘మెర్రీమెంట్ తండ్రి, నేను సోదరులం. మేమిద్దరం కలిసి పత్తి వ్యాపారం చేశాం. మాకు పిల్లలు లేరు’
వాళ్లు నైపుణ్యంగా ఆడుతూండటంతో ఆటలో మునిగిపోయారు.
స్టీవెన్సన్ పాకెట్ వాచ్‌ని చూసి చెప్పాడు.
‘అరె! అప్పుడే రెండు దాటుతోంది. మేం పొద్దునే్న లేవాలి. మెర్రీమెంట్‌కి క్రమశిక్షణ అంటే ఇష్టం’
లూసీ నవ్వుతూ చెప్పింది.
‘పాకెట్ వాచ్‌తో మీరు రెండో ప్రపంచ యుద్ధంనాటి సినిమాల్లో పాత్రలా కనిపిస్తున్నారు’
‘మేము ఆ కాలానికి చెందిన వారమేగా మరి’ రూడీ నవ్వి చెప్పింది.
ఆ ఆట పూర్తయ్యాక ఇద్దరూ లేచారు.
‘మేము పక్క గదిలోనే ఉంటాం. మీకేదైనా అవసరం ఉంటే తలుపు మీద తట్టచ్చు’ స్టీవెన్సన్ చెప్పాడు.
గుడ్‌నైట్ చెప్పి వాళ్లు బయటకి వెళ్లాక లూసీ నవ్వుతూ చెప్పింది.
‘మీ కారు వచ్చి ఉంటే మనం ఈ అనుభవాన్ని కోల్పోయేవాళ్లం’
‘అవును. వాళ్లకి వైన్ కావాలేమో అడిగొస్తాను’
గెరాల్డ్ పక్క గదిలోకి వెళ్లి ఆ దంపతులకి మిగిలిన వైన్ బాటిల్ ఇచ్చి వచ్చాడు. తర్వాత భార్యతో చెప్పాడు.
‘మనకి సరిపోదని తాగలేదట. ఆ గదిలోని ఫర్నిచర్ అంతా స్పానిష్ ఫర్నిచర్’
పడుకోగానే ఇద్దరికీ నిద్ర పట్టింది. మర్నాడు ఉదయం ఇద్దరూ కిందకి వెళ్లేసరికి మెర్రిమెంట్ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసింది. తిన్నాక స్టీవెన్సన్ ఆర్మీ కంటోన్‌మెంట్‌కి ఫోన్ చేశాడు. కారు రాగానే మెర్రిమెంట్ మెట్లు ఎక్కుతూ వాళ్లతో చెప్పింది.
‘పైకి వెళ్లి మీ సామాను తీసుకువస్తాను’
‘అయ్యో! మీరెందుకు? మీ బట్లర్ శామ్యూల్‌తో చెప్తే తెస్తాడుగా?’ లూసీ సూచించింది.
‘ఏమిటి మీరనేది?’ మెర్రిమెంట్ మెట్ల మీద ఠక్కున ఆగి ప్రశ్నించింది.
‘శామ్యూల్ ఉన్నాడుగా’
‘అతని గురించి మీకెలా తెలుసు?’
లూసీ క్రితం రాత్రి జరిగింది వివరిస్తూంటే మెర్రీమెంట్ మొహంలో ఆశ్చర్యం కనిపించింది. గుచ్చిగుచ్చి అడిగి తెలుసుకుని వాళ్లని పైకి తీసుకెళ్లింది. సరాసరి గెరాల్డ్ బస చేసిన గది పక్క గది తలుపు తెరచి లోపలికి వెళ్లింది. ఆవిడని అనుసరించిన వాళ్లిద్దరూ ఆ గదిని చూసి నిర్ఘాంతపోయారు. ఆ గదిలో ఫర్నిచర్ మీద దుమ్ము పడకుండా తెల్ల దుప్పట్లు కప్పి ఉన్నాయి. నేలంతా దుమ్ము. ఎవరి అడుగుజాడలూ లేవు. దంపతులు ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు.
‘మా నాన్న ఈ ఇంటిని స్టీవెన్సన్ నించి కొన్నారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో ఫైటర్ పైలెట్. కాని ఆయన మృతదేహమే తిరిగి అమెరికాకి వచ్చింది. కొంతకాలానికి రూడీ కూడా మరణించింది. వారి బట్లర్ శామ్యూల్ కూడా తర్వాత పోయాడు. ఈ ఇంట్లో వాళ్లు దెయ్యాలై తిరుగుతున్నారని విన్నాను కాని నాకు ఎన్నడూ కనపడలేదు. రెండేళ్ల క్రితం ఓ అతిథి కూడా ఇలాంటి అనుభవమే జరిగిందని చెప్పినా నేను నమ్మలేదు’
గెరాల్డ్ ఆవిడ ప్రాక్టికల్ జోక్ వేస్తోందని అనుకుని ఇల్లంతా తిరిగి శోధించాడు. కాని ఆ ముగ్గురూ ఎక్కడా లేరు.
కార్లో వెళ్తూ లూసీ చెప్పింది.
‘కొన్ని గంటల్లో ఆవిడ ఫర్నిచర్ మీద బట్టలు కప్పచ్చేమో కాని ఆ దుమ్ముని సృష్టించలేదు. నిన్న రాత్రి మనం చూసింది కచ్చితంగా దెయ్యాలే. బూజు పట్టిన ఆ వైన్ బాటిల్ని ఆ గదిలో చూసారా?’
‘దుప్పటిని తొలగించి చూశాను. నేను నిన్న రాత్రి చూసిన స్పానిష్ ఫర్నిచరే ఉంది’ స్టీవెన్సన్ చెప్పాడు.
దెయ్యాలు నిజంగా ఉన్నాయా? వాళ్లు ఆ ఇంటి యజమానురాలికి కాక అతిథులకే ఎందుకు కనిపించారు? లేక ఆ అతిథులు కల గన్నారా? వేరువేరు కాలాల్లో వేరువేరు మనుషులు ఒకే రకం కలని కనగలరా? దేవుడికే తెలియాలి.
**