నమ్మండి! ఇది నిజం!!

రెండు మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయట వర్షం. అర్ధరాత్రి. వర్షంతో కూడిన ఉరుములు, మెరుపులు. ఎలెన్ కెవ్వున అరుస్తూ లేచి కూర్చుంది.
‘ఏమిటి?’ ఆ అరుపునకు మెలకువ వచ్చిన ఆమె భర్త జార్జ్ అడిగాడు.
‘మీరు మరణించడం చూశాను’ భయంగా చెప్పింది.
‘పీడకలై ఉంటుంది. పడుకో’
‘కల కాదు. అది నిజంగా చూస్తున్నట్లుగా అనిపించింది’ ఎలెన్ చెప్పింది.
‘పడుకుందాం. రేపు మళ్లీ బేంక్‌కి టైంకి వెళ్లాలి’ జార్జ్ భార్యతో చెప్పాడు.
‘ఆ బేంక్‌లో నేల మీద పడి ఉన్న మిమ్మల్ని చూసాను’
‘వచ్చే పీడకలలన్నీ నిజం అవవు. మీ నాయనమ్మ జిప్సీ రక్తం నీలో పని చేస్తున్నట్లుంది’
‘అది కాదండి...’
‘సరే. నేను రేపు పోతాను. ఇక పడుకుందాం.’
‘రేపు మీరు బేంక్‌కి వెళ్లకండి’
‘అంటే బేంక్ వాళ్లకి కారణం ఏం చెప్పాలి? నా ప్రియ భార్యకి చెడ్డ కల వచ్చింది. కాబట్టి నేను బేంక్‌కి రానని చెప్పాలా? సిల్లీగా మాట్లాడక. పడుకో’
అదే సమయంలో నగరానికి మరో మూల ఫేక్టరీలో నైట్‌షిఫ్ట్‌లో పని చేసే అలక్స్ ఓ యంత్రం ముందు నిలబడి దానికున్న తిరిగే చక్రానికి కత్తి ఉంచి సానపడుతున్నాడు. అతను అచేతనంగా, విగ్రహంలా నిలబడటం, అతని చెయ్యి దాదాపు ఆ చక్రానికి తగిలి తెగిపోయేంత దగ్గరగా వెళ్లడం చూసిన పక్క యంత్రం ముందు పనిచేసే వ్యక్తి అలెక్స్ చేతిని లాగేసాడు. చెయ్యి అప్పటికే కొద్దిగా కోసుకుంది.
అతన్ని తక్షణం ఫేక్టరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టర్‌కి జరిగింది చెప్పాడు. అలెక్స్‌ని పరిశీలించిన డాక్టర్ చెప్పాడు.
‘నీకు స్వల్పంగా స్ట్రోక్ వచ్చింది. నువ్వు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ విషయం నేను మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. సరైన భోజనం, సరైన విశ్రాంతితో నువ్వు ఐదారు నెలల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరచ్చు. మీ ఫేమిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లు. బహుశ నీకు ఆరు నెలలే మిగిలి ఉన్నాయి.’
‘ఆర్నెల్లు కాదు. ఆరు రోజులు కూడా కాదు. రేపు రాత్రిలోగా నేను పోతాను. ఆ సమయంలో పది లక్షల రంగుల కాంతులు నా కళ్ల ముందు కనిపించాయి’ అలెక్స్ చెప్పాడు.
‘అది స్ట్రోక్ ప్రభావం’
‘కాదు. నేను మరణించబోతున్నాననే విషయం నాకు స్పష్టంగా స్ఫురించింది. రేపు రాత్రిలోగా నేను పోతానని నాకు గట్టిగా తెలుసు’
డాక్టర్ ఇచ్చిన మందుల ప్రిస్కిప్షన్‌ని బయట చెత్తబుట్టలో పడేసి అలెక్స్ వెళ్లిపోయాడు.
* * *
మర్నాడు ఉదయం రెడీ అవుతున్న జార్జ్‌ని బేంక్‌కి వెళ్లద్దని ఎలెన్ బతిమాలడంతో ఆగిపోయాడు. ఆమె బేంక్‌కి ఫోన్ చేసి తన భర్తకి ఒంట్లో బాలేదని, ఆ రోజు రాడని చెప్పింది. అవతల నించి ఓసారి జార్జ్‌తో మాట్లాడతామని చెప్పడంతో రిసీవర్ని ఇచ్చింది.
వాళ్లు చెప్పింది విని జార్జ్ హడావిడిగా డ్రెస్ చేసుకుంటూ చెప్పాడు.
‘నేను అర్జెంట్‌గా వెళ్లాలి. సర్‌ప్రైజ్ చెక్‌కి ఆడిటర్స్ వచ్చారట’
‘కాని వెళ్తే మీరు చచ్చిపోతారు’
‘చిన్నపిల్లలా ప్రవర్తించక’ చెప్పి జార్జ్ హడావిడిగా బయటకి వెళ్లిపోయాడు.
* * *
అలెక్స్‌కి పదేళ్ల కూతురు కేర్లిన్ తప్ప ఇంకెవరూ లేరు. ఆమెకి కాళ్లు పని చేయవు. చక్రాల కుర్చీకే పరిమితం. తను మరణించాక ఆమె ఏమైపోతుందా అనే చింత పట్టుకుంది. తన కాగితాలు తీసుకుంటూంటే వాటి కింద రివాల్వర్ కనిపించింది. తన కూతురి ప్రయోజనం కోసం ఆ కాగితాలతో బేంక్‌కి వెళ్లి ట్రస్ట్ ఫండ్‌ని ఏర్పాటు చేసే ఆఫీసర్ని కలిశాడు. ఆమెకి నెలకి వెయ్యి డాలర్లు ఆదాయం వచ్చే ట్రస్ట్ ఫండ్‌ని ఏర్పాటు చేయమని కోరాడు.
‘నేను మరణించాక ఆమెని ఎవరు పోషించినా, తనకి స్వంత డబ్బు ఉండాలన్నది నా కోరిక’
అలెక్స్‌కి ఆ ఆఫీసర్ వెనక సీట్లోని ఉద్యోగి మాట్లాడే సంభాషణ వినిపించింది.
‘సరే ఎలెన్. నేనింక ఫోన్ పెట్టేయాలి. అలాగే. ననె్నవరో బేంక్‌లో కాల్చి చంపుతారు. ఇంక నాకు మాట్లాడే టైం లేదు’ జార్జ్ ఫోన్ పెట్టేశాడు.
అలెక్స్‌కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఏభై షేర్లు మాత్రమే ఉన్నాయని, ఇల్లు కాని, కారు కాని లేవు కాబట్టి నెలకి వంద డాలర్లు మించి రాదని ఆఫీసర్ లెక్కకట్టి ఆ ఆస్తులకి పదింతలు ఉంటే కాని వెయ్యి డాలర్లు రాదని చెప్పాడు. అతను ఆఫీస్‌కి వెళ్తే ఉద్యోగం పోయిందని, ఆరోగ్యం బాగుపడ్డాక మళ్లీ తీసుకుంటామని ఆ రోజు దాకా జీతం ఇచ్చారు. అతను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి తన ఇన్సూరెన్స్‌ని పదింతలు పెంచాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఆ మొత్తానికి డాక్టర్ చెకప్ అవసరం అని, తమ కంపెనీ నియమించిన డాక్టర్ ఎడ్రస్ చెప్పారు. అతను గత రాత్రి తనని పరీక్షించిన డాక్టరే. తక్షణం ఇంటికి వెళ్లి రివాల్వర్ తీసుకుని బేంక్‌కి బయలుదేరాడు.
ఎలెన్ మళ్లీ భర్తకి ఫోన్ చేసి చెప్పింది.
‘కాసేపట్లో మీకేమైనా అవుతుందని నాకు బలంగా అనిపిస్తోంది’
జార్జ్ దాన్ని కొట్టి పారేశాడు. వెంటనే ఆమె ఆదుర్దాగా హేండ్‌బేగ్ తీసుకుని బేంక్‌కి బయల్దేరింది.
బేంక్‌లోకి వచ్చిన అలెక్స్ సరాసరి కేషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్లి రివాల్వర్ని చూపించి డబ్బివ్వమని కోరాడు. ఆమె నోట్ల కట్టలని అతని ముందు ఉంచుతూ కాలితో అలారం బెల్‌ని నొక్కింది. ఆ చప్పుడికి బెదిరిపోయిన అలెక్స్ డబ్బు తీసుకోకుండా గుమ్మం వైపు నడిచాడు. అదే సమయంలో లోపలకి వచ్చే ఎలెన్‌ని చూసి జార్జ్ అరిచాడు.
‘ఆగు. రావద్దు’
వెనక్కి తిరిగి జార్జ్ పక్కన నిలబడ్డ గార్డ్ రివాల్వర్ని తీయడం చూసిన ఎలెక్స్ గార్డ్ వైపు కాల్చాడు. కాని గురి తప్పి గుళ్లు జార్జ్ పొత్తికడుపులో దిగడం చూసిన ఎలెన్ కెవ్వున అరిచింది. గార్డ్ పేల్చిన గుళ్లకి ఎలెక్స్ నేలకూలాడు.
విధి? కర్మ? క్లెయిర్‌వాయెన్స్? ఇలాంటి ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయి? జార్జ్ ప్రాణాలు పోవడం ఎలెన్‌కి కొన్ని గంటల ముందు సినిమాలో చూసినంత స్పష్టంగా ఎలా కనిపించింది? దానికి కారణం అయిన ఎలెక్స్ ఎందుకు కనపడలేదు? ఆమెకి కల వచ్చిన సమయంలోనే అలెక్స్‌కి స్ట్రోక్ ఎందుకు వచ్చింది? మర్నాటి రాత్రి లోగా చనిపోతాడని ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.