నమ్మండి! ఇది నిజం!!

వజ్రాల హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయం న్యూలేండ్ అనే అమెరికన్ పర్యాటకుడి ద్వారా ప్రపంచానికి తెలిసింది. పర్యాటకుడిగా మెక్సికో సిటీకి వెళ్లిన న్యూలేండ్‌కి హోటల్ సిబ్బందిలోని ఒకరు మాటల్లో మైఖేల్ గురించి చెప్పారు. పక్కా తాగుబోతైన మైఖేల్ ఓ పెగ్ విస్కీకి తన జీవితంలో సంభవించిన ఓ వింత విషయాన్ని చెప్తాడని, అరగంట కాలక్షేపానికి అతను పనికొస్తాడని వాళ్లు చెప్పడంతో న్యూలేండ్‌కి ఆసక్తి కలిగి ఆ హోటల్ బార్‌కి తాగడానికి వచ్చిన మైఖేల్‌తో మాట్లాడాడు.
ధనవంతురాలైన మైఖేల్ మేనత్త మార్తా పదేళ్ల క్రితం ఇంగ్లండ్ నించి తిరిగి వచ్చేప్పుడు ఓ వజ్రాల హారాన్ని కొనుక్కొచ్చింది. అది ఓ పురాతన డచెస్‌కి చెందింది. మేనల్లుడు మైఖేల్ తప్ప ఆవిడకి ఎవరూ లేరు. లిజా అనే ఓ మెయిడ్ ఆవిడ అవసరాలు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. దరిద్రంలో పుట్టి పెరిగిన లిజా మీద ఆవిడ ప్రభావం చాలా పడింది. ఆవిడలాగా ఖరీదైన దుస్తుల్ని వేసుకుని, అలంకరించుకోవాలనే కోరికతో ఉండేది.
మార్తా ఇంగ్లండ్ నించి తెచ్చిన ఆ నెక్లెస్‌ని చూపించడానికి మైఖేల్‌కి కబురు చేసింది. సామాన్య ఉద్యోగస్థుడైన మైఖేల్ మనసులో, విసుక్కుంటూనే సిటీబస్‌లో ఆవిడ ఇంటికి చేరుకున్నాడు. ఆవిడ ఆ నెక్లెస్‌ని గర్వంగా చూపించింది. అది లిజాకి కూడా నచ్చింది. మార్తా దాన్ని మెళ్లో ఉంచుకుని హుక్‌ని పెట్టుకోలేకపోతే మైఖేల్ సహాయం చేశాడు. గది మూలకి వెళ్లి గ్లాస్‌లో షాంపేన్ పోసుకుని మళ్లీ వెనక్కి తిరిగేసరికి చేత్తో నెక్లెస్ పట్టుకుని నేల మీద పడి కొట్టుకునే మార్తా కనిపించింది. వెంటనే మైఖేల్ ఆవిడ నెక్లెస్‌ని విప్పతీసి కిందపడేసి, ఆవిడ్ని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు. ఈలోగా లిజా డాక్టర్‌కి ఫోన్ చేసింది. కింద పడ్డ నెక్లెస్ దానంతట అదే ముడుచుకోవడం ఆ ఇద్దరిలో ఎవరూ చూడలేదు. ఆయన వచ్చేసరికే ఆవిడ మరణించింది. హార్ట్ ఎటాకై ఉండచ్చని డాక్టర్ భావించాడు.
* * *
మార్తా లాయర్ ఆ ఇద్దర్నీ పిలిపించి విల్లుని చది
వాడు. మార్తా తన ఆస్తిపాస్తులు, వజ్రాల హారాన్ని లిజాకే రాసింది. మేనల్లుడు మైఖేల్‌కి కేవలం నలభై పెసోలని మాత్రమే రాసింది - విల్లు విన్నాక ఇంటికి వెళ్లడానికి బస్ ఛార్జీల కోసం. మైఖేల్ ఎంత ఆశ్చర్యపోయాడో లిజా కూడా అంతే ఆశ్చర్యపోయింది. మైఖేల్ కోపంగా వెళ్లిపోయాడు.
* * *
కొద్ది రోజుల తర్వాత ఓసారి రమ్మని లిజా కబురు చేస్తే మైఖేల్ ఆమె ఉంటున్న మార్తా ఇంటికి వెళ్లాడు. గతంలోలా కాక లిజా ఖరీదైన దుస్తుల్లో అందంగా అలంకరించుకుని కనపడింది. మేనత్త తనకి ఆస్థి ఇవ్వకపోవడంతో తను ప్రేమించిన లీనా తనని పెళ్లి చేసుకోడానికి తిరస్కరించిందని, కాని లిజా మోసం చేసి తన ఆస్థిని కాజేసిందని తను అనుకోవడం లేదని మైఖేల్ లిజాకి చెప్పాడు.
‘నలభై ఏళ్ల మీరు ఇరవై రెండేళ్ల లీనాని చేసుకునే కంటే ముప్పై రెండేళ్ల నన్ను చేసుకోవడం సబబు’ లిజా చెప్పింది.
మైఖేల్ ఆశ్చర్యపోయాడు. లిజా సొరుగులోంచి వజ్రాల హారాన్ని తీసి అతనికి ఇచ్చి కోరింది.
‘మీరు మీ మేనత్తకి దీన్ని అలంకరిస్తున్నప్పుడు నాకు మీరు దీన్ని అలంకరిస్తే బావుండును అని అనిపించింది.’
మైఖేల్ దాన్ని ఆమె మెళ్లో పెట్టి హుక్‌ని తగిలించాడు. షాంపేన్ తీసుకురావడానికి పక్క గదిలోకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో వెళ్లి చూస్తే నేల మీద పడి ఉన్న లిజా అతనికి కనిపించింది. ఆమె రెండు చేతులూ వజ్రాల హారాన్ని పట్టుకుని కనిపించాయి. ఏం జరిగిందో అతనికి అర్థం కాక డాక్టర్‌కి ఫోన్ చేశాడు. ఆమెని పరీక్షించాక గుండాగి మరణించి ఉంటుందని డాక్టర్ చెప్పాడు.
ఆ నెక్లెస్ తీసుకుని మైఖేల్ ఆనందంగా లీనా దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘లిజా పెళ్లి చేసుకోకుండా మరణిస్తే ఆ ఆస్థి నాకే వస్తుందని మా మేనత్త విల్లులో రాసింది. కాబట్టి ఆ ఆస్థికి ఇప్పుడు నేనే యజమానిని. మన పెళ్లి కానుకగా ఈ వజ్రాల హారాన్ని తెచ్చాను. దయచేసి స్వీకరించు’
లీనా సంతోషంగా దాని హుక్ తీసి మెళ్లో పెట్టుకుంది. కొద్ది క్షణాల్లో ఆమె రెండడుగులు వెనక్కి వేసి, ఎవరో గొంతు నులుపుతున్నట్లు అరుస్తూ హారాన్ని తీసే ప్రయత్నం చేయడం మైఖేల్ చూశాడు. అతను తక్షణం దాన్ని తీసేసి ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు. కిందపడ్డ హారం దానంతట అదే ముడుచుకోవడం మైఖేల్ చూశాడు.
డాక్టర్ వచ్చేసరికే లీనా మరణించింది. అంత చిన్న వయసు వారికి గుండె పోటు రాదని నమ్మిన డాక్టర్ పోలీసులకి ఫోన్ చేశాడు. మార్తా, లిజాల మరణానంతరం మైఖేల్‌కి ఆస్థి రావడం, లీనా అతనితో పెళ్లికి తిరస్కరించడం విచారణలో తెలుసుకున్న పోలీసులు మూడు హత్యలు చేసిన హంతకుడిగా మైఖేల్‌ని అరెస్టు చేశారు.
* * *
‘హారం దానంతట అదే ముడుచుకోవడం చూశాను. హారం దానంతట అదే ముడుచుకుంది’ చెప్పి మైఖేల్ లేచి తూలుతూ బయటకి నడిచాడు.
ఓ వెయిటర్ న్యూలేండ్‌తో చెప్పాడు.
‘మైఖేల్‌కి శిక్ష పడ్డాక మానసిక రోగుల్ని ఉంచే హాస్పిటల్లో తొమ్మిదేళ్లుండి ఏడాది క్రితమే విడుదలయ్యాడు. అప్పటి నించి ఇక్కడికి వచ్చి డ్రింక్స్ ఇప్పించిన పర్యాటకులకి ఆ వజ్రాల హారం కథని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో? పదేళ్ల క్రితం కోర్ట్‌లో కూడా ఆ హారం దానంతట అదే ముడుచుకోవడం చూశాననే చెప్పాడు.’
మైఖేల్ చూసింది భ్రమా? లేక నిజంగా ఆ వజ్రాల హారం తనని ధరించిన వారిని చంపిందా? దాని అసలు యజమాని ఎవరు? ఆమె మరణించాక ఆ హారం మీద కాంక్షతో దయ్యంగా మారి, దాన్ని అంటిపెట్టుకుని ఈ హత్యలు చేసిందా? లేక శిక్షని తప్పించుకోడానికి మైఖేల్ కోర్ట్‌లో అబద్ధం ఆడాడా? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.