నమ్మండి! ఇది నిజం!!

క్వీన్ ఏగ్నెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరప్‌లో జిప్సీలు ఎక్కువ. బంగారు రంగు జుట్టు, నీలం రంగు కల్లు గల ఆ దేశ దిమ్మరులు యూరప్‌లోని అనేక దేశాల్లో నివసిస్తారు. వాళ్లు జ్యోతిషం చెప్తూ, అదృష్ట తాయెత్తులు లాంటివి అమ్ముతూ జీవిస్తారు.
బ్రిటన్‌లోని అలాంటి వారిలో ఒకరు వృద్ధురాలైన మేడం లోలా. ఏడో తరానికి చెందిన ఏడవ సంతానమైన తను జిప్సీ రాజుల సంతతికి చెందిన దానినని, అందువల్ల క్వీన్ ఏగ్నెస్ తనకి భవిష్యత్తులో జరగబోయేవి చెప్తుందని లోలా తన గురించి చెప్పుకునేది. ఓ కాలువ పక్కన మొబైల్ ఇంట్లో నివసిస్తూ, బ్రిటన్ అంతా తిరుగుతూ జ్యోతిష్యం చెప్పే ఆవిడకి మేరియో ఒక్కడే కొడుకు. బయటకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే యువకుడైన మేరియో నించి లోలాకి ఆడవాళ్ల సెంట్ వాసన వేస్తూండేది. పెళ్లైన వాళ్లతో సంబంధం పెట్టుకుంటే ప్రమాదం అని లోలా ఆ వాసన వచ్చినప్పుడల్లా కొడుకుని హెచ్చరించేది.
ఓ రోజు బయట నించి వచ్చిన మేరియోని తల్లి ప్రశ్నించింది.
‘నా హెచ్చరిక గుర్తుందా?’
‘గుర్తుంది. ఆమె విధవరాలు. పేరు వౌడీ జిలెస్టీ. నాకీ ఉంగరం కూడా బహూకరించింది’ తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించి జవాబు చెప్పాడు.
వెంటనే ట్రాన్స్‌లోకి వెళ్లినట్లుగా లోలా కళ్లు మూతలు పడ్డాయి. ఆవిడ చెప్పింది.
‘ఈ పేరు నాకు గుర్తొస్తోంది. మేరీ.. మార్గరెట్.. మినర్వా.. వౌడి’ ఆవిడ కళ్లు తెరిచింది.
‘క్వీన్ ఏగ్నెస్ ఆమెని గుర్తు పట్టలేక పోయిందా? వౌడీ ఇంట్లో బల్ల మీద ఆమె మరణించిన భర్త కల్నల్ గోల్డ్‌స్ట్రీమ్ పులితో తీయించుకున్న ఫొటో ఉంది’ మేరియో నవ్వుతూ చెప్పాడు.
వెంటనే లోలా కొడుకుని చెంప దెబ్బ కొట్టి కోపంగా చెప్పింది.
‘క్వీన్ ఏగ్నెస్‌ని అవహేళన చెయ్యకు. నేను చెప్పే జ్యోతిష్యం అంతా నాకు ఆమె నించే అందుతోంది. నా గొంతులోని మాటలని ఆమే పలికిస్తోంది. మీ నాన్న నీళ్లల్లో మునిగి చస్తాడని నేను చెప్పిన జ్యోతిష్యం నిజం కాలేదా? ఏగ్నెస్ అంటే అప్పట్నించి నాకు భయం’
మేరియో తల్లికి సారీ చెప్పాడు.
* * *
లోలా మొబైల్ హోం పక్కన ఆగిన కార్లోంచి దిగిన ఓ యువతి జ్యోతిష్యం చెప్పించుకోడానికి ట్రైలర్‌లోకి వచ్చింది.
లోలా ఆమె అర చేతుల్లోని రేఖలని పరిశీలించి అడిగింది.
‘నీ పేరు మేరీ?’
ఆమె తల అడ్డంగా ఊపింది.
‘మార్గరెట్.. మినర్వా?’
‘రెండూ కాదు’
‘వౌడీ అవచ్చా? మీ ఆయన పులి వల్ల మరణించాడు కదా?’ లోలా అడిగింది.
అకస్మాత్తుగా ఆవిడ కళ్లు మూసుకుని ఏదో కనపడుతున్నట్లుగా గొణిగి కళ్లు తెరిచింది.
‘ఏం కనిపించింది?’ వౌడి ఆసక్తిగా అడిగింది.
‘నువ్వు నమ్మవు. నేల మీద నీ శవం. ఆ శవం మీద నించి ఓ యువకుడు లేస్తున్నాడు... బయటకి నడు’ లోలా కోపంగా అరిచింది.
‘ఏమిటి? ఎందుకు?’ ఆమె నివ్వెరపోతూ అడిగింది.
‘ముందు బయటకి నడు. మా అబ్బాయికి దూరంగా ఉండు’ లోలా హెచ్చరికతో కూడిన ఆవేదనతో చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత వచ్చిన మేరియో తల్లిని అడిగాడు.
‘వౌడిని ఎందుకు వెళ్లగొట్టావు? నీ ముద్దుల కొడుకు గర్ల్‌ఫ్రెండ్స్ అందర్నీ ఎందుకు వాడికి దూరం చేస్తున్నావు?’
‘నల్ల జుట్టు.. ఎర్రటి నెత్తురు.. నువ్వు ఆమెతో స్నేహం చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతావు. నువ్వు హంతకుడివి అవుతావు. నేను ఆ దృశ్యాన్ని చూసాను మేరియో’ మేడం లోలా ఆదుర్దాగా చెప్పింది.
మేరియో పగలబడి నవ్వాడు.
* * *
ఆ రాత్రి మేరియో, అతని మిత్రుడు రైడర్, వౌడి కలిసి ఓ ఇన్‌లో బాగా తాగాక మొబైల్ హోంకి చేరుకున్నారు. లోలాని వౌడి నిద్ర లేపింది. తన కొడుకుని తాగించద్దని ఆవిడ రైడర్‌ని హెచ్చరించింది.
‘మేం ముగ్గురం బాగా ఆకలేస్తే తినడానికి డాల్ఫిన్ ఇన్‌కి వెళ్లాం. ఏల్ కనిపించడంతో తాగాం’ వౌడి మత్తుగా చెప్పింది.
‘వద్దన్నా వెయిటర్ మా గ్లాసులు నింపుతూనే ఉన్నాడు’ మేరియో చెప్పాడు.
‘అది అబద్ధం. బిల్ కట్టేది నేను కాబట్టి మీ అబ్బాయి నో చెప్పలేదు’ రైడర్ నవ్వుతూ చెప్పాడు.
‘తప్పే అమ్మా. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి మేమే తాగడం నిజంగా తప్పే’ మేరియో చెప్పాడు.
‘నా గురించి మీరు తప్పుడు జ్యోతిష్యం చెప్పారు’ మత్తులోని వౌడి అరిచింది.
ఆవిడని వాళ్లు ఏడిపించడంతో లోలా వాళ్లని కత్తితో బెదిరించి బయటకి పంపించింది. వౌడి మేరియోని తిట్టి వెళ్లిపోయింది.
‘నువ్వు మళ్లీ నా గర్ల్‌ఫ్రెండ్‌ని నాకు దూరం చేసావు’ మేరియో తల్లి మీద అరిచాడు.
రైడర్‌తో మళ్లీ డాల్ఫిన్స్ ఇన్‌కి వెళ్తున్న మేరియో, లోలా వారించినా వినలేదు.
లోలా కొద్దిసేపటి తర్వాత ఇన్‌లోకి ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో వచ్చి తన కొడుకు మిసెస్ వౌడి నించి ఉంగరం దొంగిలించాడని, వాడిని అరెస్ట్ చేయమని కోరింది. కానిస్టేబుల్ అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్లాడు.
‘వారం రోజులు వాడు జైల్లో ఉండొస్తే తిక్క కుదురుతుంది’ రైడర్‌తో చెప్పింది.
లోలా ఇంటికి తిరిగి వస్తూండగా ఓ పార్క్‌లో వౌడి కనిపించి చెప్పింది.
‘నేనా ఉంగరాన్ని బహుమతిగా ఇస్తే దొంగతనం అని ఆరోపించి మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయించావు? మీ జిప్సీలంతా ఇంతే. నీ జిప్సీ కొడుకు కూడా చెడ్డవాడు. అనవసరంగా ఐదు పౌన్ల బాండ్ మనీ కట్టి వాడ్ని విడిపించాను’
సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చిన మేరియోని కూడా తాగిన మత్తులో తిట్టి ఇక తామిద్దరికీ సంబంధం లేదని, తన దగ్గరికి రావద్దని ఆమె ఖరాఖండీగా చెప్పింది. మేరియో కోపంగా ఆమె మీద మీదకి వెళ్లడంతో వౌడీ వెనక్కి పడింది. తలకి రాయి కొట్టుకుని రక్తం కారసాగింది. మేరియో వంగి ఆమెని పరిశీలించి భయంగా పైకి లేచాడు.
తనకి ఊహల్లో కనిపించింది కళ్ళారా చూసిన మేడం లోలా నిశే్చష్టురాలైంది. అతను తాగిన మత్తులో, ప్రియురాలు మరణించిందన్న ఆవేశంలో, వౌడి మరణానికి ఆవిడే కారణం అని అరుస్తూ లోలా మెడ చుట్టూ టై బిగించి చంపాడు.
జిప్సీలు భవిష్యత్‌ని చెప్పగలరు, చూడగలరు అని యూరోపియన్ల నమ్మకం. వౌడి మరణాన్ని మనోనేత్రంతో చూసిన లోలాకి తన మరణం ఎందుకు కనపడలేదు? అన్ని పరిస్థితులూ ఆవిడకి కనిపించిన దృశ్యం వైపే ఎలా దారి తీసాయి? ఈ కేసు వివరాలు యూరప్‌లోని అన్ని దినపత్రికలు ప్రచురించాయి. కాని ఆ పత్రికలు వేసిన ఈ ప్రశ్నలకి జవాబులు ఎవరూ చెప్పలేక పోయారు. ఆ జవాబులు దేవుడికే తెలియాలి.