నమ్మండి! ఇది నిజం!!

బాధా నివారణ పితామహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానీ తను మూడో సంవత్సరం వైద్య విద్యార్థినని సర్కస్‌లో ఎవరికీ చెప్పలేదు. తన కాలేజ్ ఫీజ్ కట్టటానికి అతను వేసవి సెలవుల్లో ఆ సర్కస్‌తోపాటు ప్రయాణించేవాడు. అతని తోటి విద్యార్థులకి కూడా ఇది తెలీదు. దాంతో తన పేరు స్థానంలో బుల్‌వాకర్ అనే పేరుతో ప్రచారం పొందాడు. అతనకి అప్పటి నించీ వైద్యుడిగా నొప్పి మీద ఆసక్తి కలిగింది. తర్వాతి ఏభై ఏళ్లు అతను మనిషి అనుభవించే శారీరక బాధ మీద కేంద్రీకరించి, దాని నివారణోపాయాన్ని కనుగొనే పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు.

జూలియస్ సీజర్ ఓ మాట అన్నాడు. ‘ఓ మనిషి ఇంకో మనిషి కోసం తన ప్రాణాలని ఇవ్వడానికి సిద్ధపడతాడు. కాని ఓ రోగి పడే బాధని తీసుకోడానికి ముందుకు రాడు.’
ఇతరుల బాధలని తొలగించడానికి కృషి చేసిన ఓ వ్యక్తి గురించి ఎవరికీ తెలీదు. అతనికి అవార్డులు గాని, అతని మీద పుస్తకాలు రాలేదు. హాలీవుడ్‌లో సినిమాలు రాలేదు. అతని పేరు జాన్ జె బొనీకా. ఇతనికి గల మరో పేరు జానీ బుల్‌వాకర్.
1941లో న్యూయార్క్ రాష్ట్రంలోని బ్రూక్‌ఫీల్డ్ అనే చిన్న ఊరికి సర్కస్ వచ్చింది. బఫూన్లు, వైర్ల మీద నడిచేవారు, జంతువులతోపాటు గ్రామస్థులు బలాఢ్యుడైన జానీ బుల్‌వాకర్‌ని చూడటానికి కూడా వెళ్లేవారు.
ఆ రోజు సర్కస్ స్పీకర్లలో ‘ప్రేక్షకుల్లో డాక్టర్ ఉంటే వెంటనే సింహం టెంట్‌లోకి రావాలి’ అనే ప్రకటన వినిపించింది. ఆ రోజు సర్కస్‌లోని ఆఖరి అంశంలో చిన్న అపశ్రుతి దొర్లింది. సింహాల శిక్షకుడు తన తలని సింహం నోట్లో ఉంచాడు. కాని మళ్లీ దాన్ని బయటకి తీయలేకపోయాడు. అతనికి గాలి అందడం లేదు. చివరికి సింహం నోరు తెరచుకున్నాక స్పృహ లేని అతను కింద పడిపోయాడు. జానీ బుల్‌వాకర్ సింహం దవడలని లాగి అతన్ని రక్షించాడు.
జానీ తను మూడో సంవత్సరం వైద్య విద్యార్థినని సర్కస్‌లో ఎవరికీ చెప్పలేదు. తన కాలేజ్ ఫీజ్ కట్టటానికి అతను వేసవి సెలవుల్లో ఆ సర్కస్‌తోపాటు ప్రయాణించేవాడు. అతని తోటి విద్యార్థులకి కూడా ఇది తెలీదు. దాంతో తన పేరు స్థానంలో బుల్‌వాకర్ అనే పేరుతో ప్రచారం పొందాడు. అతనకి అప్పటి నించీ వైద్యుడిగా నొప్పి మీద ఆసక్తి కలిగింది. తర్వాతి ఏభై ఏళ్లు అతను మనిషి అనుభవించే శారీరక బాధ మీద కేంద్రీకరించి, దాని నివారణోపాయాన్ని కనుగొనే పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. ఆధునిక వైద్యంలో బాధా నివారణకి అధిక కృషి చేసిన ఈ వైద్యుడు బోనికా బాధా నివారణా పిత అని టైం మేగజైన్ ఓసారి అతని గురించి రాసింది.
1942లో న్యూయార్క్‌లోని సెయింట్ వినె్సంట్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌గా చేరాడు. అతనికి జీతం ఇచ్చేవారు కాదు. దాంట్లో కుస్తీపోటీల్లో పాల్గొని సంపాదించేవాడు. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఐన ఏంజెలో సవోల్డీతో పోరాడాడు. ఈ ముష్ఠి యుద్ధాల్లో అతనికి అనేక శారీరక నొప్పులు కలిగాయి. అనేకసార్లు పక్కటెముకలు విరిగాయి. హిప్ జాయింట్స్ తొలిగాయి. రెండుసార్లు కంటికి దెబ్బ తగిలి దాదాపుకనుచూపు పోయే పరిస్థితి ఏర్పడింది. చెవులు చీలికలు అయ్యాయి. మొహానికి గాయనై పెద్ద మచ్చ కూడా ఏర్పడింది. మర్నాడు సర్జికల్ మాస్క్‌తో మొహాన్ని కనపడనీకుండా చేసి హాస్పిటల్‌కి వెళ్లాడు. ఇలా అతనికి అనేకసార్లు శారీరక బాధ కలుగుతూండేది.
జానీ భార్య ఎమ్మా హాస్పిటల్‌లో పురిటి నొప్పులు పడటం చూసి ఇంటర్న్‌ని పిలిచి ఆమెకి కొన్ని చుక్కల ఈథర్‌ని ఇవ్వమని కోరాడు. అక్కడ చేరి మూడు వారాలే ఐన ఇంటర్న్‌కి ఆ పని చేతకాకపోవడంతో ఆమెకి వాంతై, అది శ్వాసనాళానికి అడ్డుపడి, గాలి అందక నీలి రంగులోకి మారింది. బొనీకా ఆమె గొంతుకి అడ్డుపడ్డ వాంతిని తొలగించి బతికించాడు. ఫలితంగా మృత శిశువు జన్మించింది. దాంతో బొనీకా తన జీవితాన్ని ఎనస్థీషియాలజీకి అంకితం చేశాడు. ప్రసవ సమయంలో తల్లులకి బాధని తగ్గించే ఎపిడ్యూరస్‌ని కనుగొన్నాడు.
ఈ విషయంలో శిక్షణ పొందడానికి అమెరికాలోని టకోమాలోని ఆనాటి పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటైన 7,700 పడకలు గల మెడిగన్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో శిక్షణకి వెళ్లాడు. అప్పుడు అతని వయసు 27. బాధ మనిషికి అలారం బెల్ లాంటిదని, శరీరానికైన గాయాన్ని అది సూచిస్తుందని అంతదాకా అనుకునేవారు. కాని కాలు తీసేసాక కూడా లేని కాలు తాలూకు బాధని కొందరు రోగులు అనుభవించడాన్ని చూశాక అతను హాస్పిటల్‌లోని సర్జన్స్, న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, రోగులని శారీరక నొప్పి మీద ప్రశ్నిస్తూ, లంచ్ టైంలో గ్రూప్ మీటింగ్స్ కూడా నిర్వహించేవాడు. అతను 14,000 పేజీల వైద్య పుస్తకాలని చదివితే కేవలం పదిహేడుసార్లే నొప్పి అనే పదం కనిపించింది. రోగికి అది ఇబ్బంది కలిగించే అతి సాధారణమైన విషయమే ఐనా బాధ గురించి ఎవరూ ఆలోచించక పోవడం అతన్ని నివ్వెరపరచింది.
తర్వాతి ఎనిమిది సంవత్సరాలు బొనీకా బాధ గురించి మాట్లాడాడు. రాసాడు. తర్వాత దానికి ‘బైబిల్ ఆఫ్ పెయిన్’ అనే పేరు వచ్చింది. అందులో అతను బాధా నివారణకి కొత్త పద్ధతులని, చికిత్సా విధానాలని సూచించాడు. బాధని ప్రసారం కానీకుండా నరాన్ని అడ్డగించే ఇంజక్షన్స్ అతని ఆలోచనే. రోగులు అనుభవించే శారీరక బాధలని డాక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని అతను బోధించేవాడు.
అతని ప్రయత్నాలు 1974లో కాని సఫలం కాలేదు. అప్పట్నించీ ప్రపంచంలో వందల కొద్దీ పెయిన్ క్లినిక్స్ పని చేయడం ఆరంభించాయి. ఇరవై ఏళ్లపాటు 1500 కుస్తీ పోటీల్లో పాల్గొనడంతో బొనీకాకి 57వ ఏట ఆస్టియో ఆర్థరైటిస్ తీవ్రంగా వచ్చింది. ఆ తర్వాతి ఇరవై ఏళ్లు అతనికి 22 ఆపరేషన్స్ జరిగాయి. అందులో నాలుగు వెనె్నముక ఆపరేషన్లు, అతి కష్టం మీద చేతిని ఎత్తడం, మెడని తిప్పడం చేయగలిగేవాడు. ఈ ప్రపంచంలో నర్వ్ బ్లాక్ ఇంజక్షన్లని అధికంగా తీసుకున్న వ్యక్తిగా అతన్ని నర్సులు చమత్కరించేవారు. ఆ స్థితిలో కూడా రోజుకి 15-18 గంటలు పని చేసేవాడు.
బాధని దగ్గర నించి చూసి, అనుభవించి, ఇతరుల్లా దాన్ని విస్మరించక, దయతో బొనీకా వైద్యంలో బాధా నివారణ అనే కొత్త విషయాన్ని కనిపెట్టాడు.

-పద్మజ