మహబూబ్‌నగర్

కొల్లాపూర్ రైలు మార్గం ఏర్పాటయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపి నంది ఎల్లయ్యపైనే ఆశలు
నాగర్‌కర్నూల్, నవంబర్ 29: స్వాతంత్రం రాకమునుపే ఆంగ్లేయుల పాలనలో కొల్లాపూర్ మీదుగా కృష్ణనదిపై రైలు మార్గానికి శ్రీకారం చుట్టగా జటప్రోల్ సంస్థానాదీశులు రైలు మార్గం ఏర్పడితే నల్లమల అడవులు పాడవుతాయని రాజుల పట్ల ప్రజలలో గౌవరం తగ్గుతుందని అడ్డుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు ఈప్రాంత ప్రజలు రైలు మార్గానికి నోచుకోలేదు. ప్రస్తుత నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్య సీనియర్ పార్లమెంట్ సభ్యులు కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏడుమార్లు లోక్‌సభ, రెండుమార్లు రాజ్యసభ సభ్యులుగా పని చేసిన నంది ఎల్లయ్యకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక పలుకుబడి ఉందని, ఆయనకున్న అనుభవం, కేంద్ర అధికారులతో ఉన్న పరిచయాలతో ఈ రైల్వేలైన్‌కు మోక్షం కలుగుతుందనే ఆశాభావంతో ప్రజలున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుండి వయా జడ్‌చర్ల, కర్నూల్ మీదుగా నంద్యాలకు రైలు మార్గం ఉంది. ఇది 280 కి.మీ దూరం ఉంది. అదే జడ్‌చర్ల నుండి బిజినేపల్లి, నాగర్‌కర్నూల్,కొల్లాపూర్, సోమశిల కృష్ణానదిపై నందికొట్కూర్‌ల మీదుగా రైలు మార్గం ఏర్పాటైతే 153 కి.మీ. దూరం అవుతుంది. దీనితో హైదరాబాద్ నుండి నంద్యాల ద్రోణాచలం పోయే ప్రయాణికులకు 128కి.మీ దూరం తగ్గుతుంది. డబ్బులు ఎంతో అదా అవుతాయి. గతంలో ఎంపిలైన మల్లురవి, మంద జగన్నాథంలు కేంద్ర మంత్రులకు ఎన్నో మార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వీరి ఒత్తిడి మేరకు కేంద్ర రైల్వేశాఖ ఈ మార్గంపై సర్వే నిర్వహించి 2005-06కేంద్ర రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు ప్రైమరి రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ రైలు మార్గం సమీపంలోనే కర్నూల్ జిల్లాలో బండల పరిశ్రమలు, రైల్వే లైనుకు ఉపయోగపడే స్టోన్ మెటల్ అపారంగా ఉందని, పాణ్యం సిమెంటు ప్యాక్టరీ, అనేక సిమెంట్ పరిశ్రమలు, పైపుల ప్యాక్టరీల పనులు జరుగుతున్నాయి. ఇరిగేషన్‌కు సంబందించి తెలుగు గంగ, కెసి కెనాల్, జూరాల, బీమాలతో పాటు కెఎల్‌ఐ ప్రాజెక్టులు ఉన్నాయని రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ పరంగా అమ్ముకోవడానికి మరియు రసానియక ఎరువులు అక్కడి నుండి ఇక్కడికి ఎగుమతులకు దిగుబడులకు ఎంతో సులభంగా ఉంటుంది. ఈప్రాంతంలో రైలు మార్గం ఏర్పాటైతే సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని, రైలు మార్గం చేపట్టాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్య, లోక్‌సభలో టిఆర్‌ఎస్ పార్లమెంట్ నాయకులు, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డితోపాటు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు తగిన దృష్టిని కేంద్రీకరించి ఈ రైల్వేలైన్ మంజూరు కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.