క్రీడాభూమి

నారైన్ రికార్డు ఫిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరుపై నైట్ రైడర్స్ ఘన విజయం

బెంగళూరు, మే 7: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్నర్ సునీల్ నారైన్ అత్యంత వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేయగా, క్రిస్ లిన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా నైట్ రైడర్స్‌కు అలవోక విజయాన్ని సాధించిపెట్టింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో మన్దీప్ సింగ్, ట్రావిస్ హెడ్ గొప్పగా పోరాడి అర్ధ శతకాలు సాధించినప్పటికీ, ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రికార్డు హాఫ్ సెంచరీ చేసిన నారైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకోవడంలో చేతులెత్తేసిన కోహ్లీ సేనకు ఈ ఓటమి వల్ల కొత్తగా వచ్చిపడిన నష్టమేమీ లేదు.
సరైన నిర్ణయం
టాస్ గెలిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ మొదటి బంతికే క్రిస్ గేల్ వికెట్‌ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో గౌతం గంభీర్ క్యాచ్ పట్టగా అతను వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మన్దీప్ సింగ్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ (5), స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ (10) ఎక్కువ సేపు పోరాడకుండానే పెవిలియన్ చేరారు. మన్దీప్ 43 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి, సునీల్ నారైన్ బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ విజృంభణ కొనసాగకపోతే, బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉండేది. కేదార్ జాదవ్ (8), పవన్ నేగీ (5) ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. బెంగళూరు ఇన్నింగ్స్ ఆరు వికెట్లకు 158 పరుగుల వద్ద ముగిసే సమయానికి శ్రీనాథ్ అరవింద్ (0)తోపాటు ట్రావిస్ హెడ్ నాటౌట్‌గా నిలిచాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించిన అతని స్కోరులో మూడు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు ఉన్నాయి.
చెలరేగిన ఓపెనర్లు
బెంగళూరును ఓడించేందుకు 159 పరుగులు చేయాల్సిన నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నారైన్ గట్టి పునాది వేశారు. చెలరేగిపోయిన వీరిద్దరూ మొదటి వికెట్‌కు 6.1 ఓవర్లలోనే 105 పరుగులు జోడించారు. కేవలం 17 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 54 పరుగులు సాధించిన నారైన్‌ను వికెట్‌కీపర్ కేదార్ జాదవ్ క్యాచ్ పట్టగా అనికేత్ చౌదరీ అవుట్ చేశాడు. మరో రెండు పరుగులకే లిన్ వికెట్ కూడా పడింది. అతను 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 పరుగులు చేసి, పవన్ నేగీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కొలిన్ డి గ్రాండ్‌హమ్ 31, కెప్టెన్ గౌతం గంభీర్ 14 పరుగులు చేసి అవుట్‌కాగా, మరో 29 బంతులు మిగిలి ఉండగానే నైట్ రైడర్స్ 4 వికెట్లకు 159 పరుగులు సాధించి విజయభేరి మోగించే సమయానికి మనీష్ పాండే (4), యూసుఫ్ పఠాన్ (0) నాటౌట్‌గా ఉన్నారు. బెంగళూరు బౌలర్లలో పవన్ నేగీకి రెండు వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 (మన్దీప్ సింగ్ 52, ట్రావిస్ హెడ్ 75, ఉమేష్ యాదవ్ 3/36, సునీల్ నారైన్ 2/29).
కోల్‌కతా నైట్ రైడర్స్: 15.1 ఓవర్లలో 4 వికెట్లకు 159 (క్రిస్ లిన్ 50, సునీల్ నారైన్ 54, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 31, పవన్ నేగీ 2/21).

ఓపెనర్ల పరుగుల వరద..

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో మరో ఓపెనర్ క్రిస్ లిన్‌తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నారైన్ పరుగుల వరద పారించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో యూసుఫ్ పఠాన్‌తో కలిసి అతను మొదటి స్థానాన్ని పంచుకుంటున్నాడు. క్రిస్ లిన్ గాయపడడంతో, అంత వరకూ స్పెషలిస్టు బౌలర్‌గానే అందరికీ తెలిసిన నారైన్‌ను ఓపెనర్‌గా పంపాలన్న నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే, అతని వ్యూహం సరైనదేనని నారైన్ నిరూపిస్తున్నాడు. లిన్ గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టుతో చేరడంతో, ఆదివారం అతనితో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. హార్డ్ హిట్టర్ లిన్‌ను వెనక్కునెట్టి, 15 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని అధిగమించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నైట్ రైడర్స్‌కే చెందిన యూసుఫ్ పఠాన్ 15 పరుగుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసి నెలకొల్పిన రికార్డును నారైన్ సమం చేశాడు. ఈ జాబితాలో సురేష్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. అతను 2014లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా, మూడో స్థానాన్ని నలుగురు పంచుకుంటున్నారు. 2013లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై డక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఆడం గిల్‌క్రిస్ట్, 2016లో గుజరాత్ లయన్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు.