రంగారెడ్డి

రెండు ఎమ్మెల్సీ స్థానాలూ తెరాసకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి ఎంపి నర్సయ్యగౌడ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 17: జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు నాగేంధర్‌గౌడ్‌లతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనె రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజులను పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టినట్లు చెప్పారు. వీరిరువురిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నిత్యం సమీక్షలు జరుపుతున్నారని చెప్పారు. గ్రామస్థాయి నుండి అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని, ఇందుకోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ అమూల్యమైన ఓటును తెరాస అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షులు నాగేంధర్‌గౌడ్ అన్నారు. మూడెంచల స్థానిక సంస్థల వ్యవస్థను పటిష్టం చేసినట్లు చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లకు ప్రతి నెల గౌరవ వేతనాలు చెల్లించి ఆదరణ చూరగొంటుందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న ఇరువురు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తెరాస రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఇసి శేఖర్‌గౌడ్, తాళ్ళ వెంకటేష్‌గౌడ్, డబ్బికార్ శ్రీనివాస్, సత్తు వెంకటరమణారెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, బర్ల జగదీశ్వర్, నగరపంచాయతీ వైస్ చైర్మన్ సుల్తాన్, సతీష్, జక్క రాంరెడ్డి పాల్గొన్నారు.