జాతీయ వార్తలు

నాసిక్ గుడిలో మహిళల పూజలు: నిరసనగా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్ (మహారాష్ట్ర): నాసిక్‌లోని అత్యంత ప్రాచీనమైన త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి గురువారం ఉదయం మహిళలు ప్రవేశించి పూజలు చేశారు. ఆలయాల్లోకి మహిళలను అడ్డుకోరాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో త్రయంబకేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు పాత నిబంధనలను సడలించింది. ఉదయం 6 నుంచి ఒక గంటసేపు తడి దుస్తులతో వచ్చి మహిళలను గర్భగుడిలోకి రావచ్చని ఆంక్షలను సడలించారు. దీంతో స్వరాజ్ సంఘటన్ అనే సంస్థ నేతృత్వంలో మహిళలు గర్భగుడిలోకి వచ్చి పూజలు చేశారు. అయితే, శతాబ్దాల తరబడి కొనసాగుతున్న సాంప్రదాయాలకు ఆలయ అధికారులు స్వస్తి పలకడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం మహిళలు ఆలయానికి వచ్చినపుడు స్థానికులు దాడి చేయడంతో గురువారం ఉదయం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.