అంతర్జాతీయం

ఇస్తాంబుల్లో మరో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, మార్చి 19: బాంబు పేలుళ్లతో అట్టుడుకుతున్న టర్కీలో మరో పేలుడు జరిగింది. ఇస్తాంబుల్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేఖరులకు తెలిపారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని, పేలుడులో ఆత్మాహుతి బాంబర్ కూడా మృతిచెందాడని ఆయన తెలిపారు. ఆరు రోజుల క్రితం అంకారాలో జరిగిన పేలుడును దుర్ఘటనను మర్చిపోకముందే ఇస్తాంబుల్‌లో పేలుడు జరగడం గమనార్హం. పేలుడు అసలు టార్గెట్ ఇస్తిక్‌లాల్ కద్దేశి ప్రాంతంలోని స్థానిక అధికారుల నివాస భవనమని సాహిన్ తెలిపారు.

ఇలావుండగా గత జూలై నుంచి టర్కీలో ఇప్పటివరకు ఐదు బాంబు పేలుళ్లు సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం కుర్దిష్‌ల నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో మరిన్ని పేలుళ్లు జరగవచ్చని ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.