జాతీయ వార్తలు

అమెరికా తృతీయ ప్రపంచ దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 19: దుబాయ్, చైనా తదితర దేశాలతో పోలిస్తే వౌలిక వసతుల రంగంలో అమెరికా ఎంతో వెనుకబడి తృతీయ ప్రపంచ దేశంగా ఉందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (69) ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దేశ రూపురేఖలను సమూలంగా మార్చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మంగళవారం ప్రైమరీ ఎన్నికలు జరుగనున్న ఉటాలోని సాల్ట్‌లేక్ సిటీలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పై విషయాన్ని స్పష్టం చేశాడు. ‘దుబాయ్, చైనా తదితర దేశాల్లో రోడ్లు, రైల్ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అక్కడ బుల్లెట్ రైళ్లు గంటకు వందలాది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. వందేళ్ల క్రితం మనం న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎంత సమయం పట్టేదో ఇప్పుడూ అంతే సమయం పడుతోంది. దుబాయ్, చైనా తదితర దేశాలతో పోలిస్తే వౌలిక వసతుల విషయంలో అమెరికా ఎంతో వెనుకబడి తృతీయ ప్రపంచ దేశంగా ఉంది’ అని ట్రంప్ అన్నాడు. తనను దేశాధ్యక్షుడిగా ఎన్నుకుంటే అమెరికాను పునర్నిర్మించడంతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నరమేథం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల భరతం పడతానని ఆయన స్పష్టం చేశాడు. అమెరికా పేద దేశమని, తాను అధికారంలోకి వస్తే వాణిజ్యపరంగా దేశాన్ని అభివృద్ధిచేసి స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దుతానని ట్రంప్ చెప్పాడు.
ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ ధ్వజం
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు నామినేషన్ లభించకపోతే ‘అల్లర్లు’ చెలరేగే ప్రమాదం ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగడంపై ‘వైట్ హౌస్’ (అమెరికా అధ్యక్ష భవనం) శనివారం ధ్వజమెత్తింది. దేశంలో హింసను రాజకీయంగా ఎవరూ సమర్థించబోరని ఉద్ఘాటించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ అత్యంత ప్రజాదరణ పొందిన అభర్థిగా అవతరించాడన్న వాదనను కూడా వైట్ హౌస్ తోసిపుచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ట్రంప్‌కు సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంతో మంది ప్రతినిధులే ఓట్లు వేయలేదని, ట్రంప్ కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న హిల్లరీ క్లింటన్‌కే ఎక్కువ ఓట్లు లభించాయని వైట్ హౌస్ పేర్కొంది.