జాతీయ వార్తలు

సొమ్ము మాది.. సోకు మీదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ఇప్పటివరకూ కేంద్రం సొమ్ముతో సొంత సోకులు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార పప్పులు ఇకపై ఉడకవు. కేంద్రం ఇస్తోన్న నిధులతో కొనసాగుతున్న రాష్ట్ర పథకాల గురించి తప్పనిసరిగా ప్రచారం చేయాలని, అవి కేంద్ర పథకాలుగానే చెలామణి చేయాలని కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు, దేశంలో పబ్లిసిటీ సీఎంలుగా పేరున్న వారికి మింగుడుపడకుండా ఉంది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కేంద్రం వివిధ పథకాలకు నేరుగా నిధులు విడుదల చేస్తూ వస్తోంది. విద్య, వైద్యం, సాగునీరు, పౌష్టికాహారం, అంగన్‌వాడీ, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పించన్లు, ఎస్సీ-ఎస్టీ స్కాలర్‌షిప్‌లకు కేంద్రమే నిధులు ఇస్తున్నది. వీటికి కేంద్రమే నిధులు ఇస్తుందన్న విషయం 90 శాతం ప్రజలకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ పార్టీ దివంగత నేతల పేరుతోనే, పార్టీ పేరు వచ్చే మాదిరిగానో వాటికి పేర్లు తగిస్తున్నాయి. దాంతో ఆ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలవేనన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది.
మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విమర్శల దాడులు పెరిగిపోయాయి. కేంద్రం తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శల దాడులు చేస్తుండటంతో కేంద్రం వ్యూహం మార్చింది. తామిచ్చిన నిధులు తీసుకుని, వాటికి తమ సొంత పేర్లు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపేసుకుంటున్న ప్రభుత్వాలకు చెక్ పెట్టే వ్యూహానికి తెరలేపింది.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో, కేంద్రం నుంచి వస్తున్న నిధులతో కొనసాగుతున్న పథకాలను తప్పనిసరిగా,ప్రత్యేకంగా పేర్కొనాలని తాజాగా ఆదేశించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయాలని పేర్కొనటం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందిరకంగా పరిణమించింది.
తాము వివిధ పేర్లతో కొనసాగిస్తోన్న పథకాలన్నీ కేంద్రానివేనని స్పష్టం చేయడం ద్వారా, ఆ ఘనత అంతా కేంద్రప్రభుత్వానికే వెళుతుందన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో మొదలయింది. ఈ నిర్ణయం దేశంలో పబ్లిసిటీలో దూసుకుపోతున్న కొందరు ముఖ్యమంత్రులకు ఇబ్బందికరమే. రాష్ట్రాల్లో కేంద్రాన్ని విమర్శిస్తూ, ఢిల్లీకి వెళ్లి మోదీని పొగుడుతున్న పార్టీల ప్రచారానికి తాజా నిర్ణయంతో తెరపడుతుందని విశే్లషిస్తున్నారు. ఇప్పటివరకూ కేంద్రనిధులు తీసుకుంటూ, మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేసుకుంటున్న విపక్షాలకు చెక్ చెప్పడంతోపాటు, పార్టీని జనంలోకి తీసుకువెళ్లే వ్యూహమేనంటున్నారు.
ఇప్పుడు కేంద్రంలోని బిజెపి నాయకత్వం కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనే చెప్పించే వ్యూహానికి తెరలేపింది. తమకు సన్నిహితంగా ఉంటున్న ముఖ్యమంత్రులు కూడా తమను ఢిల్లీలో పొగిడి, రాష్ట్రాలకు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీతో యుద్ధం చేయడానికయినా సిద్ధమేనంటూ చేస్తున్న ప్రకటనలను కూడా మోదీ సీరియస్‌గా తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పించన్లు అన్నీ కేంద్ర నిధులవే కావటంతో, తమ ప్రభుత్వమే వృద్ధులు, వితంతులు, వికలాంగులు, దళిత, గిరిజనులకు స్కాలర్‌షిప్పులను బిజెపి ప్రభుత్వమే ఇస్తోందన్న ప్రచారంతో పార్టీ ఇమేజ్ పెంచుకోవాలన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.