జాతీయ వార్తలు

సైనికులకు సొంతింటి స్వీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఏ పనిచేసినా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఏ మంత్రిత్వశాఖలో ఉన్నా దానికి తగ్గట్టుగా ఆమె వ్యవహార శైలి ఉంటుంది. సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ప్రముఖ స్థానంలో ఉన్న స్మృతి ఇరానీ సియాచిన్‌కు వెళ్లి రక్షాబంధన్ సందర్భంగా అక్కడి జవాన్లకు రాఖీలు కట్టి ఆత్మీయత అనురాగాలను చాటిచెప్పారు. దేశ సరిహద్దులను నిరంతరం పహార కాస్తున్న జవాన్ల వద్దకు ప్రభుత్వం చేరాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానుసారమే ఆమె ఈ హిమప్రాంతానికి వెళ్లారు. దాదాపు ఇరవై మంది సైనికులకు తానే స్వయంగా రాఖీలు కట్టి వారిని ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్థిల్లాలని ఆశీర్వదించారు. రాఖీలు కట్టడమే కాకుండా ఢిల్లీలోని తన ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను కూడా ఈ సందర్భంగా వారందరికీ పంచారు. దేశ సరిహద్దులకు రక్షణ కవచంగా నిలుస్తున్న సైనికులకు యావద్భారతం రుణపడి ఉంటుందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని సైనికులతో కలిసి జరుపుకోడాన్ని గౌరవంగా భావిస్తున్నాని ఆమె అన్నారు. స్మృతి ఇరానీతోపాటు కేంద్ర మహిళా మంత్రులు సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, అనుప్రియా పటేల్, నిర్మలాసీతారామన్, ఉమాభారతి తదితరులు కూడా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి సైనికులతో రక్షాబంధన్ జరుపుకొన్నారు.

చిత్రం.. సియాచిన్‌లో సైనికులకు రాఖీలు కడుతున్న స్మృతీ ఇరానీ