జాతీయ వార్తలు

చెక్కుచెదరని ప్రజాభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: మోదీ ప్రభుత్వం పాపులారిటీ అది అధికారం చేపట్టిన రోజు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ మద్దతును అలాగే నిలబెట్టుకోవాలంటే పార్టీ ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో బిజెపి కొత్త కార్యాలయ భవన నిర్మాణం పనులు గురువారం ప్రారంభ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. దీన్‌దయాళ్ మార్గ్‌లోని రెండెకరాల స్థలంలో విస్తరించి ఉండే ఈ భవనం డిజైన్ పార్టీ సాంస్కృతిక, జాతీయవాద అజెండాకు ప్రతిరూపంగా ఉంటుందని బిజెపి నాయకుడొకరు చెప్పారు. ఈ భవనంలో రెండు మూడు వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహణకు వీలుగా ఉంటుందని, ఏదయినా భారీ పార్టీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి భవనం వెలుపల భారీ స్క్రీన్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు నిర్వహించిన యజ్ఞంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. 2018 డిసెంబర్‌నాటికల్లా నూతన భవనం సిద్ధమవుతుందని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినోత్సవం రోజున భవన ప్రారంభోత్సవం జరపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా 10 మంది సభ్యుల స్థాయినుంచి 11 కోట్ల సభ్యుల స్థాయికి చేరుకోవడానికి పార్టీ జరిపిన ప్రయాణంలో పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. ఈ రోజు బిజెపికి వెయ్యి మందికి పైగా ఎమ్మెల్యేలు, 300 మందికి పైగా ఎంపీలున్నారని, 15 రాష్ట్రాల్లో సొంతంగా కానీ, మిత్రపక్షాలతో కలిసి భాగస్వామిగా కానీ అధికారంలో ఉందని ఆయన అన్నారు. దేశంలోని మొత్తం 350 జిల్లాల్లోను కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పార్టీ అనుకుంటోందని, ఇప్పటివరకు 250 జిల్లాల్లో స్థలాలను కొనుగోలు చేసిందని అమిత్ షా చెప్పారు.

చిత్రం.. ఢిల్లీలో బిజెపి నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న నరేంద్ర మోదీ. చిత్రంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా