జాతీయ వార్తలు

సైద్ధాంతిక బలమే బిజెపి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: బ్రిటీష్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ప్రతికూలతల కంటే కూడా స్వతంత్య్ర భారతంలో బిజెపి ఎన్నో రకాల సవాళ్లు, సమస్యలను ఎదుర్కొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రయత్నాన్నీ కూడా తప్పుకోణంలోనే చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా పార్టీల కంటే కూడా బిజెపి చేసిన త్యాగాలే ఎక్కువని గురువారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ అన్నారు. భారత దేశ బలం పెరుగుతున్న కొద్దీ విచ్ఛిన్నకర శక్తులు మరింతగా రెచ్చిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సుహృద్భావ సామాజిక వాతావరణాన్ని బలోపేతం చేయాల్సిన అలాగే సామరస్యాన్ని పెంపొందించాల్సిన అవసరం మరింతగా పెరిగిందన్నారు. ‘అందరికోసం అందరి వికాసం కోసం’ అన్న తమ పార్టీ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కేవలం సిద్ధాంతాలకే కట్టుబడి ఎలాంటి రాజకీయ అనువంశికత లేని పార్టీ ఎలా పని చేస్తుందో దేశ ప్రజలకు, ప్రజాస్వామ్య దేశాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. బిజెపి గురించి జరుగుతున్న ప్రచారానికి..దాని వాస్తవిక పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదన్న నిజాన్ని కూడా నిగ్గు దేల్చాలన్నారు. ఆవిర్భావం నుంచి బిజెపికి అడుగడుగునా కష్టాలేనని, దాని ప్రతి ప్రయత్నాన్నీ తప్పుబడుతూనే వచ్చారని మోదీ అన్నారు. ‘బ్రిటీష్ హయాంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న కష్టాల కంటే కూడా ఈ 50-60ఏళ్ల కాలంలో బిజెపి ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులే ఎక్కువ’అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బిజెపి అభ్యర్థులకు పార్టీ కార్యాలయం లభించడమే కష్టమైందని, ఎక్కడ సహకరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయోనని ప్రతి ఒక్కరూ భయపడ్డారని పేర్కొనడం ద్వారా అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్ తీరును మోదీ ఎండగట్టారు. సిద్ధాంతాలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడిన పార్టీ బిజెపి అని పేర్కొన్న మోదీ ‘ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినంతగా ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు కోల్పోలేద’ని అన్నారు. ఇందుకు కారణం ఫలితాలు ఎలా ఉన్నా వారు నమ్మిన సిద్ధాంతానికి దూరం కాకపోవడమేనని వివరించారు. 1969లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో జనసంఘ్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ విశే్లషకులు దానిపై దృష్టి పెట్టారని, వాజపేయి సారథ్యంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రపంచం విస్మయానికి గురైందని చెప్పారు. బిజెపి గురించి ఇతరులు ద్వారా వినడమే తప్ప ఆ పార్టీ సిద్ధాంతాల్ని లోతుగా అర్థం చేసుకోలేక పోవడమే అందుకు కారణమన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు అద్వానీ,రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు.

చిత్రం.. గురువారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం బిజెపి శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ