రాష్ట్రీయం

కరువొస్తే..కన్నీళ్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31:కరువొస్తే..కన్నీళ్లేనా..!నివారణ, నిరోధక చర్యలు తీసుకోవడానికి ఇప్పటి వరకూ రాష్ట్రాలు చేసిందేమిటి? కరవుకాటకాలు సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఏలాంటి ఏర్పాట్లు జరిగాయంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు గురువారం నిలదీసింది. ఓ పక్క ఎండలు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో కరువు నిర్వహణ యంత్రాంగాల్ని రాష్ట్రాల్లో ఏ మేరకు ఏర్పాటు చేశారన్నదానిపై పూర్తి వివరాలను అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కనీసం జిల్లాల స్థాయిలో కూడా విపత్తుల నియంత్రణకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో తెలుపాలని కోరింది.
కరువు మాన్యువల్‌తో పాటు దీన్ని ఎదుర్కొనే మార్గదర్శకాలను ఇప్పటి వరకూ అందించక పోవడం పట్ల కేంద్రాన్ని సుప్రీం చివాట్లు పెట్టింది. ఉపగ్రహ వివరాలను ఆసరా చేసుకుని వర్షపాత అంచనాలను విశే్లషించాలని కోరింది. దీని వల్ల కరువు కాటకాలు సంభవించే అవకాశం ముందే తెలుస్తుందని..తగిన నిరోధక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన సుప్రీం బెంచి తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే రాష్ట్రాల రైతులకు ఏ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.