జాతీయ వార్తలు

అదంతా మన రాజ్యాంగ మహిమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగర్, కథువా: మన దేశానికి ఒక పేద, దోపిడీకి గురైన వర్గానికి చెందిన వ్యక్తి రాష్టప్రతి, రైతు కుటుంబానికి చెందిన మనిషి ఉప రాష్టప్రతి, చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడంటే అది రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగ మహిమేనని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ అబ్దుల్లాలు, ముఫ్తీలు జమ్మూకాశ్మీర్‌లోని మూడు తరాలను నాశనం చేశారని, వారు భారత్‌ను విభజించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అలీగర్‌లో, ఎన్నికల సందర్భంగా కథువాలలో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. యూపీలోని విపక్షాల పొత్తు గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేయలేని పార్టీ దేశానికి ప్రధానిని ఎలా అందిస్తుందని ప్రశ్నించారు.
కాశ్మీర్ ప్రజలు కొంతమంది వ్యక్తుల చేతిలో కట్టుబానిసలుగా పనిచేయాలని కోరుకోవడం లేదని మోదీ అన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేస్తున్న డిమాండ్, 370 ఆర్డికల్‌ను కనుక రద్దు చేస్తే భారత్ నుంచి వేరుపడతామంటూ మెహబూబా ముఫ్తీ చేసిన హెచ్చరికను ఆయన ప్రస్తావిస్తూ ఆ రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని మూడు తరాల పాటు నాశనం చేశాయని విరుచుకుపడ్డారు. వారు రాష్ట్ర అభివృద్ధిని మొదటి నుంచి అడ్డుకున్నారన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ కావాలంటే వారిద్దరినీ ఓటుతో తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వారిద్దరిని పంపిస్తేనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని పేర్కొన్నారు. మొదటివిడత పోలింగ్‌లో జమ్మూకాశ్మీర్ ప్రజలు పెద్దయెత్తున ఓటింగ్‌లో పాల్గొని ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పారని ఆయన ప్రశంసించారు. దీని ద్వారా ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని వారు చాటి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోగం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ భద్రతా దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా తాము అధికారంలోకి వస్తే ఏఎఫ్‌ఎస్‌పిఏను తొలగిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని విమర్శించారు. దేశభక్తులెవరైనా దీనిని కోరుకుంటారా? మన భద్రతా దళాలు సురక్షితంగా ఉండకూడదని అనుకుంటారా? అని మోదీ ప్రశ్నించారు. భారత్‌ను బెదిరించే రోజులు పోయాయని, ఇప్పుడు భారత్ ఉగ్రవాదులను అంతం చేయడానికి అవసరమైతే అవతలి దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సైతం దాడులు నిర్వహించి, వారికి మద్దతు తెలిపే వారికి బుద్ధి చెబుతుందని అన్నారు. మీరు ఇప్పుడు ఎన్నుకోబోతున్నది కేవలం ఒక్క ఎంపీని మాత్రమే కాదని, జాతిని కొత్త విధానం, కొత్త వ్యూహంతో ముందుకు తీసుకుపోయే పార్టీనని మరచిపోవద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. కాశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీల పొత్తును అపవిత్ర కూటమిగా అభివర్ణించిన ఆయన ఎన్‌సీ, పీడీపీలు విచక్షణ కోల్పోయి రక్తపుటేరులు పారిస్తాం.. ప్రత్యేక ప్రధాని కావాలి లాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మన పొరుగుదేశమైన పాకిస్తాన్ సైతం తమకు అణుబాంబులున్నాయని బెదిరించి ఇప్పుడు చల్లబడిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇద్దరు ప్రధానులు కావాలని డిమాండ్ చేస్తున్న ఈ రెండు పార్టీలు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన ఆయన జమ్మూకాశ్మీర్, లేహ్, లడక్‌లోని ప్రతి పౌరుడు, పిల్లవాడు సైతం భారతీయుడేనని స్పష్టం చేశారు. వారసత్వ పాలనను అంబేద్కర్ ఆనాడే వ్యతిరేకించారని, అది ప్రజాస్వామ్యానికి శత్రువని పేర్కొన్నారని మోదీ గుర్తు చేశారు. ‘అందుకే కాశ్మీర్‌లో కాంగ్రెస్ మద్దతిస్తున్న వారసత్వ కుటుంబాలను అడ్డుకోవడానికి నేను వారి ముందు పెద్ద గోడలా నిలబడతాను’ అని మోదీ పేర్కొన్నారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని సైతం రాజకీయం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

చిత్రాలు.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సభల్లో పార్టీ అభ్యర్థి జయప్రదతో ప్రధాని మోదీ,
* అనంతరం బీజేపీ నేతలతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.