జాతీయ వార్తలు

తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐపీని ఉపయోగించడం వల్ల తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత క్షమాపణలు చెప్పారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘం (ఈసీ)పై ఆరోపణలు చేశారు. బాబు నాయకత్వంలో ఇరవై మూడు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు ఢిల్లీలో సమావేశమై ఈవీఎంలు మొరాయించటం వలన ఓటర్లకు కలుగుతున్న నష్టాల గురించి చర్చించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చునని ఆయన వాదించారు. తెలంగాణలో ఒక వ్యక్తి కంప్యూటర్‌పై కూర్చొని ‘్ఫం 7 సీ’ ద్వారా ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ తొలగింపుపై తమ పార్టీ కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం క్షమాపణలు చెప్పిందని తెలిపారు. ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించిన విషయాన్ని ఎన్నికల సంఘం ఆ తరువాత అంగీకరించి క్షమాపణలు చెప్పింది, ఈసీ తప్పిదాలకు ఓటర్లు ఇంత మూల్యం చెల్లించాలా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొత్తం పోలైన ఓట్ల కంటే, లెక్కించిన ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈసీ దీనిని ఎలా సమర్థిస్తుందని చంద్రబాబు నిలదీశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం సాధ్యం కాబట్టే ఇలా జరుగుతోందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.