జాతీయ వార్తలు

ఆ నల్ల పెట్టెలో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించిన హెలికాప్టర్‌లో నలుపు రంగు పెట్టే తీసుకెళ్ళడంపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ కర్నాటకలోని చిత్రదుర్గ్‌లో ప్రచారం చేసేందుకు వెళ్ళిన హెలికాప్టర్‌లో నలుపు రంగు పెట్టే తీసుకెళ్ళడంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఆనంద శర్మ ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషన్‌ను (ఇసి) డిమాండ్ చేశారు. హెలికాప్టర్‌లో పెట్టె తీసుకుని రావడంపై తమ పార్టీ కర్నాటక శాఖ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ప్రధాని ప్రయాణించిన హెలికాప్టరే కాకుండా ఇంకా మూడు హెలికాప్టర్లు ఎస్కార్టింగ్‌గా వెళ్ళడాన్ని తాము గమనించామని ఆయన చెప్పారు. ప్రధాని ప్రయాణించిన హెలికాప్టర్ చిత్రదుర్గ్‌కు చేరుకున్న తర్వాత ఆ నలుపు రంగు పెట్టెను వేరే ప్రైవేటు కారులో తరలించారని, ఆ కారు ఎస్‌పిజీ కార్ల కాన్వాయ్‌లో లేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రధాని తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.