జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్(ఎంపీ), ఆగస్టు 20: మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రహత్‌గఢ్ జిల్లాలో శనివారం ఓ ఇల్లు కూలిపోయిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారు. వర్షాలకు నానిపోయి ఇల్లు కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున రహత్‌గఢ్‌లోని ఏడో వార్డులో మెహతాబ్ సిల్పకర్ (59) ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాలకే ఇల్లు కూలిపోయిందని జిల్లా అడిషనల్ ఎస్‌పి వివేక్ అగర్వాల్ తెలిపారు.
ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మెహతాబ్ భార్య మనోరాణి (55), కుమారులు వికాస్ (8), నితిన్ (14), కుమార్తె సంజనా (11), కల్లూ (30), అతడి భార్య మాయా (25), వారి చిన్నారి తమన్న (18నెలలు) మృతి చెందారు. యజమాని మెహతాబ్, మరో కుమారుడు లఖన్ (26), మహేంద్ర (20) గాయపడ్డారని ఎఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. కాగా, ఛత్తర్‌పూర్ జిల్లాలోని ఓ నాలానుంచి శనివారం మధ్యాహ్నం 3 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారంతా శుక్రవారం సాయంత్రం ఒక బ్రిడ్జిపైనుంచి నాలాలోకి కొట్టుకుపోయిన కారులో ఉన్నట్లు చెబుతున్నారు. కట్నీ జిల్లాలోని భోరిబండ్ తహసీల్‌లో శుక్రవారం సాయంత్రం ఒక పూరి గుడిసె కూలిపోవడంతో మూడేళ్ల బాలుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మరో 24 గంటల పాటు కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వణికిస్తున్న గంగానది
పాట్నా: మరోవైపు బిహార్‌లో గంగానదిలో వరద పెరిగిపోవడంతో నది ఒడ్డు వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో దాని ప్రభావం కనిపించింది. పాట్నా, భాగల్పూర్, ఖగారియా, కతిహార్, సివాన్, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల్లో గంగానదితో పాటు మరో అయిదు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

చిత్రం.. భారీవర్షాలకు మధ్యప్రదేశ్‌లో కూలిన ఇల్లు