జాతీయ వార్తలు

ఢిల్లీలో దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లకు సర్దుబాటు చేసుకునే అంశంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ దోబూచులాటలాడుతున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించేందుకు ఢిల్లీలో సీట్ల సర్దుబాటుకు తాము సిద్దమేనంటూ ఇరుపార్టీలు తరచూ ప్రకటనలు చేసుకోడమే తప్ప ముందడుకు వేయడం లేదు. సీట్ల సర్దుబాటు జరగకపోవటానికి కాంగ్రెస్ కారణమని ఆప్ విమర్శిస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుల మొండి వైఖరే కారణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేస్తూ బీజేపీని ఓడించేందుకు ఆప్‌తో సర్దుబాటుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి నాలుగు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆప్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను ఆమోదించటం లేదు. ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్‌లోని సీట్లలో కూడా సర్దుబాటుకు కాంగ్రెస్ అంగీకరించాలని ఆప్ నేతలు షరతులు పెడుతున్నారు. ఈ వాదనను కాంగ్రెస్ నాయకులు కొట్టివేస్తున్నారు. ఢిల్లీలోని సీట్ల సర్దుబాటుకు హర్యానా, పంజాబ్ సీట్లతో ముడి పెట్టటం ఎంత మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయని, వాటిని బట్టే రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆప్‌తో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారికి నాలుగు సీట్లు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ గాంధీ సోమవారం ఈ అంశంపై మరోసారి ట్వీట్ చేశారు.