జాతీయ వార్తలు

గుజరాత్‌కు సుప్రీంలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట కలిగింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ విచారించిన ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ ఎంకె ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రఛూడ్‌తో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది. గుజరాత్ ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గి వాదనలు వినిపించారు.