జాతీయ వార్తలు

పూర్తిగా సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లను బీభత్సమైన వరదలు ముంచెత్తడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వరద సహాయ, పునరావాస కార్యక్రమాలలో ఈ రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన సోమవారం భరోసా ఇచ్చారు. యూపీ సిఎం అఖిలేష్ యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో మోదీ ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రాష్ట్రాలలో వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని, అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారని ప్రధాని తెలిపారు. ఈ అయిదు రాష్ట్రాలలో వరద ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించినట్లు మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

chitram.. గంగానదికి వరద ఉద్ధృతి పెరగడంతో అలహాబాద్‌లో మునిగిపోయన దేవాలయం