జాతీయ వార్తలు

జీవీఎల్‌పై బూటు విసిరిన డాక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి అనూహ్యంగా బూటు విసిరాడు. గురువారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ భుపేంద్ర యాదవ్‌తో కలిసి జీవీఎల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. ఈ అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు. విలేఖరిగా చెప్పుకుని వచ్చిన వ్యక్తి జీవీఎల్‌పై తన బూట్లను ఒకటి తరువాత ఒకటి విసిరాడు. ఒక షూ పక్కన పడిపోగా, మరొకటి ఆయన ఎదురుగా పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ వ్యక్తిని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం నరసింహారావు విలేఖరుల సమావేశాన్ని కొనసాగించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తరపున ప్రజ్ఞాసింగ్‌ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జీవీఎల్ మాట్లాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆ వ్యక్తిని పట్టుకున్న పార్టీ కార్యాలయ సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కమల మార్కెట్ స్టేషన్‌కు తరలించారు. జీవీఎల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు. కాన్పూర్‌లోని భార్గవ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు అతని వద్ద విజిటింగ్ కార్డు లభించింది. అయితే అతను అలా ఎందుకు దాడికి పాల్పడ్డాడు అనేది తెలియాల్సి వుంది. అతని ఫేస్‌బుక్ పేజీలో తనను తాను విజిల్ బ్లోయర్‌గా పేర్కొన్నాడు. గత మూడేళ్లల్లో ఈపీఎస్‌యూలో 14 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పాడు. తన పోస్టుల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అవినీతికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు.
ఇది ప్రేరేపిత దాడి: జీవీఎల్
తనపై జరిగిన దాడి కాంగ్రెస్ ప్రేరిపిత దాడిగా జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తిపై అనేక ఆరోపణలున్నాయని, అతని ఆస్తులపై గతంలో ఆదాయ పన్ను శాఖ తనిఖీలు కూడా జరిగాయని చెప్పారు.
దాడికి బీజేపీ నేత కన్నా ఖండన
విజయవాడ: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావుపై జరిగిన దాడిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో గురువారం ఖండించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా ఆయనపై కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ చెప్పు విసిరిన ఘటనపై కన్నా స్పందించారు. ఇది బీజేపీ అభివృద్ధి విధానాలను, మోదీ ప్రజాకర్షణను ఓర్వలేని కాంగ్రెస్ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. సైద్ధాంతికంగా రాజకీయాలను ఎదుర్కొలేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. మే 23న వచ్చే ఫలితాలే విపక్షాలకు చెంపపెట్టు కాగలవని పేర్కొన్నారు.