జాతీయ వార్తలు

కాశ్మీర్‌ను వేరు చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌గఢ్, ఏప్రిల్ 18: జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని దీన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయలేరని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. బీజేపీ ఉన్నంత కాలం భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడం ఎవ్వరి తరం కాదని, తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా కాశ్మీర్‌ను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాయ్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా ‘కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ ఎన్నికైతే దేశంలో వలస దారులను గుర్తించి వెనక్కి పంపేస్తాం’ అని స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు విడిగా ప్రధాన మంత్రి ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన డిమాండ్‌ను ప్రస్తావించిన అమిత్ షా ఒకే దేశానికి ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండడం సాధ్యమా? అని ప్రశ్నించారు. అబ్దుల్లా ప్రకటనపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని రాహుల్ గాంధీని తాను నిలదీస్తూనే ఉన్నానని, కానీ ఆయన నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదని అమిత్ షా తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతోందని, మళ్లీ ఆయన సారథ్యంలోని ప్రభుత్వమే ఎన్నికల అనంతరం ఏర్పాటు కావడం ఖాయమని అమిత్ షా అన్నారు. ఒకవేళ తాము అధికారంలో లేకపోయినా కూడా ఏ ఒక్క బీజేపీ కార్యకర్త బతికున్నా కాశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడం ఎవరితరం కాదన్నారు. ఒక వేళ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని ఎవరి అన్నా దేశ ప్రజలు వారిని తరిమి కొడతారని, ఇలాంటి ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అమిత్ షా తెలిపారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దును కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్న ఆయన తాము అధికారంలోకి వస్తే ఈ అధికరణను రద్దు చేయడం ఖాయమని తెలిపారు. వలస దారులు దేశ భద్రతకే ప్రమాదమని, వారిందరినీ దేశం నుంచి తరిమికొడతామని అమిత్ షా పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ వైమానిక దళం దాడి చేస్తే ఉగ్రవాద కేంద్రాన్ని భస్మీ పటలం చేయడం ప్రతిపక్షాలకు ఎంత మాత్రం ఆనందం కలిగించలేదన్నారు. అందుకే ఈ దాడికి ఆధారాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. 40 మంది భారత జవాన్లను ఉగ్రవాదులు మట్టుబెట్టిన నేపథ్యంలో మోదీ సర్కార్ అత్యంత సాహసోపేతంగా ఈ ప్రతీకార చర్య చేపట్టిందని ఆయన గుర్తుచేశారు. గతంలో యూపీఏ హయాంలో కూడా ఉగ్రదాడు జరిగినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వౌనానే్న ఆశ్రయించారని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పుల్వామా దాడి జరిగిన 13 రోజుల్లోనే ప్రతీకార దాడి జరిపి వందల సంఖ్యలో పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు.