జాతీయ వార్తలు

మహిళల ఓట్లన్నీ నావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌పూర్, ఏప్రిల్ 18: రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గ ప్రజలు తమకే పట్టం కడతారని, ముఖ్యంగా మహిళా ఓట్లన్నీ తమకే వస్తాయన్న ధీమాను బీజేపీ అభ్యర్థి మాజీ నటి జయప్రద వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నియోజక వర్గ ప్రజల ఆలోచన మారిపోయిందని, ఎలాంటి విభేదాలు లేకుండా తనకే మద్దతు లభిస్తుందన్న ధీమా ఉందని అన్నారు. అభద్రతా భావంతోనే ఆజం ఖాన్ తనపై ఆ రకమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న జయప్రద అతడిపై చర్యలు తీసుకోనందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కూడా విమర్శించారు. దీని దృష్ట్యా రామ్‌పూర్ నియోజక వర్గంలో మహిళలందరూ కూడా సమాజ్‌వాదీ పార్టీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆజం ఖాన్ ఆత్మన్యూనత కలిగిన వ్యక్తి అని, అతడికి మహిళల ఎదుగుదల ఎంతమాత్రం గిట్టదన్నారు. ఆజం ఖాన్ ఆ విధంగా వ్యాఖ్యలు చేసినా, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఖండించక పోవడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా అదే ధోరణితో వ్యవహరించడాన్ని బట్టి చూస్తే మహిళల పట్ల అతడి ఆలోచనలోనూ ఎలాంటి మార్పురాలేదన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఆజం ఖాన్‌పై ఇటు మహిళా కమిషన్, అటు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళ గౌరవాన్ని పరిరక్షించలేనప్పుడు వారికి రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేయడం అర్థం లేనిదే అవుతుందని అన్నారు. ఆజం ఖాన్ అంటే రామ్‌పూర్ ప్రజలు భయపడి పోతున్నారని పేర్కొన్న జయప్రద ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. పైగా ఇక్కడ ఎవరికీ ఉద్యోగాలు లేవని, విద్యార్హతలు కూడా అంతంత మాత్రమే అన్నారు. ఆజం ఖాన్ తన వాళ్లకే కాంట్రాక్టులు ఇచ్చుకోవడం వల్ల ఆయన చుట్టూ చేరే గూంఢాల సంఖ్య పెరిగిపోయిందని అన్నారు.