జాతీయ వార్తలు

డిఎంకెకు హైకోర్టులో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 22: తమిళ ప్రతిపక్ష పార్టీ డిఎంకెకు హైకోర్టులో చుక్కెదురైంది. 79 మంది డిఎంకె శాసన సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని మద్రాస్ హైకోర్టులో పార్టీ సవాల్ చేసింది. ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మహాదేవన్ తోసిపుచ్చుతూ సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై 80 మంది డిఎంకె సభ్యులపై స్పీకర్ వారంపాటు సస్పెన్షన్ వేటు వేశారు. స్పీకర్ పి ధనపాల్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని స్టాలిన్ కోర్టులో సవాల్ చేశారు.
‘సభా కార్యక్రమాలు పర్యవేక్షించే అధికారం స్పీకర్‌కు ఉంది. ఈ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోలేం. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం అన్నది తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్ కోర్టులో వాదించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని ఆయన అభ్యర్థించారు. సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని తప్పుపట్టిన పిటిషనర్ దానికి సంబంధించిన కాపీని కోర్టును అందజేశారు. స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామ్యమని, సభా సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని ప్రతిపక్ష నేత తెలిపారు. ఈ నెల 17న అసెంబ్లీలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో 80 మంది డిఎంకె శాసన సభ్యులను స్పీకర్ ధనపాల్ సస్పెండ్ చేశారు. అయితే ఆ రోజు సంఘటనతో సంబంధం లేదని తేలడంతో ఒక సభ్యుడిని మినహాయించారు.

chitram.. తీర్పు అనంతరం హైకోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న డిఎంకె నేత స్టాలిన్