జాతీయ వార్తలు

వర్తకులతోనే ఆర్థిక పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కేంద్రంలో రెండో సారి అధికారాన్ని చేపట్టాలని బలమైన ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వర్తక వ్యాపారులకు భారీ తాయిలాలతో కూడిన హామీలందించారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే వర్తకులకు 50 లక్షల రూపాయల రుణం అందిస్తామని, అలాగే క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించడంతో పాటు చిన్న వర్తకులకు పెన్షన్ సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. అన్ని వేళల్లోనూ తమ ప్రభుత్వం వర్తక వర్గాలకు ప్రయోజనాలను కలిగిస్తూనే ఉన్నదని, కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యాపారులను దొంగలుగా ముద్ర వేస్తున్నదని మోదీ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన వర్తక వ్యాపారుల సభలో మాట్లాడిన మోదీ కేంద్రంలో బీజేపి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా వర్తకుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నదన్నారు. దాదాపు 1500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిందని, వ్యాపార వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడంతో పాటు పరపతి సౌకర్యాన్ని కల్పించిందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు వర్తకులను వెనె్నముకగా అభివర్ణించిన ప్రధాని మోదీ గతంలో వీరికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. వర్తకుల క్రియాశీలక ప్రమేయం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. వర్తకులు తమ వ్యాపారాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటారని, వారి చేయూత మూలంగానే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ వచ్చిందన్నారు.
ఈ ఐదేళ్ళ కాలంలో వ్యాపార వాణిజ్య రంగాలను సులభతరం చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ఇందుకు తాము అమలు చేసిన ఎన్నో నిర్ణయాలకు తార్కాణమని ఆయన తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన మోదీ 70 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ వ్యాపారుస్తులను అవమానించిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వీరు చేసిన కృషిని ఏ మాత్రం గుర్తించకుండా వారిపై దొంగలుగా ముద్ర వేసిందని ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీ కూడా వర్తక కుటుంబం నుంచే వచ్చారన్న విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ వీరికి చేసిన అవమానాలను చెప్పారు. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే జాతీయ వర్తకుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, వర్తకులకు క్రెడిట్ కార్డులను తీసుకుని వస్తామని, చిన్న దుకాణందారులకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా 50 లక్షల రూపాయల మొత్తాన్ని వీరికి రుణంగా ఇచ్చేందుకు అవసరమైన నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక వైపు తమ పార్టీ కార్యకర్తలకు అక్రమ నిల్వలకు పాల్పడినా వస్తువుల ధరలు పెరిగి పోవడానికి కారణమైనా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వర్తకులనే నిందించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. గత ఐదేళ్ళ కాలంలో వ్యాపారానుకూలతను పెంపొందించడానికి వీలుగా రోజుకొకటి చొప్పున 1500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని అన్నారు. వ్యాపార నిబంధనలను సులభతరం చేశామని ఇన్‌స్పెక్టర్‌రాజ్‌ను అదుపు చేశామని, అలాగే ఆదాయం పన్ను మదింపులో వ్యక్తిగత ప్రమేయాన్ని కూడా తొలగించామన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద వాటాదారులుగా వర్తకులను తాను పరిగణిస్తున్నానని మోదీ తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం కొన్ని సందర్భాల్లోనే వ్యాపార, వాణిజ్య వర్గాలను గుర్తు చేసుకుంటాయని అన్నారు. 17 కేంద్ర, రాష్ట్ర పన్నులను కలపడం ద్వారా 2017 జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి తెచ్చామని, దీని వల్ల వ్యాపార పారదర్శకత పెరిగిందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రాల్లోని చెక్ పోస్టులు తొలగిపోయాయని, నమోదైన వర్తకుల సంఖ్య రెండింతలైందన్నారు. అయితే జీఎస్‌టీ అమలులో తప్పులు దొర్లి ఉండవచ్చని పేర్కొన్న మోదీ వర్తకుల నుంచి తగిన సూచనలు తీసుకుని ఆ లోపాలను నివారించడం జరిగిందని ఆయన తెలిపారు. దైనందినంగా వినియోగించే వస్తువులపై పన్నులు తొలగించామని, అలాగే 98 శాతం వినియోగ వస్తువులపై 18 శాతం కంటే తక్కువగానే పన్ను అమలు అవుతున్నదని అన్నారు. జీఎస్‌టీ కింద టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసే ప్రక్రియ సులభతరం అయ్యిందని పేర్కొన్న ఆయన చిన్న వ్యాపారులకు కూడా ఇచ్చే మినహాయింపులు కూడా రెండింతలయ్యాయని అన్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపిన మోదీ ‘నేను మీ సేవకుడిని, యజమానిని కాదు..’ అని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ళ కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివరించారు. రోజు వారీగా పేద మహిళలకు 70 వేల ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను అందిస్తున్నామని, అలాగే రోజు వారీగా 50 వేల ఇండ్లకు విద్యుత్తు కనెక్షన్లను సమకూరుస్తున్నామని ఆయన తెలిపారు. పేదలకు జన్‌ధన్ ఖాతాలను తెరిచామని, ముద్ర పథకం కింద దైనందిన వారీగా లక్ష మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు అందిస్తున్నామని అన్నారు.