జాతీయ వార్తలు

ఎన్నికల తర్వాతైనా మాతో కలవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైమ్‌గంజ్ (యూపీ), ఏప్రిల్ 21: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ పార్టీలు పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్నా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడం తప్ప వాటికి మరో ప్రత్యామ్నాయం లేదని యూపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవి తమతో పొత్తుపెట్టుకోవడం ఖాయమని పేర్కొన్న ఆయన యూపీలో కాంగ్రెస్‌కు చాలా పటిష్టంగా ఉందని, రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమనే ఎన్నుకుంటున్నారని చెప్పారు. మొదట్లో ఈ మూడు పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కోవాలని తమ పార్టీ గట్టిగా నిర్ణయించుకుందని చెప్పిన ఆయన గతం గతః అంటూ కొన్ని పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదని, అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అవి తమతో కలిసి వస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. యూపీలో ఆ మూడు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు వైఫల్యం వల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కేంద్రంలో బీజేపీ పాలనపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని, ఆ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో వెళ్లగొట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ఫర్రూకాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖుర్షీద్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుట్, బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగ్రవాల్ నుంచి ముక్కోణపు పోటీని ఎదుర్కొంటున్నారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ మహాకూటమి ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలిసిపోతాయా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ అలా కలవకుండా ఉండటానికి గల కారణాలేమీ తనకు కన్పించడం లేదని అన్నారు. అలా కలవకపోతే మహాకూటమికి అర్థమే లేదని పేర్కొన్నారు. యూపీలోని మహాకూటమి, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిని నిర్వహించనున్నాయని ఆయన చెప్పారు. బీజేపీతో తాము ఎలాంటి బంధాన్ని కోరుకోవడం లేదని ఇప్పటికే ఆ మూడు పార్టీల కూటమి స్పష్టం చేసిన నేపథ్యంలో వారు కాంగ్రెస్ వెంట వస్తారు అని చెప్పడానికి రాకెట్ సైన్స్ ఏమన్నా చదువుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల పాకిస్తాన్‌పై సైనికులు జరిపిన దాడిని బీజేపీ పదేపదే ఎన్నకల ప్రచారంలో వాడుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిని పలువురు ప్రజలు, మేధావులే కాక సైనికదళాల్లో పనిచేసిన మాజీలు సైతం ఖండిస్తున్నారని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.