జాతీయ వార్తలు

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్పెట్ట (వాయనాడ్), ఏప్రిల్ 21: సంకుచిత భావాలు కలిగిన నాయకుల తమ విలువైన ఓటు ద్వారా దేశాన్ని కాపాడాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రజలకు పిలుపునిచ్చారు. సంకుచిత ధోరణి అవలంబిస్తున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతూ అపహాస్యంపాలు చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఓటు ద్వారా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు సాధారణమైనవి కావని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి దేశాన్ని రక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ వీరజవాన్ వీవీ వసంత్‌కుమార్ కుటుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేయదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఒక బలమైన ఆలోచనతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రియాంక తన సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ స్థానాల్లో ఎన్నికల ప్రచారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘రాష్ట్రంలో భాగస్వామ్య కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించండి. అధికారంలోకి రావడానికి పోరాడడం లేదు. కానీ ఎన్నికల్లో పెద్ద మార్పు రావాలనే మా పోరాటం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ‘ప్రజలు తమ భావాలను ఉన్నపళంగా వ్యక్తీకరించలేరు. ఇందుకు భయం ఒక కారణం. ప్రజల హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడా అణగదొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు జరుగుతున్న ఎన్నికలు సాధారణమైనవని కావని ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని ఆమె సూచించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రియాంక గాంధీ ఇటు బీజేపీనిగానీ అటు ఎన్డీయే ప్రభుత్వాన్నిగానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. కానీ పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తుంటే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం భయపడుతోందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందని, ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రజలదేనని ఆమె అన్నారు. దివంగత సీఆర్‌పీఎఫ్ జవాను వసంతకుమార్ కుటుంబ సభ్యులతో దాదాపు అరగంటసేపు గడిపిన ప్రియాంక వారికి సానుభూతి తెలిపి ఓదార్చారు. అనంతరం ఇటీవలి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తొలిసారి గిరిజన మహిళగా ఎంపికైన శ్రీ్ధన్య సురేష్ కుటుంబ సభ్యులను సైతం ఆమె కలుసుకుని కాసేపు ముచ్చటించారు.