జాతీయ వార్తలు

హేయం..అటవికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: శ్రీ లంకలో ఈస్టర్ రోజు జరిగిన దారుణ నరమేధాన్ని అత్యంత హేయమైన అటవిక చర్యగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో ఖండించారు. 160 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీ లంక ప్రజలకు తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసిల్ల, ప్రధాన మంత్రి రాణె విక్రమ సింఘేతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ విషయంలో శ్రీ లంకకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉప ఖండంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావు లేదన్నారు. జరిగిన ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండిస్తూ, ఈ మారణ హోమాన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని ఆయన కోరారు. మన దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజస్థాన్‌లోని చిట్టోర్‌ఘర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ శ్రీ లంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ గురించి ప్రస్తావిస్తూ తీవ్రంగా ఖండించారు. ఈ కష్టకాలంలో ఆ దేశ ప్రజలకు అండగా ఉంటామన్నారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళలో పెకిలించి వేసేందుకు ప్రజలు ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకుని బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.