జాతీయ వార్తలు

‘నామ్‌దార్’ను సాగనంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ (యూపీ), ఏప్రిల్ 21: ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు తనను గెలిపించిన ప్రజలకు కనీసం ఒక్కసారి కూడా తన ముఖం చూపించకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో వీడ్కోలు పలకాలని కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ ప్రజలకు పిలుపునిచ్చారు. అమేథీ నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ చీఫ్‌తో బీజేపీ తరఫున ఎంపీగా తలపడుతున్న ఆమె ధరాయిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తా ము ఎంతో అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ‘నామ్‌దార్’కు ‘కమలం’ పువ్వు (బీజేపీ గుర్తు) ఇచ్చి అమేథీ నుంచి ఢిల్లీకి వీడ్కోలు పలకాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమేథీ నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చోర్ (దొంగ) అంటూ రాహుల్ వ్యాఖ్యానిస్తున్నా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన (ప్రధాని) ఎలాంటి వివక్ష కనబరచలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే కిలో పంచదార (చక్కెర)ను 13 రూపాయలకే అందజేస్తామని ఆమె ప్రధాని తరఫున భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి విమర్శల దాడికి పాల్పడ్డారు. ‘తప్పిపోయిన ఎంపీ మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వచ్చారు. స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉన్నా.. ఆయన ఎప్పుడూ అలా చేయలేదు’ అని ఆమె ఆరోపించారు. గత 15 ఏళ్లుగా ఎంపీలాడ్స్ కింద వచ్చిన నిధులను నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నడూ వినియోగించిన దాఖలాలు లేవని ఆమె ధ్వజమెత్తారు. ‘గెలిచిన తర్వాత ఎన్నడూ తన ప్రజలకు తన ముఖం చూపించని ఆ నాయకుడు (రాహుల్ గాంధీ)కి ఈసారి ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు వీడ్కోలు పలకడం ఖాయం’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.