జాతీయ వార్తలు

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 21: అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తానని తన ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విరుచుకుపడ్డారు. బీజేపీ దేశ భద్రత కోసం అవసరమయితే మరిన్ని కఠినమయిన చట్టాలను తీసుకొస్తుందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో గల జమునా కలారి గ్రామంలో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ వారు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. మేము మాత్రం అవసరమయితే దేశ భద్రతకోసం మరిన్ని కఠినమయిన చట్టాలను రూపొందిస్తాం’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదంపై పోరును బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. ‘్భరత సైన్యం ఉగ్రవాద దాడికి తగిన విధంగా సమాధానం చెప్పినప్పటికీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దానిని రాజకీయం చేస్తూ, సైనిక బలగాల పరాక్రమంపై అనుమానాలు వ్యక్తం చేశాయని, భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది చనిపోయారని ప్రశ్నించాయని రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. ‘్ధర్య సాహసాలు గల సైనిక బలగాలు తమ దాడిలో మృతి చెందిన వారిని లెక్కించవు’ అని ఆయన అన్నారు. భారత్ తనకు ఉన్న ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించడం ద్వారా ఈ శక్తిసామర్థ్యాలు ఉన్న ప్రపంచంలోని నాలుగో దేశంగా అవతరించిందని పేర్కొన్నారు.