జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందర్‌బార్/పిప్లాబావ్, ఏప్రిల్ 22: దీర్ఘకాలంగా భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సవాళ్లను తమ ప్రభుత్వం సాహసోపేతంగా తిప్పికొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో అవసరమైన స్థాయిలో స్పందించలేదు. సోమవారం ఇక్కడ జరిగిన పలు ర్యాలీల్లో మోదీ విమర్శించారు. మళ్లీ తన అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు దెబ్బతింటాయన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మోదీ ఉన్నంతవరకు కోటాకు తిరుగే ఉండదని, యథాతథంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు అవుతాయని స్పష్టం చేశారు. ఆదివారం శ్రీలంకలో పలు క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, లగ్జరీ హోటళ్లపై ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ఈ మహమ్మారిని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ ఏకరువు పెట్టడం గమనార్హం. తమ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగానే భారత్‌లో ఉగ్రవాదం దాదాపుగా సమసిపోయిందని, కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, అది కూడా జమ్మూ కాశ్మీర్‌లోనేనని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ అప్పగించలేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఖండించిన మోదీ నిజానికి యూపీఏ హయాంలోనే ఈ సంస్థ దెబ్బతిన్నదని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ ఉత్పత్తులను విస్తృతంగా పెంచామని మోదీ తెలిపారు. ఓ పక్క ఈస్టర్ ప్రార్థనల్లో ప్రజలు తలమునకలైన సమయంలోనే శ్రీలంకలో పేలుళ్లు జరిగాయని గుర్తు చేసిన మోదీ ‘2014కు ముందు భారత్ పరిస్థితి ఏమిటి? ముంబై, పూణె, హైదరాబాద్, వారణాసి, అయోధ్య వంటి అనేక చోట్ల ఎప్పుడు పేలుళ్లు సంభవిస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉండేది’ అని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటని ప్రశ్నించిన ఆయన సంతాప సమావేశాలు జరపడం విచారం వ్యక్తం చేయడం తప్ప ఆ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధనకు చేసిందేమీ లేదు అని అన్నారు. కేవలం పాకిస్తాన్ పాత్ర ఉందని, లేదా మరో ఉగ్రవాద సంస్ధ చేసిందని ఆక్రోశం వెల్లగక్కిందే తప్ప ఏమీ చేయలేకపోయిందన్నారు. కానీ, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయిందని, సాహసోపేత చర్యల ద్వారా, కఠిన నిర్ణయాల ద్వారా భారత్ సత్తా ఏమిటో చూపానని అన్నారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొదటి రెండు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళి విపక్షాల్లో గుబులు పుట్టించిందని మోదీ అన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, దళారీ వ్యవస్థను పూర్తిగా తొలగించామని చెప్పారు. అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల జోళికెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మోదీ గిరిజనుల హక్కులను కాపాడుతామని, వారి భూములను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివాసీలకు అందిస్తున్న రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తేలేదని, వీరి వ్యవసాయ భూములను ఎవరూ లాక్కునే పరిస్థితే ఉండదని తెలిపారు.