జాతీయ వార్తలు

అనుభవం లేని సంస్థతో స్పాట్ వాల్యూయేషనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులు భవిష్యత్ గందరగోళంగా మారిందని, వేలాది మంది రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా భరోసా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఈ వివాదంపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పరీక్షల మూల్యాంకనం అనుంభవం లేని ‘గ్లోబరినా టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ ఇవ్వడం వల్లే వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులు పట్ల దురుసుగా ప్రవర్తించిన అశోక్ అనే అధికారిని భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైద్యం, విద్య వంటి కీలక శాఖలపై ప్రభుత్వం సరైన విధానంలో వ్యవహరించడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధినాయకత్వానికి పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోదని ఆయన నిప్పులు చెరిగారు.