జాతీయ వార్తలు

నిర్భయ దోషి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో మరణశిక్ష పడ్డ వినయ్ శర్మ బుధవారం రాత్రి జైలులోనే ఆత్మహత్యా యత్నం చేశాడు. నిర్భయ కేసులో దోషిగా ఉన్న అతడు తీహార్ జైలులో ఉన్నాడు. సెల్‌లోని ఐరన్ గ్రిల్‌కు టవల్ కట్టి మెడకు బిగించుకోబోయాడని అధికారులు వెల్లడించారు. రాత్రి 9.30 ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సెంట్రీ గమనించి భగ్నం చేశారు. వెంటనే అతడిని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వినయ్‌శర్మ గ్రిల్‌కు ఉరేసుకోబోయే ముందు ఎక్కువ మోతాదులో మందుబిళ్లలు వేసుకున్నట్టు జైలు వర్గాలు తెలిపాయి. 2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో ఓ పారామెడికల్ విద్యార్థిపై గ్యాంగ్‌రేప్ చేసిన ఆరుగురిలో శర్మ ఒకడు.