జాతీయ వార్తలు

ఉగ్రవాదులపై ఉన్న జాలి.. పోలీసులపై లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 22: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం కన్నీరు కారుస్తున్నారే తప్ప, అందులో అమరులైన పోలీసుల కోసం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాట్లా ఎన్‌కౌంటర్‌పై చర్చకు సిద్ధమా అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సవాల్ విసరడాన్ని ప్రస్తావిస్తూ 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదుల గురించి సోనియా ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారని, అదే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన పోలీస్ అధికారి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. అయినా ఆ ఎన్‌కౌంటర్ యూపీఏ హయాంలో జరిగిన విషయం మరువరాదన్నారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞాను నిలబెట్టడాన్ని సమర్థించుకున్న ఆయన ఆమెపై మాలెగావ్ పేలుళ్ల కేసులో అక్రమంగా కేసులు బనాయించారని, స్వామి ఆసిమానంద్ సైతం ఈ కేసులో నిర్దోషిగా బయటపడ్డారని, కోర్టు తీర్పు దీనిని స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. వారు నిర్దోషులుగా నిర్ధారణ అయ్యారని, అయితే అసలు దోషులెవరని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ దేశంలో చాలానాళ్లుగా నివసిస్తున్న కాందిశీకులు ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని, తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టి వారికి పౌరసత్వం కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. వారు గౌరవంగా ఈ దేశంలో నివసించవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో సమర్పించిన నామినేషన్‌లో ఆయన పౌరసత్వానికి సంబంధించి వచ్చిన వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం, బీజేపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ కేవలం ఓటమి భయంతోనే ఆమె ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2011 ఎన్నికల్లో ఆమె లెఫ్ట్ ఫ్రంట్‌తో పోటీలో ఉన్నప్పుడు పలువురు పోలీసు అధికారులను మార్చారని, పలువురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమించారని, అప్పుడు నోరుమెదపని మమత ఇప్పుడు ఎందుకు లొల్లి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో చేసిన పనినే ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో సైతం చేస్తున్నారని, దానిపై ఆమెకు అభ్యంతరాలు ఏమిటని అన్నారు. పోలీసు అధికారులను మారిస్తే తమ పార్టీ గూండాల ఆటలు చెల్లవని ఆమె తీవ్రంగా భయపడుతున్నారన్నారు.
మమత రాష్ట్రంలో మాఫియా రాజ్యం
ఉల్బేరియా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మాఫియా సామ్రాజ్యం వర్థిల్లుతోందని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోమవారం ఆయన మాట్లాడుతూ గోవులను స్మగ్లింగ్ చేయడంలో, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన సిండికేట్ రాజ్యానికి 90 రోజుల్లో తెరపడబోతోందని ఆయన అన్నారు. పశ్చిమబెంగాల్‌ను దివాలాకోరు రాష్ట్రంగా చేసిన ఘనత మమతకే దక్కుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మమతా బెనర్జీ బంధువులు, ఆమెకు దగ్గరవారే టీఎంసీ పాలనలో బాగుపడ్డారు తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు.