జాతీయ వార్తలు

ఉన్నత విద్యలో సంస్కరణల అవశ్యకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవశ్యకత ఉందని నీతి ఆయోగ్ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్నత విద్య భయంకరమైన పరిస్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ బోధించడంలో నైపుణ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన దేశంలో ‘ఎస్‌టీఇఎం’ (సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మ్యాధమెటిక్స్) విద్యపై వీఐఎఫ్ టాస్క్ ఫోర్సు నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశానికి పట్ట్భద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీలు ఉన్నా వారి నాణ్యత విషయం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేసినట్లయితే, దేశ పురోగతి, వృద్ధిని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందన్నారు. ఉన్నత విద్య దేశ పురోగతికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీలు వస్తున్నారని చాలా మంది అంటున్నారని, అయితే వారిలో చాలా మంది నాణ్యత ఏమిటో మనకు తెలిసిందేనని ఆయన అన్నారు. విద్యపై జీడీపీ ఒక్క శాతం నుంచి 1.5 శాతానికి పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై మరింత లోతైన అధ్యయనం, చర్చ జరగాల్సిన అవసరం ఉందని సారస్వత్ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో వీఐఎఫ్ డైరెక్టర్ అరవింద్ గుప్తా, ఇంకా వీఐఎఫ్ టాస్క్ ఫోర్సు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.