జాతీయ వార్తలు

మేం సిద్ధంగా ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, ఏప్రిల్ 23: ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటే ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా చేసిన హెచ్చరిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధం గా ఉన్నామని భారత్ మంగళవారం ప్రకటించింది. వచ్చేనెల నుంచి పూర్తి స్థాయిలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో భారత విదేశాంక మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారతదేశ ఇంధన, ఆర్థిక భద్రతా ప్రయోజనాలను పరిరిక్షించుకోవడానికి అమెరికా సహా సంబంధిత భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం అమలు అయితే తలెత్తే ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇరాక్ నుంచి చమురు దిగుమతులకు సంబంధించి భారత్, చైనా, గ్రీస్, ఇటలీ, తైవాన్, జపాన్ తదితర దేశాలకు గత ఏడాది నవంబర్‌లో అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువు మే 2వ తేదీతో ముగుస్తున్నది. ఈ మినహాయింపులను పొడిగించే ప్రసక్తే లేదని, మే 2 నుంచి ఈ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.