జాతీయ వార్తలు

రామేశ్వరం ఆలయ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం (తమిళనాడు), ఏప్రిల్ 23: శ్రీ లంకలో వరుస బాంబు పేలుళ్ళ ఘటనల నేపథ్యంలో తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన రామేశ్వరం ఆలయ పరిసరాల్లో ‘నిఘా’ మరింత పెంచి, భద్రతను కట్టుదిట్టం చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రామేశ్వరం ఆలయం సముద్ర తీరాన ఉన్న సంగతి తెలిసిందే. శ్రీ లంకలో దాడులకు తెగబడిన ఉగ్రవాదులు సముద్ర మార్గాన భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందన్న భావనతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాబట్టి సముద్ర తీరాన 24 గంటలూ కోస్ట్ గార్డు, కోస్టల్ మెరైన్ పోలీసులు, స్థానిక పోలీసులు కాపలా కాస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా కూడా సముద్ర తీరాన పోలీసులు క్షుణ్ణంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. సంవత్సరం పొడుగునా దేశం నలుమూలల నుంచీ భక్తులు ఆలయానికి తరలి వస్తారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అదనంగా పోలీసులను మోహరించి, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామని వారు వివరించారు. శ్రీ లంక నుంచి సముద్ర మార్గంలో 19 మైళ్ళ (నాటికన్) దూరంలో ఉన్న రామేశ్వరానికి గంట వ్యవధిలో చేరుకోవడానికి అవకాశం ఉంది. 1980లో శ్రీ లంకలో అంతర్యుద్ధం కారణంగా శ్రీ లంక తమిళ శరణార్థులు ఈ మార్గం ద్వారా భారత్ చేరుకుంటున్నారు.